Capital City Amaravati

మనకోసం మనం





ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది అందరికీ వందనాలు.

నేను మీ జాన్ హెన్రీ విజయవాడ పట్టణంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నందు మలేరియా సెక్షన్ లో హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నేను రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత విజయవాడ రాజధాని అయినప్పటి నుండి కాంట్రాక్టు వారికి సేవలు అందిస్తూ వచ్చాను.

 అయితే కొత్తగా జగన్ గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి జరిగిన పరిణామాల దృష్ట్యా కొంతమంది కాంట్రాక్ట్ లో పనిచేసే సిబ్బంది మీరు పనిచేయవలసిన అవసరం లేదు కొత్తగా వచ్చిన మా సంఘాలు మా కోసం ఎంతో కష్టించి పనిచేస్తూ మా కోరికలు అన్ని క్షణాల్లో రోజుల్లో తీర్చేస్తాయి మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు అని మాట్లాడటం వలన కొంత మానసిక క్షోభకు గురై గత సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున కాంట్రాక్టు వారికి సేవలు అందించే విషయంలో వారు కోరుకున్న విధంగా జరగాలి అని వారికి అడ్డంకి ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఆ రోజు నుంచి నా సేవలను నిలుపుదల చేయడం జరిగింది.

 కానీ కనీసం  జీతభత్యాల విషయంలో మరి కొన్ని సమస్యల విషయంలో కూడా వారు చేయవలసిన పని చేయలేక రాజధానిలో ఉన్న వారి వైపు చూడటం వలన నా వంతు సహాయం నేను అందిస్తే తప్ప ఫైలు ముందుకు వెళ్లలేని పరిస్థితి చూసి నేను చాలా బాధకు గురి అయ్యాను ఎందుకంటే వీరు నమ్ముకున్న నాయకులు ఎవరూ కూడా వీరికి కంటెంట్ విషయంలో జీతాల విషయంలో ఎటువంటి సహాయం చేయలేదు కనీసం కాంట్రాక్టువారికి చేసుకునే అవగాహన శక్తి కూడా లేదు అందునుబట్టి నేను చాలా బాధపడ్డాను.

 ప్రస్తుతం జగన్ గారి ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని విజయవాడ నుంచి వైజాగ్ కి మారుస్తాను అని చెప్పటం జరిగింది ఈ ప్రక్రియ అంతా రాబోయే ఆరు నెలల కాలంలో జరుగుతుంది అని సెక్రటేరియట్ వర్గాలు చెప్పటం జరుగుతుంది అందువలన మనం 17 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా కాంట్రాక్టు వారి రెగ్యులర్ అనే అంశం విషయంలో స్తబ్దుగా ఉంటే లాభం లేదు పోరాటం చేయవలసింది అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ ని నేను పెడుతున్నాను.

 కొంతమంది మొన్న అనంతపురంలో సంక్రాంతి పండగ చేసుకుంటున్నాం అని చెప్పి 27 GO సవరణ అయిపోయింది అని కూడా చెప్పారు సంక్రాత్రి పండుగ అయిపోయింది 27 GO ఎక్కడుందో కూడా వారికి తెలియదు అటువంటి పరిస్థితులలో దగాపడ్డ మోసానికి గురైన అమాయకులైన కాంట్రాక్టు వారిని చూసి బాధతో మరల కాంట్రాక్టు వారి సేవల కోసం కాంట్రాక్ట్ వాడు మాత్రమే నడుంబిగించి ముందుకు వస్తేనే పని అవుతుంది తనకు కావలసిన దానికి కాంట్రాక్టు వాడికి నొప్పి ఉంటుంది కాబట్టి వాడు కచ్చితంగా పరిగెడతాడు అనే ఉద్దేశంతో నేను సంక్రాంతి సెలవులు అయిపోయిన అంటే ఈరోజు నుంచి మరల నా సేవలు అందుబాటులోకి వచ్చేలా చేయాలని అనుకుంటున్నాను నేను సెక్రటరియేట్ వైజాగ్ వెళ్ళు అంతవరకు ప్రతినిత్యం మన కొరకు పోరాటం చేస్తాను అని తెలియజేస్తూ నేను గతంలో వీరంతా సహాయకరంగా ఉంటే మనం సాధించవచ్చు అని చెప్పుకున్న జిల్లాల నాయకులు, నేను రెగ్యులర్ అవ్వాలి నాకు ఈ జీవితం అవసరం నా పిల్లల కోసం నా వారి కోసం నేను రెగ్యులర్ అవ్వటం వలన నేను నా జీవిత ఆశయం నెరవేర్చుకోవడం అన్న వారు మాత్రం నన్ను సంప్రదించండి దయచేసి రోజు సాయంత్రం పూట ఫోన్ చేయవద్దు ఎందుకంటే మీరు ఆ సమయంలో ఎక్కడ కూర్చొని ఫోన్ చేస్తారో నాకు బాగా తెలుసు ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ కాదు మీకు ఏదైనా అవసరం ఉంటే మెసేజ్ పెట్టండి లేదా వాట్సప్ చేయండి చాలు నేను ఒక గంట ఆలస్యంగా నైనా స్పందించి మీకు సమాధానం చెప్తాను.

 ఫోన్ చేయటం ఒకరికి ఒకరు కాన్ఫరెన్సులు కలుపుకుని కాల్ రికార్డులు ఒకరినుండి ఒకరికి పంపి నీకు ఎం చెబుతాడో నువ్వుకుడా అడుగు అని మీరు చేసే పనుల వలన మానసిక క్షోభకు గురవుతున్నాము దయచేసి అర్థం చేసుకోండి, ఇకనుంచి చేయవలసిన పనుల విషయంలో  రిప్రజెంటేషన్ ఏమని ఇచ్చారు ఎక్కడ ఉంది ఎప్పుడు అవుతుంది ఇలాంటి ప్రశ్నలు  మీరూ అడగాల్సిన పనిలేదు ఎందుకంటే నేను కూడా కాంట్రాక్టు వాడిని ఎంత త్వరగా చేయించుకుంటే అంత త్వరగా మీతో పాటు నేను కూడా రెగ్యులర్ అవుతాను ఆ విషయం నా మనసుకి మనస్సాక్షికి తెలుసు దయచేసి మీరంతా సహకారం అందిస్తారని ఆశిస్తూన్నాను  రోజువారీ న్యూస్ బులిటెను లా whatsapp లో కూడా మేసేజ్ లు పెట్టను. మీకు ఏదైనా సమాచారం కావాలంటే విజయవాడలో నా ఆఫీసుకు రండి D. No. 29-19-39,దోర్నాకల్ రోడ్డు, సూర్యారావు పేట, నందు మనకు ఆఫీసు ఉంది అక్కడకి రండి నాతో పాటు సెక్రటేరియట్ కి రండి సమాచారం తెలుసుకోండి.

 మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.