ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతుల షెడ్యూల్ మరియు ప్రభుత్వ సూచనల మేరకు 31.01.2026 లోపు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయబడినట్లు Directorate of Public Health & Family Welfare వెల్లడించింది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ వైద్య మరియు ఆరోగ్య సేవల సంచాలకులు, పూర్వ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారుల దృష్టికి సంబంధిత సూచనలు తీసుకురాబడ్డాయి. ప్రభుత్వం మూడవ సూచనలో తెలియజేసిన షెడ్యూల్ మరియు మార్గదర్శకాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న అన్ని ఖాళీ పోస్టులను కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ విధానంలో, అమల్లో ఉన్న నిబంధనలు మరియు రోస్టర్ పాయింట్లను కచ్చితంగా పాటిస్తూ 31.01.2026 లోపు భర్తీ చేయవలసిందిగా Rc.No.3104894/E4/2026, తేది: 30-01-2026 ప్రకారం ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
అదేవిధంగా, CH&FW, DME, DPH&FW మరియు APVVP పరిపాలనా నియంత్రణలో ఉన్న ఖాళీ పోస్టులను ఖాళీలు ఏర్పడిన వెంటనే భర్తీ చేయుటకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని సంబంధిత అధికారులందరూ G.O.Ms.No.143 HM&FW (B1) Dept., తేది: 17.11.2021 మరియు G.O.Ms.No.32 HM&FW (B1) Dept., తేది: 24.02.2023 ద్వారా జారీ చేసిన స్టాఫింగ్ నమూనా ఆదేశాలను అనుసరించి, నియామకాలు మరియు పదోన్నతుల ద్వారా ఖాళీ పోస్టులను 31.01.2026 లోపు భర్తీ చేయుటకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించబడింది.
అలాగే, G.O.Ms.No.188 HM&FW (D1) Dept., తేది: 15.07.2022, Memo No.3088039/1.1/2025 HM&FW (1.2) Dept., తేది: 28.12.2025 మరియు Memo No.GAD01-SERVODPC(INST)/1/2026-DPC, General Administration (DPC) Dept., తేది: 11.01.2026 ప్రకారం అమలులో భాగంగా ఇతర ప్రాంతాలకు పునర్విభజించబడిన సిబ్బందిని తిరిగి వారి అసలు స్థానాలకు రప్పించి, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమానమైన క్యాడర్ బలం కొనసాగించాల్సిందిగా సూచించారు. పదవీ విరమణ, పదోన్నతి లేదా మరణం వలన ఏర్పడిన ఖాళీలను పరిగణనలోకి తీసుకుని, రీడిప్లాయ్ చేయబడిన MPHEOలు మరియు ఇతర జోనల్ క్యాడర్ సిబ్బందిని తిరిగి రప్పించిన అనంతరం మాత్రమే పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు.
రీడిప్లాయ్ చేయబడిన MPHEO/SUOలను తిరిగి నియమించేటప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఖాళీలను ప్రాధాన్యతగా భర్తీ చేయాలని ఆదేశించారు.
డా. కె. పద్మావతి
సంచాలకులు
ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ
తెలియజేశారు.
0 Comments:
Post a Comment