ASHA (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త)
- • ప్రతి గ్రామంలో 1000 మంది జనాభా కొరకు శిక్షణ పొందిన మహిళా సామాజిక ఆరోగ్య కార్యకర్త ASHA (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) ను ఆరోగ్య ఉప కేంద్రాలలోANMసేవలకుసహయకురాలిగాభర్తీ చేస్తారు.
- • జవాబుదారీగా ఉండటం కొరకు ASHAలను గ్రామంలో నుండి ఎంపిక చేసుకుని సమాజము మరియు ప్రజా ఆరోగ్య వ్యవస్థ మధ్య ఒక అంతర్ముఖం వలె పనిచేయడానికి శిక్షణ పొందుతుంది.
- • గ్రామీణ ప్రాంతానికి చెందిన 25 నుంచి 45 ఏళ్ళ వయస్సులోపు వుండి 10 వ తరగతికి ఉత్తీర్ణత సాధించినవారిని కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారాASHAగా ఎంపిక ఎంపిక చేయబడుతుంది.
- • ASHA తనకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు తనకు విర్దేసించినపాత్రను ప్రదర్శించడం కొరకు కావలసిన మనోధైర్యం కోసం, విశ్వాసం పొందడానికి శిక్షణను ఇస్తారు.
- • తనకు కేటాయించిన ప్రాంతములో ASHAముఖ్యంగా మహిళలు మరియు పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన మొదటి వాహకంగా ఉంటుంది, ప్రజల యొక్క ఆరోగ్యంవారి ఆరోగ్య సంరక్షణ మరియు సమయానుసారంగా వ్యాధిగ్రస్తులను ఆసుపత్రికి పంపడానికి సరిపడా జ్ఞానం మరియు ఔషధ-సామగ్రి పెట్టె కలిగి ఉండి గ్రామములో అందరికి సహాయపడుతూ ఉంటుంది.
- • ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కల్పించడం, స్థానిక ఆరోగ్య ప్రణాళికను సమీకరించడం మరియు సమాజములోమంచి ఆరోగ్య విధానాలను ప్రోత్సహించి,పోషణ, ప్రాథమిక పారిశుధ్యం మరియు పరిశుభ్రమైన పద్ధతులు, ఆరోగ్యకరమైన జీవన మరియు పని పరిస్థితులపై సమాజానికి సమాచారాన్ని అందిస్తుంది.
- • ASHA గ్రామములో ఆరోగ్య పరిస్థితులను సమీకరించడం మరియు అంగన్‌వాడీ / ఆరోగ్య ఉప కేంద్రము / ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో లభించే ఆరోగ్య మరియు ఆరోగ్య సంబంధిత సేవలు వివరాలు ప్రజలకు అందచేయటము, ఇమ్యునైజేషన్, గర్ద్భిని స్త్రీల వైద్యపరిక్షలు (ANC), ప్రసవానంతరవైద్యపరిక్షలు అనుబంధపోషణ, పారిశుధ్యం మరియు ఇతర సేవలు సేవలను అందిస్తుంది.
- · ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ (ORS), ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ (IFA), క్లోరోక్వైన్, డిస్పోజబుల్ డెలివరీ కిట్స్ (DDK), ఓరల్ పిల్స్ &కండోమ్లు మొదలైనవి అన్ని ప్రజలకు అందుబాటులో ఉంచి అవసరమైన వైద్య సంబంధిత అన్నిరకాల అవసరాలకు ASHA డిపోగా పనిచేస్తుంది.
- • ASHA జనన సంసిద్ధతను మహిళలకు ఉపదేశిస్తుంది, సురక్షితమైన డెలివరీ యొక్క ప్రాముఖ్యత, రొమ్ము పాల ఆవశ్యకత మరియు పరిపూరకరమైన ఆహారం, రోగనిరోధకత, గర్భనిరోధకం మరియు పునరుత్పత్తిసంబంధిత ఇన్‌ఫెక్షన్ / లైంగిక సంక్రమణ అంటువ్యాధులు (RTIs / STIs) మరియు చిన్నపిల్ల పిల్లల సంరక్షణ తో సహా సాధారణ అంటురోగాల నివారణకు మహిళలకు ఆమె సలహాలు ఇచ్చింది.
- • స్వీయ సహాయక సంఘాలతో, విలేజ్ హెల్త్ సొసైటీలతో (VHSC), పంచాయతీలు, ANMమరియు AWWలతో ASHAసమన్వయ కర్తగా ఉంటుంది.
- • ASHAs తనకు కేటాయించిన ప్రాంతములో ఆరోగ్య రికార్డులను PHC లోనివేదించడానికి ASHA DAY (నెలసరి సమావేశానికి) హాజరై నివేదిస్తుంది.
- • ASHA లుపునరుత్పాదక మరియు పిల్లల ఆరోగ్యం (RCH) సార్వత్రిక ఇమ్యునైజేషన్, రిఫరల్స్ మరియు ఎస్కార్ట్ సేవలపనితీరు,క్షయ వ్యాధిగ్రస్తులగుర్తించడం కోసంమరియు ఇతర ఆరోగ్య కార్యక్రమాల కోసం ప్రోత్సాహకాలను అందుకుంటారు మరియు గృహాలలో ప్రతిమరుగుదొడ్లు నిర్మాణం కొరకు రూ. 500 / - ప్రోత్సాహం అందుకుంటారు.
- · ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతంఉన్న ASHA ల మొత్తం సంఖ్య: 42209.
--------
Good message for society
ReplyDelete