ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా కోయాలగుడెం PHC లో కోవిడ్ కారణముగా మరణించిన మన కాంట్రాక్టు సోదరుడు పోలిశెట్టి సత్తిబాబు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అదే విధముగా మన DSC కాంట్రాక్టు Mpha M/F, ఫార్మా సిస్ట్ లు, LT లు, OA లు ఒక్క సారి ఆలోచన చేసి, మనము 19 సంవచ్చరాల నుండి కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉంటూ HRA, DA లతో కూడిన జాబ్ లో జాయిన్ అయ్యి, వాటిని కూడా 27 జీవో తో ఉన్నవాటిని కూడా కోల్పోయి, వయస్సు మీద పడి, వేరే జాబ్ లోకివెళ్ళలేక, పిల్లలు పెళ్లి వయసులకి వచ్చి, చాలీ చాలని జీతముతో సరిపడక మనవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ వున్నారు. కనీసము చనిపోయిన కాంట్రాక్టు ఉద్యోగికి 2లక్షలు / 5 లక్షలు అని GO లు వచ్చినప్పటికీ వాటిని కూడా సాదించుకొలేని పరిస్థితి ఇప్పుడు నెలకొని వుంది, వీటన్నింటికీ పరిష్కారం కోసం మన DSC కాంట్రాక్టు ఉద్యోగులు JAC గా ఏర్పడి మార్చి, ఏప్రిల్ లో మన రెగ్యులర్ అవుతాము అని టార్గెట్ పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. కానీ మన సోదరులు Whatsapp లో స్పందించిన విధముగా JAC వారు ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలకు రావడం లేదు. ప్రతి ఒక్కరూ JAC పిలుపు మేరకు కార్యక్రమాలలో పాలుగొంటే మన కాంట్రాక్ట్ సోదరులకు కావలసిన కోర్కెలు సాదించుకోవచ్చు. పోరాడితే తప్ప కోర్కెలు సాధ్యం కాదు. దయవుంచి ఇప్పటికైనా అందరు పోరాట పటిమతో ముందుకు రావాలని కోరుతూ రేపు 11.3.21 న కోయాలగుడేం PHC లో జరిగే సత్తిబాబు గారి సంతాప సభకు హాజరు కావాలని కోరు చున్నము. పై కార్యక్రమము తరువాత మన JAC మీటింగ్ లో మీ అందరూ మీఆలోచనలు, సలహాలు, సూచనలు అందజేయ వలసినదిగా కోరుచున్నాము అని కాపా నాగరాజు, DSC పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులు జేఏసీ తెలియచేసారు.
రేపు కాంట్రాక్టు ఉద్యోగుల మహోద్యమం జరుగబోతున్న కొయ్యలగూడెం రావడానికి రూటు గురించి ఇతర జిల్లాల మిత్రులు ఫోన్లు చేస్తున్నారు! విజయవాడ నుంచి జంగారెడ్డిగూడెం డైరెక్ట్ EXPRESS బస్ లు ఉంటాయి. జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం కు అరగంట ప్రయాణం! రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే బస్ కొయ్యలగూడెం మీదుగా వెళుతుంది. తాడేపల్లిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం బస్సులు కొయ్యలగూడెం మీదుగానే వెళతాయి. దూరప్రాంతాల నుంచి వస్తున్న మిత్రులు ఎలాంటి ఇబ్బంది అయినా వెంటనే ఫోన్ చెయ్యగలరు, మన పశ్చిమగోదావరి జిల్లాలో రేపు జరుగబోతున్న కాంట్రాక్టు ఉద్యోగుల ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతం చేసేందుకు.... అర్ధంతరంగా చనిపోయిన మన కొయ్యలగూడెం మిత్రులు స్వర్గీయ పోలిశెట్టి సత్తిబాబు గార్కి అంజలి ఘటించి కాంట్రాక్టు ఉద్యోగుల సత్తా ఏంటో చూపించేలా...స్వర్గీయ సత్తిబాబు గారి ఆశయాన్ని సాధించేలా....రేపటి ఛలో కొయ్యలగూడెం కార్యక్రమాన్ని సంపూర్ణ విజయవంతం చేద్దాం అని GVV ప్రసాద్ గారు తెలియచేసారు.
ఇటీవల కన్నుమూసిన మన మిత్రులు పోలిశెట్టి సత్తిబాబు గారి సంతాప సభ మరియు నిరసన కార్యక్రమం గురువారం ఉదయం 10 గంటలకు కొయ్యలగూడెం పీహెచ్సీ నందు ఏర్పాటు చేయడం జరిగింది. కావున పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుండి ఈ కార్యక్రమమునకు ప్రతీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ తదితర కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ఉండాలని కోరుతున్నాం. మిత్రులారా ఒక ఆలోచన చేయండి ఒక్కొక్కరు పిట్టల్లా రాలిపోతున్న మనలో చలనం రావటం లేదు చనిపోయిన వాళ్లకి ఐదు లక్షలు రూపాయలు ఇచ్చే విధంగా జీవో నెంబర్ 25 వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదు దానికి కారణం మన నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది, మనకి ఉన్న హక్కును కూడా మనం సాధించుకోలేక పోతున్నాము ఉన్న జీవోను కూడా మనం అమలు చేయించుకో లేకపోతే మనకు చనిపోయిన వాళ్లకి పెద్ద తేడా ఏమీలేదు కావున మిత్రులారా ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి ఇప్పటికైనా మేల్కొని ఏదైనా పిలుపునిస్తే అందరూ స్పందించి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే కొంతలో కొంత మనకు రావలసిన హక్కులను రాబట్టుటకు మనం మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ రేపు కొయ్యలగూడెం తరలిరావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అని వై మోహన్ రావు, రాష్ట్ర కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ జేఏసీ డీఎస్సీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలియచేసారు.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg4FxBSX2aO0Ro6Jb6Qh26uUb8eNVGd0BFLO3F2qy22k3uCsmGD3PeY9yilA1-R-s6BIqMd8nGutsRzSz7IPqQEIzA9d5CKcvOH5VNgzVXWLOMmbb2_WsU8abPj1n0Ll1vq3SY6tWURel7u/w183-h200/WhatsApp+Image+2021-03-09+at+22.57.02.jpeg)
ఈ కార్యక్రమమునకు పశ్చిమ గోదావరి జిల్లాలోని కాంట్రాక్టు ఉద్యోగులే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి కాంట్రాక్టు ఉద్యోగులు హాజరు అవుతున్నారని మన ఉద్యమం ఈ వేదిక పై నుండి తీవ్రతరం చేయడం ద్వారా మన చిరకాల వాంఛ యిన రెగ్యులర్ ను మనం సాదిన్చుకోవడానికి ప్రయత్నం చేయాలని కాంట్రాక్టు ఉద్యోగుల JAC కన్వినర్ రమణ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియ చేసారు.
0 Comments:
Post a Comment