About Us

             మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కాంట్రాక్టు విధానము అనే జాడ్యము ఎప్పుడో మొదలైనా మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మాత్రము పాక్షికముగా 1999 సంవత్సరములో మరియు పూర్తిగా 2002 సంవత్సరములో మొదలు అయ్యింది. అప్పటి నుండి ఈ కాంట్రాక్టు కదంభ హస్తాలలో నుండి బయట పడాలని మనవారు అనునిత్యము ప్రయత్నిస్తున్నారు, కాని మనకు అది అందని ద్రాక్షాగుత్తిలానే అవుతుంది. 

                   అందువలన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మెడికల్ అండ్ డిపార్టమెంట్ నందు కాంట్రాక్టు పద్దతిన పనిచేయుచున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికి ఉద్యమాభివందనాలు తెలియచేస్తూ, మన రాష్ట్రములో మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్టమెంట్ లో  కాంట్రాక్టు పద్దతి పైన పనిచేస్తున్న వారిని  అందరిని ఒక తాటిపైకి తీసుకు వచ్చి అందరిని రెగ్యులర్ చేయాలి అని సింగిల్ పాయింట్ ఎజండాతో దృడ సంకల్పముతో ఏర్పాటు చేసినది ఈ "ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం"(APPMCEA)

APPMCEA ను నడిపించడానికి అనుభవము కలిగి కార్యదీక్ష కలిగి ఇప్పటికే అనేక విజయములు చవిచూసి మునుముందు మెత్తం గవర్నమెంట్ ఉద్యోగవ్యవస్థకే ఆరాధ్యదైవంగా అవతరిస్తున్న మన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు దీనికి పదనిర్దేసకులుగా వుండటం మెదటి విజయంగా భావిస్తూ మెడికల్ అండ్ హెల్త్ డిపార్టమెంట్ లో కాంట్రాక్టు ఉద్యోగులు అందరు సంఘటితం కావాలని ఆశిస్తూ మీరంతా దీనిలో భాగ స్వాములు కావాలని వేడుకోనుచున్నాము. 




Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.