మిత్రులారా! మీకో విన్నపము... మంగళవారం జరిగే ఆశా డే రోజున మన స్టాఫ్ తో పాటు ఆశాకార్యకర్తలు కూడా PHC కి వస్తారు కాబట్టి మనం చేసే ఆందోళనా కార్యక్రమాలకు ఆశాలు కూడా సంఘీభావం తెలుపమని వారికి మన సమస్య వివరించి ఆ రోజు మధ్యహానం బోజనవిరామ సమయంలో అందరూ నల్ల బాడ్జీలు ధరించి PHC ముందు నిరసన కార్యక్రమం చేపట్టాలని మనవి. ముఖ్యంగా నాయకులంతా అలోచించండి అన్ని PHC ల్లో ఒకేరోజు నిరసన జరిగేలా చూడటానికి మంగళవారం కార్యక్రమం చేపట్టడం మంచి పద్ధతి.
అందుకు
1. మీరు ఆశా మీటింగ్ మొదలు అవ్వగానే మీ మెడికల్ ఆఫీసర్ తో మాట్లాడి భోజన విరామంలో నిరసన తెలపడానికి అనుమతి తీసుకోండి.
2. మీటింగులో ఆశాలకు మన బాధను చెప్పి భవిష్యత్తులో ఇది అందరికీ ప్రాణసంకటం అని తెలిపి వారిని నిరసన కార్యక్రమము లో పాల్గొనే లా చేయండి.
3. స్థానిక లీడర్లను పిలవండి
4. నిరసన కార్యక్రమానికి కావలసిన నల్ల బాడ్జీలు, A4 కాగితం మీద స్లోగన్లు రాయండి, వీలు ఉంటే ఒక మైక్ కూడా ఏర్పాటు చేయండి
5. ఒక పత్రికా ప్రకటన తయారు చేసివుంచండి, కార్యక్రమాన్ని ఫొటోతో సహా స్థానిక విలేకురలకు పంపించండి అది కచ్చితంగా పేపర్లో వచ్చేలాగా ఏర్పాటు చేయండి.
ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.
మిత్రులు గమనించండి...
INTUC కార్యాచరణ తారీకులు
9.4.18- నల్ల బాడ్జీలు ప్రదర్శన
10.4.18 - DMHO కార్యాలయం దగ్గర ధర్నా.
11.4.18 - UIP డే రోజు నల్ల బాడ్జీలు
13.4.18 చలో విజయవాడ డైరెక్టరేట్ ముట్టడి
CITU కార్యాచరణ తారీకులు
3.4.18 నల్ల బాడ్జీలు తో హాజరు
10.4.18 DMHO కార్యాలయం దగ్గర ధర్నా
12.4.18 జిల్లా కేంద్రాలలో వివిధ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం
16,17,18 విజయవాడలో రిలే దీక్షలు
TNTUC కార్యాచరణ ఇంకా ప్రకటించలేదు కానీ ముఖ్యమంత్రి దృష్టికి మన సమస్య తీసుకువెళ్లాడానికి ప్రయత్నిస్తున్నారు.
వీటితో పాటు రాష్ట్రములో ప్రధాన ఉద్యోగ సంఘాలైన
APJAC అమరావతి APNGO లు ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్యాలయంలో రోజు మధ్యహాన భోజన విరామంలో నల్ల బాడ్జిలతో ప్రదర్శన కార్యక్రమాలు చేస్తున్నాయి
మిత్రులారా కొంచెం కష్టం అయినా ఇలా చేయండి.
1. రేపు అనగా సోమవారం మన PHC లు అన్ని సుమారుగా మండల కేంద్రాలలోనే ఉంటాయి కాబట్టి MRO, MEO, MDO వంటి అన్ని మండల స్థాయి కార్యాలయాలు సందర్శించి మంగళవారం భోజన విరామ సమయంలో మన PHC లో జరిగే ప్రదర్శనకు రమ్మని ఆహ్వానించండి.
2. దీనివలన మన సమస్య ప్రత్యక్షంగా అధికారులకు చెప్పినట్లు అవుతుంది.
3. వారు చేసే పనికి మనవంతు సహాయం అందించి నట్లు అవుతుంది
4. ఇందాక ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు అందరం 1100కి ఫోన్ చేద్దాం అని ఇది కూడా మంచిపెద్దతే అందుకు రేపు మంగళవారం మన PHCకు వచ్చే అధికారులకు మెమోరాండం ఇవ్వండి MRO గారికి ఇచ్చిన మెమోరాండం 1100 లో అప్లోడ్ అయ్యేలా చూడండి మనకి మనం చెప్పేదానికి తోడుగా మండల స్థాయి అధికారి రిపోర్టు మాంచి ఫలితం ఇస్తుంది.
5. CITU మిత్రులు 3.వ తారీఖున నల్ల బాడ్జీలు ధరించి డ్యూటికి వెళదాం అన్నారు కాబట్టి CITU లీడర్లను ఖచ్చితంగా ఆహ్వానించండి.
మనకు ఉద్యమం ఉగ్గుపాలు నేర్పింది వారే మరువవద్దు.
6. INTUC మరియు TNTUC నాయకత్వాన్ని ఆహ్వానించండి వారు చేయ దలచిన కార్యక్రమాలకు మనవంతు సహకారం ఉంటుంది అని వారికి గట్టిగా చెప్పండి
7. PHC పరిధిలో ఉన్న రెగ్యులర్ ఉద్యోగుల ప్రతి నాయకత్వాన్ని పిలువండి వారిని ముందుండి నడిపించ మని చెప్పండి మరియు వివిధ కేడర్ల మన కాంట్రాక్టు సంఘాల నాయకత్వాన్ని పిలువండి వారితో ఏమన్నా విభేదాలు వున్నా మరచిపోండి.
8. విజయవాడలో ఉన్న నేను, మణికాంత్ (APPMCEA) విజయ్ కుమార్ రాజు (CITU) రేపు అన్ని రాష్ట్రస్థాయి నాయకులతో మాట్లాడి సహకరించ వలసినదిగా ఒప్పించి మండల స్థాయి నాయకత్వం మీకు సహకరెంచే
విధంగా ప్రయత్నిస్తాము.
జాన్ హేన్రి బాబు
విజయవాడ.