___________________________________________________________________________________________
Lr.Rc.No.636 / FW.E1 / 2019, తేదీ: 27-09-2019.
ఆర్డర్
DR.K.S.JAWAHAR REDDY
ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శి
To
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ డైరెక్టర్, ఎ.పి. గొల్లపుడి, విజయవాడ
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, ఎ.పి. గొల్లపుడి, విజయవాడ.
దీనికి కాపీ: -
పి.ఎస్. గౌరవనీయ Dy.CM (HFW & ME), అమరావతికి.
పి.ఎస్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, HM&FW విభాగం.
Sc / Sf // ఫార్వార్డ్ :: ఆర్డర్ ద్వారా //
సెక్షన్ ఆఫీసర్
(P.T.O. for Annexure)
జాబ్
చార్ట్ ఆఫ్ MPHA
(FEMALE) / (ANM)
మల్టీ
పర్పస్ హెల్త్ వర్కర్స్ స్కీమ్ కింద ఒక మహిళా ఆరోగ్య కార్యకర్తను సుమారు 2,500 జనాభాను (గిరిజన
ప్రాంతంలో 1,500) కలిగి
ఉన్న ప్రతి ఉప కేంద్రంలో పోస్ట్ చేసారు, ఆమె ఈ క్రింది విధులను నిర్వహిస్తుంది.
సాధారణ
సూచనలు:
1.
ఆమె పిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్
పరిపాలనా నియంత్రణలో పనిచేయాలి, మరియు సాంకేతిక మరియు మార్గదర్శకత్వం మహిళా ఆరోగ్య
సూపర్‌వైజర్ యొక్క పర్యవేక్షణలో వుండాలి.
2.
ఆమె తన అధికారిక ప్రధాన కార్యాలయంలో
ఉండి, సమాజంలో
అన్ని ప్రసూతి సంరక్షణ సేవలకు అందుబాటులో ఉండాలి.
3.
ఆమె యూనిఫాంలో ఉండాలి గుర్తింపు
కార్డుతో వుండాలి.
4.
ఆమెకు కేటాయించిన ప్రాంతం యొక్క
మ్యాప్‌ను సిద్ధం చేయాలి,
జనాభాను లెక్కించాలి అన్ని పారామితుల డేటాను సేకరించి కుటుంబ ఆరోగ్య
రికార్డులను గ్రామ ఆరోగ్య ప్రొఫైల్లో సిద్దంగా ఉంచాలి.
5.
అందరు ANMలు పిహెచ్‌సి
వైద్య అధికారులు కేటాయించిన విధంగా అన్ని విధులను నిర్వర్తించాలి.
తల్లి
మరియు పిల్లల ఆరోగ్యం:
1.
గర్భం నిర్ధారణ అయిన 12 వారాలలో
గర్భిణీ స్త్రీలను నమోదు చేయాలి మరియు గర్భిణీ స్త్రీలకు సంరక్షణను అందించాలి.
2.
గర్భిణీ స్త్రీలకు అల్బుమిన్ మరియు
చక్కెర వ్యాధి కోసం మూత్ర పరీక్షలు నిర్వహించాలి మరియు క్లినిక్‌లో బ్లడ్ ప్రెజర్
నమోదుతో పాటు హిమోగ్లోబిన్ స్థాయిని అంచనా వేయాలి.
3.
గర్భిణీ స్త్రీలందరికీ HBsAg, HIV &
VDRL పరీక్షలు జరిగేలా చూసుకోవాలి.
4.
ఆమె ప్రాంతంలో ప్రతి డెలివరీకి
కనీసం గర్భిణిగా వున్నప్పుడు 4 సందర్శనలు మరియు ప్రసవం అనంతరం 3 సందర్శనలు చేయాలి తల్లి & పిల్లల సంరక్షణ ఆరోగ్య విద్యను నిర్వహించి
అందించాలి.
5.
గర్భిణీలు మరియు పాలిచ్చే మహిళల అందరికీ
ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేయాలి.
6.
గర్భిణీ స్త్రీలకు వ్యాధి రోగనిరోధక
శక్తిని Td (tetanus-diphtheria) రూపంలో
అందించాలి.
7.
గర్భిణులకు అందించే అన్ని సేవలను Scheduled ANC ద్వారా ట్రాక్
చేయాలి.
8.
గర్భిణిల యొక్క అసాధారణ మరియు అధిక
ప్రమాద కేసులను పిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ కి మరియు అధిక సౌకర్యాలు కలిగివున్న
ఆసుపత్రికి రిఫర్ చేయాలి.
9.
ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా గర్భిణీ
స్త్రీలందరినీ ప్రేరేపించాలి.
10. కష్టతరం
అయిన అన్ని ప్రసవాలను మరియు కొత్తగా పుట్టిన పిల్లలలో అసాధారణతలను తగ్గించడానికి సంస్థాగత
సంరక్షణ మరియు ఆరోగ్య విద్యను అందించడానికి తల్లి మరియు పిల్లల సంరక్షణ కొరకు సమీప
ఆసుపత్రికి పంపాలి.
11. తల్లి
పాలివ్వడం, ఆరోగ్యం, కుటుంబ
నియంత్రణ, పోషణ, రోగనిరోధకత, వ్యక్తిగత,
పర్యావరణ పరిశుభ్రత మరియు కుటుంబం యొక్క ప్రాముఖ్యతపై తల్లికి అవగాహన కల్పించాలి.
12. శిశువు
యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని అంచనా వేయాలి మరియు ఏదైనా లోపాలు ఉంటే సరిచేసెలా
చర్యలు తీసుకోవాలి.
13. BCG, Hep.’B’, పెంటా
వాలెంట్, రోటా
MR, JE, DPT, IPV, OPV (ఓరల్
పోలియో వ్యాక్సిన్) మరియు Vit-A ని శిశువులు మరియు పిల్లలందరికీ అందించాలి.
14. ఇమ్యునైజేషన్
మరియు టీకాల కోసం అన్ని డ్రాపౌట్స్ మరియు లెఫ్ట్ అవుట్‌లను ట్రాక్ చేయండి వేయండి.
15. మెడికల్
ఆఫీసర్ మరియు ఫిమేల్ హెల్త్ సూపర్‌వైజర్‌కు ఉప కేంద్రంలో MCH క్లినిక్
నిర్వహించడానికి సహాయం చేయాలి.
కుటుంబ
నియంత్రణ:
1.
అర్హతగల భార్యాభర్తల రిజిస్టర్‌ను
సరిగ్గా నిర్వహించాలీ మరియు అదే సమాచారాన్ని ఉపయోగించుకోని కుటుంబ నియంత్రణ
పద్ధతులను అంగీకరించడానికి భార్యాభర్తలను ప్రేరేపించాలి.
2.
సంప్రదాయ గర్భనిరోధక సాధనాలు మరియు నోటి
మాత్రలను అర్హతగల భార్యాభర్తలకు అడిగినప్పుడు పంపిణీ చేయాలి.
3.
కుటుంబ నియంత్రణ అంగీకరించేవారికి
ఫాలో అప్ సేవలను అందించాలి,
చిన్న ఫిర్యాదులకు ఏవైనా ఉంటే గుర్తించాలి
మరియు అక్కడే చికిత్సను అందించాలి.
4.
పనిచేసే ప్రాంతంలో సంప్రదాయ గర్భనిరోధక సాధనాల కోసం మహిళా డిపో
హోల్డర్లను ఏర్పాటు చేసి వారికి నిరంతర సరఫరాను అందించాలి.
5.
గర్భనిరోధకాలు, IUD, టీకాలు, మందులు
మరియు ఇతర సామాగ్రి యొక్క అందుకున్న మరియు జారీ చేసిన రికార్డును నిర్వహించాలి.
6.
గ్రామంలోని డిపో హోల్డర్లకు శిక్షణ
ఇవ్వడంలో మహిళా ఆరోగ్య పర్యవేక్షకులకు సహాయం చేయాలి, గ్రామంలో నాయకులు, లోకల్ దాయాలు మరియు ఇతర స్థానిక
మహిళా సంఘాలను ఉపయోగించుకుని కుటుంబ సంక్షేమం మరియు MCH కార్యక్రమాల
ప్రచారం నిర్వహించాలి.
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్
ప్రెగ్నెన్సీ (MTP):
1.
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్
ప్రెగ్నెన్సీ (MTP)
అవసరం ఉన్న మహిళలను గుర్తించాలి వారికి సంరక్షణ అందించడానికి వైద్యపరమైన కృత్రిమ గర్భస్రావం కోసం సమీప ఆరోగ్య
కేంద్రానికి పంపించాలి.
పోషణ:
1.
శిశువులు మరియు పిల్లలలో LBW
(తక్కువ బరువు తో పుట్టిన) మరియు పోషకాహార లోపం కలిగిన పిల్లలను గుర్తించి అనుబంధ
పోషకాహారం మరియు చికిత్స కోసం AWC లు / NRC లకు పంపించాలి.
2.
కౌమారదశలో వున్నా ఆడపిల్లలకు IFA మాత్రల పంపిణీ
చేయాలి.
సంక్రమణ వ్యాధులు:
1.
పనిచేసే ప్రాంతంలో ఏదైనా అసాధారణంగా
విరేచనాలు, జిగట విరేచనాలు, పోలియోమైలిటిస్, చిన్న
పిల్లలలో ధనుర్వాతం మరియు జ్వరం వంటివి కనిపిస్తే వైద్య అధికారికి తెలియచేయాలి.
2.
హైపో పిగ్మెంటెడ్ పాచెస్ స్క్రీన్
చేసి కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించాలి.
3.
జ్వరం కేసులను గుర్తించి, చికిత్సచేసి, రిపోర్ట్
చేయాలి మరియు దోమ కాటు నివారణ కొరకు ఆరోగ్య విద్యను అందివాలి.
4.
చిన్న రోగాలకు (Miner Elements) చికిత్స అందించాలి, ప్రథమ
చికిత్సచేస్తూ తదుపరి రోగ నిర్ధారణ మరియు చికిత్స
కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలాకు పంపించాలి.
అసంక్రమణ వ్యాధులు:
1.
అందరు ANMలు
రక్తపోటు / డయాబెటిస్ / 3
సాధారణ క్యాన్సర్లు i.e. మహిళలకు రొమ్ము, గర్భాశయం మరియు నోటి కేన్సర్లు, పురుషులకు
నోటి, ఊపిరితిత్తుల మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రజలకు పరీక్షలు నిర్వహించాలి.
2.
పిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ నిర్దేశించిన
విధంగా సమాజంలో సాధారణ మానసిక అనారోగ్యాన్ని గుర్తించాలి.
3.
దంత ఆరోగ్యం, నోటి
ఆరోగ్యం, ENT మరియు
కంటి సమస్యలను గుర్తించి తదనుగుణంగా
చికిత్స / రిఫరల్ సేవలు అందించాలి.
4.
వృద్ధాప్య సమస్యలను గుర్తించాలి.
ఆరోగ్య విద్య:
1.
స్థానిక మహిళా మండల సమావేశాలలో
పాల్గొని ఆడపిల్ల వివాహ వయస్సు మరియు గర్భానికి గర్భానికి మధ్య వెడం ఉండటానికి అంతరం
పద్ధతులు తెలియచేయాలి.
2.
అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ
సేవకులు వంటి ఇతర విభాగ సిబ్బందితో వైద్య సేవలను ప్రోత్సహించడంలో సమన్వయం చేసుకోవాలి
3.
అతిసారం వ్యాదిని ORS ద్రావానంతో
ఇంటిలోనే తగ్గించడం గురించి తల్లులకు అవగాహన కల్పించాలి మరియు ORS తయారీ
మరియు వాడకంపై శిక్షణ ఇవ్వాలి.
4.
తల్లులకు పిల్లలలో న్యుమోనియా యొక్క
ప్రారంభ రోగ నిర్ధారణపై అవగాహన కల్పించండి మరియు ఇతర రోగాలను గుర్తించేలా శిక్షణ
ఇవ్వాలి మరియు చికిత్స కోసం కేసును రిఫర్ చేయాలి.
5.
ఇమ్యునైజేషన్ షెడ్యూల్ మరియు ఇతర జాతీయ
కార్యక్రమాలు వంటి అవసరం అయిన సందేశాలపై పోస్టర్లు / పెయింటింగ్స్ ప్రదర్శించాలి
నివేదికలు మరియు రికార్డులు:
1.
ఆర్‌సిహెచ్ కింద సూచించిన విధంగా
అన్ని రికార్డులు మరియు నివేదికలను నిర్వహించాలి.
2.
ఆమె ప్రాంతంలో సంభవించిన అన్ని
జననాలు మరియు మరణాలు రికార్డ్ చేయాలి.
3.
మహిళా ఆరోగ్య పర్యవేక్షకురాలి సహాయంతో
ఆమె ప్రాంతంలో ఆరోగ్యానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలి.
4.
వైద్య అధికారి, మహిళా
ఆరోగ్య పర్యవేక్షకుడు మరియు మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ సందర్శనల సమయంలో
సహాయం చేయాలి వారి పాఠశాల ఆరోగ్య క్లినిక్లను నిర్వహిస్తున్నప్పుడు సహాయం చేయాలి.
5.
పిహెచ్‌సిలో నెలవారీ సిబ్బంది
సమావేశాలకు హాజరుకావాలి మరియు వైద్య అధికారి చేపట్టాల్సిన కార్యకలాపాల గురించి
ఇచ్చే ఆదేశాలను స్వీకరించాలి.
6.
పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యకలాపాలు
మరియు ఇతర జాతీయ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి, అటువంటి కార్యక్రమాలకు అర్హత
కలిగిన లబ్ధిదారుల జాబితాలను తయారుచేయాలి.
7. మెడికల్ ఆఫీసర్ మరియు మహిళా ఆరోగ్య పర్యవేక్షకుడు అప్పగించిన ఇతర విధులకు హాజరవుతూ కుటుంబ సంక్షేమం మరియు MCH ప్రమోషన్ సేవలు అందించాలి.
DR.K.S.JAWAHAR REDD
PRINCIPAL SECRETARY TO GOVERMENT
Nice good information
ReplyDeleteSir s/c Anm work rch Anm work cheppagalaru.
ReplyDeleteGood information
ReplyDeleteRecords and register s maintenance gurinchi telapaledu
ReplyDeleteTq u sir
ReplyDelete