News

వందనములు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గవర్నమెంటు నందు  కాంట్రాక్టు పద్దతిన పనిచేయుచున్న అందరికి ప్రణామములు. మనము ఈ రోజు కాంట్రాక్టు విధానములో పనిచేయుచు అనేక వ్యయప్రయాసలకు గురి అగుచున్నాము. అందులకు కారణము మనము ఈ కాంట్రాక్టు వ్యవస్థ ఎంత పనికమాలినది అని తెలియక గుడ్డిగా గవర్నమెంటు ఉద్యోగము వస్తే చాలు అని జాయిన్ అవ్వడము ఒక ఎత్తు అయితే రాష్ట్రమును పరిపాలిస్తున్న నాయకులు ప్రభుత్వమునకు సేవ చేస్తున్న మనలను ఆర్ధిక భారముగా భావించడము మరొక కారణము అధికారుల అలసత్వము మరింత బాధాకరమైన అంశము. 


అయితే ఈ పరస్థితి ఎప్పటి వరకు అంటే సమాధానము లేని ప్రశ్నగానే వుంటుంది. కాంట్రాక్టు వ్యవస్థ అనేది వచ్చి నిండా ముపై సంవత్సరములు కాలేదు మనలను రెగ్యులర్ చేయమంటే యాభై సంవత్సరముల నాటి GO అడ్డు వస్తుంది చేయలేమని కుంటి సాకులు చేబుతునారు. కాంట్రాక్టు విధానము రావడానికి చేసిన అమైండ్ మెంట్లు దీనిని తీసివేయడానికి కుదరవు అంటూ మినామేషాలు లెక్కిస్తూ పక్క రాష్ట్రములోని కోర్టు కేసులను వంకగా చూపిస్తున్నారు,  ఇక్కడ మనము పాలకులను (రాజకీయ నాయకులను) మాత్రమే తప్పు పట్టలేము ప్రభుత్వములో పనిచేయుచున్న అధికారులు కుడా కారణము. కాంట్రాక్టు వారిని రెగ్యులర్ ఆపడానికి  వీరికి గుర్తు రాని GO అంటూ ఏది వుండదు. 


ఇకనైనా మనం సంఘటితం కావలసిన అవసరం ఎంతైనా వున్నది. ఒక్కసారి ఆలోచించండి ఈ పనికిమాలిన జీవితాలు ఎంత కాలము, దీనిని మనం మార్చలేమా, ఈ ప్రభుత్వములో కుదరదా, అయితే వచ్చే ప్రభుత్వములో అవుతుందా వచ్చే ప్రభుత్వాన్ని ఎంత వరకు నమ్మవచ్చు అసలు ఎవరు ప్రభుత్వము ఏర్పాటు చేయగలరు, ఆలోచించండి మనం అడుగులు ముందుకు వేయక పొతే పరిస్థితి ఎన్నటికి మారదు. రాష్ట్రములో వున్న అందరు కాంట్రాక్టు వారు ఒక తాటిపైకి రావాలి కచ్చితంగా మనం రెగ్యులరైజేషన్  సాధిస్తాము.



About APGCEA

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.