మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్ లో కాంట్రాక్టు ఉద్యోగులందరం మూడున్నరేళ్లుగా జీతాల పెంపుదల కోసం ఎదురు చూస్తున్నాము, దీనికోసం 2016 సంవత్సరం నుండి పోరాటం చేస్తూ వస్తుంటే . కొండనాలుకకు మందు వేస్తె ఉన్న నాలుక ఉడిపోయిన చందం గా 16.03.2018 GO.27ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ GO మనపాలిట పాశుపతాస్త్రమే ఎందుకంటే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001 నుండి వైద్య, ఆరోగ్య రంగంలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు ప్రారంభమయ్యాయి. జిల్లా సెలక్షన్ కమిటీ (DSC) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి Basic+DA+HRA+FTA లాంటి అలవెన్సులతో పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగానే వంద శాతం స్థూలవేతనంతో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం వంద శాతం స్థూల వేతనాన్ని పొందుతూనే వున్నాము దానిని ఈ GO27 ద్వారా తొలగించారు.
కాంట్రాక్టు పద్దతిన 2002 DSC ద్వారా నియమించబడిన ప్రతీ పారమేడికల్ ఉద్యోగి ఖచ్చితంగా Basic+Hra+Da తో గ్రాస్ సాలారీ సాధనకీ నడుము బిగించాలని, ప్రతిఒక్కరు బాధ్యతగా మెలగాలని, అన్ని కేడర్ల వారు పార్మాసిస్ట్, హిల్త్ అసిస్టెంట్ లాబ్ టేక్నిషియాన్, స్టాఫ్ నర్సులు మరియు EC ANMలు బాధ్యతతో మెలిగి మనబలం ప్రభుత్వానికి తెలియజేసి మన హక్కులను సాదించు కోవాలని అందుకు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనది అని తెలియచేస్తున్నాను.
2001 నుండి మన డిపార్టుమెంటులో వివిధ పథకాలలో అనేక పోస్టులకు ANM, MPHA, Pharmacyst, Lab Technician మరియు డాక్టర్లను లను కాంట్రాక్టు పద్దతిన నియామకాలు జరిపారు. అప్పటిలో మన డిపార్టుమెంట్లో జాయున్ వారందిరికి వంద శాతం స్థూలవేతనం ఇచ్చారు, కాని 2004 సంవత్సరములో GO 12 ను ఇచ్చి మన పీక కోయ్యలని ప్రయత్నం చేసారు కాని మనందరం కలసి పోరాటం చేయటం వలన 2006లో మేమో నెం 19556 తీసుకురావడం ద్వారా మనం మన వంద శాతం స్థూలవేతనం కాపాడు కోగలిగాము, అలాగే 2011లో GO No.3 ని మనకు వర్తింపచేస్తూ ఆయా పోస్టుల బేసిక్ వేతనాన్ని మనకు జీతాలుగా చెల్లించాలని ప్రయత్నం చేసారు కాని అది వీలు పడలేదు, అప్పటి నుండి క్రొత్తగా ఉద్యోగంలో చేరిన కాంట్రాక్టు వారికి బేసిక్ వేతనాన్ని (Minimum of Time Scale) మాత్రమే ఇవ్వడం ప్రారంబించారు. 2016లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 151 జీవో ద్వారా, 2017 కాంట్రాక్టు ఉద్యోగులకు జీవో నెం.95 ద్వారా 50% జీతాలు పెంచుటకు ప్రయత్నించగా మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటులో 100% బేసిక్ సాలరీ (Basic+DA+HRA) తీసుకునేవారు వున్నారు 95GO వలన మాకు అన్యాయం జరుగుతుంది మేమంతా 1999, 2005, 2010 PRCలు తీసుకున్నామని మనం ప్రభుత్వానికి వివరించడం వలన మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటు కాంట్రాక్టు ఉద్యోగులకు మరో జీవో ఇస్తామని ఆ రోజు GO 95లో పొందుపరిచారు.
ఆ తరువాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటు కాంట్రాక్టు ఉద్యోగులందరి జాబితాను జిల్లాల నుండి మరియు వివిధ ఇన్సిట్యూట్ ల నుండి తెప్పించి మనకు న్యాయం చేసేలా కసరత్తు జరుగుతున్నదని అందుకే ఆలస్యం అవుతున్నదని చెబుతూ సుమారు 7 నెలల కాలయాపన చేసారు, దానిలో 2670 మంది MPHA(M), 239 మంది ల్యాబ్ టెక్నిషియన్స్, 230 మంది ఫార్మాసిస్టులు, 347 మంది MPHA(F) లు మరియు 123మంది డాక్టర్లు వున్నాము, మనందరం ఇంతకాలం ఓపికగా ఎదురుచూశాము, కానీ ఒక్క అడిషనల్ సెక్రటరీ ఇచ్చిన దుర్మార్గ సలహా వలన ప్రభుత్వం ఈ జీవో నెం 27లో Annexure-1 ను పొందు పరచి ఉద్యోగులకు అసంతృప్తిని ఆగ్రహాన్ని కలిగించింది. దీనివలన
1) గత 17 సంవత్సరాలుగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటు నందు Basic+DA+HRA తదితర అలవెన్సులతో కూడిన 100% స్థూల వేతనం, ప్రతి రెన్యువల్ సమయంలో పెరిగే డిఏ అమలు తదితర సౌకర్యాలన్నింటినీ ఈ జీవో రద్దు చేస్తుంది. వాటన్నింటినీ కలిపి గంపగుత్త మొత్తంగా (ఏప్రిల్ 2017 నాటికి మనకు వస్తున్న 100% సతుల వేతనం లెక్కించి (Basic+DA+HRA)) దాన్నే జీతంగా నిర్ణయించింది. ఇందు వలన ప్రతి సంవత్సరం మనకు పెరిగే జీతం బదులుగా 5 సంవత్సరాలకు ఒక సారి వచ్చే PRC సమయలోనే పెరుగుతుంది ఇది చాలా అన్యాయము.
2) జీతంలో ఏ రకమైన అలవెన్సులు కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తించకుండా చేసి రెగ్యులరైజేషన్ కు పనికి రాకుండా చేసి అందుకు అనుగుణంగా గతంలో ఉన్న జీవోలన్నింటినీ రద్దు చేశాము అని చెబుతూ వాటి స్థానంలో GO27 అమలులోకి వస్తుంది అని చెప్పడం వలన మన ఉద్యోగాల మనుగడకు ప్రమాదం వాటిల్లే అవకాసం వుంది ఎలాగంటే మనం ఉద్యోగాలలో చేరిన తరువాత మన జిత భత్యాలు నిర్ణయించలేదు మన రిక్రూట్మెంట్లు కొరకు ఇచ్చిన GO లలోనే మన జీతాలు ఎంత ఇవ్వాలి అనేది కూలంకుషంగా వుంది అన్ని GO లు కాన్సిల్ చేసాము అంటే మనం ఉద్యోగాలలో ఉన్నట్లా లేనట్లా?
3) మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగుల జీతాల పెంపుదలను 2017 ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని ప్రతిపాదిస్తే జీవోలో 2018 ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తామని ఇచ్చారు. దీని వల్ల ఒక సంవత్సరం పెంపుదల ఫలితాన్ని ఉద్యోగులు కోల్పోతారు.
మెడికల్ అండ్ హెల్త్ రంగంలో ఒకే డిజిగేషన్‌తో ఒకే పని చేసే ఉద్యోగులకు వివిధ రకాల జీతభత్యాలు ఇప్పటివరకు ఇచ్చారు. ఏడాదిన్నర క్రితం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పు అమలు చేయడం వల్ల ఉద్యోగుల వేతన వ్యత్యాసాలు రూపుమాపాలని, గత సంవత్సరం కాలం నుండి ఉద్యోగులు పోరాడుతూ వచ్చారు. ఉద్యోగుల జీతాలలో వ్యత్యాసాలు తగ్గించేందుకే ఈ జీవోను విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. కానీ కాంట్రాక్టు ఉద్యోగులలో అసమానత్వాన్ని తగ్గించేందుకు వంద శాతం స్థూలవేతనాన్ని ఎత్తివేస్తున్నామని చెప్పారు ఇది అన్యాయము, సమానత్వము అంటే సాంక్షన్ పోస్టులో జాయిన్ అయిన వారందరికీ 100% గ్రాస్ సాలరీ వర్తింప చేయడం ద్వారా సమానత్వం తీసుకు రావాలి కాని అధికారులు ఒక గీత గీసి ఇంతవరకే అందరికి సమానం అంటే ఎలా వీలు అవుతుంది.
అయినా GO 27 లో కూడా ఒకే క్యాడర్ ఉద్యోగులకు వివిధ యాజమాన్యాల కింద నియమితులైన వారికి, వివిధ రకాల జీతభత్యాలు నిర్ణయించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ద్వారా నియమితులైన స్టాఫ్ నర్సులకు నెలకు రు.34,318, ఏ.పి. వైద్య విధాన పరిషత్, ఏ.పి. వి.వి.పి. ట్రామాలో నియమితులైన వారికి రు.34,000లు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల ఆస్పత్రులు, నేషనల్ హెల్త్ మిషన్‌లో నియమితులైన వారికి నెలకు రు.22,500లుగా నిర్ణయించారు దీనిలో సమానత్వం ఎక్కడ వుంది.
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్‌లో ఏఎన్‌ఎమ్‌లకు నెలకు రు.28,000, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్‌ఫేర్‌లోని ఇసి ఏఎన్‌ఎమ్‌లకు నెలకు రు.21,000లు, నేషనల్ హెల్త్ మిషన్ ఏఎన్‌ఎమ్‌లకు నెలకు రు.18,975లుగా నిర్ణయించారు.
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కెజిహెచ్‌లో నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్లకు నెలకు రు.28,000లు, ఏ.పి. వి.వి.పిలో వారికి నెలకు రు.24,421లు, ట్రామా కేర్‌లో వారికి రు.24,000లు, రిమ్స్ ఆస్పత్రులలో వారికి నెలకు రు.21,230లు, నేషనల్ హెల్త్ మిషన్, టిబిలలో వారికి నెలకు రు. 19,019లుగా నిర్ణయించారు. రిమ్స్ ఆస్పత్రులలో ఫార్మసిస్టులకు నెలకు రు.21,230, నేషనల్ హెల్త్ మిషన్‌లో వారికి నెలకు రు.19,019లు, మిగతా అన్నిచోట్ల ఉన్న వారికి నెలకు రు.28,000లుగా నిర్ణయించారు.
ఒకే విద్యార్హత, ఒకే డిజిగేషన్, ఒకే పని ఉన్న వారికి ఉద్యోగాలు నియమించిన అధికారిని బట్టి జీతభత్యాలలో భారీ తేడాలు నిర్ణయించడం GO 27 లోనే కుదిరింది. అందరూ డిఎస్‌సి ద్వారా రిక్రూట్ అయిన కుడా జాయిన్ GO లను బట్టి వ్యత్యాసాలు వున్నవి వారిలో వంద శాతం స్థూలవేతనం ప్రస్తుత పిఆర్‌సి ప్రకారం జీతాలు పెంపుదలను తెసుకుంటున్న వారికి అదేవిధంగా వంద శాతం స్థూలవేతనం మరియు అన్ని అలవెన్సులు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మిగిలిన వారందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అందుకు అనుగుణంగా జీవో నెం.27ను సవరించాలి.
మిత్రులారా! తాడో పేడో తేల్చుకుందాం GO 27 సవరణ అయ్యే వరకు మన పోరాటం ఆపవద్దు. మన సత్తా చూపించే సమయం ఆసన్నమయింది, సత్తాచూపుదాం మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం రెగ్యూలరైజేషనే ప్రధాన అజెండాగా పోరు జెండా ఊపి ముందుకు సాగుదాం, GO27 సవరణ కోసం మనమంతా కలసికట్టుగా పోరాడటం మన కర్తవ్యం. మన సమస్యల మీద స్పందించే ప్రతి ఒక్కరు ఒక్కటి అవ్వాలి, అదే విధంగా DSC ద్వారా సెలెక్ట్ కాబడిన వారందరూ ఒక తాటిపైకి వచ్చే కార్యక్రమం చేయాలి అప్పుడే అందరికి న్యాయం జరుగుతుంది, డా.రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అందరం కలిసి మనల్ని కోర్ట్ కేస్ అని ప్రక్కన పెట్టారు, కోర్టు కేసులు అన్ని పూర్తీ అయినా ఎక్కోడో ఉమాదేవి కేసు వుంది అని మల్లి కోర్టు కేసులకు ముడిపెడుతున్నారు. ఏది ఏమైనా అందరి కోసం మన పోరాటం తప్పని సరి, గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడేళ్ళు కసరత్తు చేసి, రెగ్యులరైజ్ చేసేందుకు సుప్రీంకోర్టు తీర్పు ఆటంకమని ఎవరినీ రెగ్యులరైజ్ చేయలేమని తేల్చివేసింది, దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి.
కాని మన ఆశలులు అడియాశలు అయ్యాయి అని మనం నిరసించి పోకూడదు, వారు చూపించే సాకులనే అస్త్రాలుగా మరల్చుకుందాము వారు చూపించే ఉమాదేవి కేసునే ఆయుధంగా వాడుదాం.
అదే ఉమ దేవి కేసు ఆర్డర్ (2006) వచ్చిన తరువాత అనేక రాష్ట్రాలలో కాంట్రాక్టు వారిని రెగ్యులర్ చేసారు. మరి ఆ రాష్ట్రాలకు ఉమ దేవి కేసు వలన రాని అడ్డంకి, మన రాష్ట్రానికి ఎందుకు వస్తుంది.
మరో విషయం సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆత్మగోషతో అసెంబ్లీ లో దుఃఖిస్తూ కన్నీరు కారుస్తూ అన్న మాటలు "కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ట్రిబ్యునల్స్, కోర్ట్ కేసులతో సంభందం లేకుండా ఎన్ని అడ్డంకులున్నా ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి AP కి హోదా వెంటనే ఇచ్చేయవచ్చు. కాని కేంద్రం కావాలని AP కి హోదా ఇచ్చేవుద్దేశ్యం లేకుండా నాటకమాడి అన్యాయం చేస్తుంది" ప్రస్తుతం మనం అడిగేది అదేకదా. ప్రభత్వం చేయాలనుకుంటే కాంట్రాక్టు ఉద్యోగులను కోర్ట్ కేసులతో సంభందం లేకుండా ఎన్ని అడ్డంకులున్నా రెగ్యులర్ చేసి జీవితాలను నిలిపినవరావుతారు కదా, మరి ఎందుకని వాయిదా వేస్తున్నారు? మల్లి ఇప్పుడు హోదా బాదలు మొదలయ్యాయి మన బాద పట్టించుకోకుండా హోదా అంటున్నందుకు బాధపడాలో, హోదా వస్తే రెగ్యులర్ వారి జితబత్యాలు అన్ని కేంద్రమే భరిస్తుంది కాబట్టి కాంట్రాక్టు వారిని రెగ్యులర్ చేసి మన జీతభత్యాల భారం తగ్గించు కోవడానికి మన ఆశ నేరవేరుస్తుందో తెలియని గందరగోళం.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మన ముందు వున్న ప్రదాన సమస్య GO27 ను సవరణ చేయించుకోవడము, అందుకు గాను మనందరం కలసి పోరాటం చేయటం ఒక వంతు అయితే ఎవరైనా స్వచ్చందంగా మన కోసం పని చేస్తాను అని అంటే వారికి సహకరించి మన పని చేయించుకోవడం ఒక వంతు. ఇక్కడ మనకు సమయం చాలా తక్కువ వుంది ఏప్రిల్ 20లోపు మన తీసివేసిన 100% గ్రాస్ సాలరి మనం సాదించుకు తీరాలి, ఒక్క సారి సవరించిన జీతాలు తీసుకుంటే సమస్య మరింత జటిలం అయ్యే ప్రమాదం వుంది. అసెంబ్లీ అయ్యిన తరువాత అంటే లాభ లేదు అని నా మనసుకు అనిపిస్తుంది మన కోసం పోరాటం చేస్తున్న వారికి మనం ఈ గ్రేస్ టైం గురించి వివరించి పోరాటం మరింతగా తీవ్రరూపం దాల్చే విధంగా మనం అందరిని కలసి ప్రయత్నిచాలి. 12 సంవత్సరాలకు ఒక సారి పుష్కరాలు వస్తే మనకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలప్పుడు అవకాసం వస్తుంది దీనిని మనం ఉపయోగించుకోవాలి, అందరం ఒక 6 నెలలు యుద్ద సైనికులులాగా పనిచేస్తే మనం అన్ని విషయాలలో విజయం సాదించవచ్చు.
ఇప్పుడు చెప్పండి మనం ఎం చేద్దాం...............