Capital City Amaravati

హెల్త్ మినిష్టర్ ఫరూక్ గారిని కలసిన APJAC మరియు APPMCEA ప్రతినిధి బృందం

పత్రికా ప్రకటన
 ఎ.పి.పి.యం.సి.ఇ.ఎ అమరావతి
తేది 23 11 2018



కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఆరోగ్య కార్డులు హెల్త్ కార్డ్ సదుపాయం కల్పించాలి బొప్పరాజు


ఈరోజు 23 11 2018 తేదీన సచివాలయంలో APJAC బొప్పరాజు గారి సారధ్యంలో ఏపీ జేఏసి అమరావతి రాష్ట్ర నాయకత్వం
మైనారిటీ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి గౌ.శ్రీ ఎన్ ఎం  డి ఫరూక్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి జీవోఎం లో కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయం సానుకూలమైన నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ,  ఏపీ జేఏసి అమరావతి తరఫున చిరు సన్మానం చేసి ఉన్నారు.

ఈ సందర్భంగా బొప్ప రాజుగారు వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల లకు జీతాలు పెంచుతూ ఇచ్చిన జీవో నెంబర్ 27 లో చేయవలసిన మార్పులు వెంటనే చేసి వారికి పెరిగిన జీతములు అందేలా చేయాలని కోరారు.
అదే విధముగా కాంట్రాక్టు ఉద్యోగులు కూడా హెల్త్ కార్డ్స్ సదుపాయం కల్పించాలని కోరారు.

అంతేకాకుండా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో కాంట్రాక్టు లెక్చరర్స్ కు మినిమం టైం స్కేల్ వర్తింప చేయడానికి నిర్ణయం , తీసుకున్నప్పటికీ వాటిని ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్లు కూడా అమలు పరచటానికి  స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరియున్నారు.

వీటిపై మంత్రివర్యులు స్పందిస్తూ నేను త్వరలోనే వీటిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసి అమరావతి రాష్ట్ర సెక్రటరీ జనరల్ టి.వి ఫణి పేర్రాజు మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారు మున్సిపల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మరియు కృష్ణా జిల్లా జేఏసీ చైర్మన్ ఈశ్వర్ , కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హేన్రిబాబు, డిగ్రీ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రమేష్ , తాత్కాలిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేష్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

బొప్పరాజు /  ఫణి మరియు జాన్ హేన్రి

About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.