Contract Employees news.
రాష్ట్రములో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల లెక్క తప్పింది. ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులు 26000 మందిగా ఉన్నట్లు ఫైనాన్స్ శాఖ వారు తెలియచేసారు కానీ ప్రభుత్వం 50%జీతం పెంచుతాము అని గైడ్ లైన్స్ తో కూడిన GO విడుదల చేయమని ఫైనాన్స్ శాఖ వారికి బాద్యత అప్పగించి నప్పుడు అన్ని శాఖల వారి దగ్గర సమాచారం తీసుకున్నప్పుడు ఆ లెక్క 48000 అయింది. దీనితో ఫైనాన్స్ శాఖ వారు వారి దగ్గర సమాచారం ఉన్న వారినే కాకుండా మిగతా అన్ని శాఖల వారిని పిలిపించి లెక్కలు కడుతున్నారు ఈ ప్రక్రియ వారంతము కల్లా పూర్తి చేసి జూన్ మొదటి వారంములో GO విడుదల చేయగలమని తెలిపారు.
ఎవరూ నిరాశ చెందనవసరం లేదు ఎంతమంది వున్నా పెంపుదల ఆగదు. మెడికల్ అండ్ హెల్త్ లో 459 GO పై చేస్తున్న వారికి PRC నిబంధనలు ప్రకారమే ఇవ్వాలని GO లో గైడ్ లైన్స్ వస్తాయి, అదే విధముగా సెంట్రల్ గవర్నమెంట్ (NHM) స్కీములలో ఉన్నవారికి 40%మాత్రమే పెంపుదల ఉంటుంది అని తెలియచేసారు.