ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అందరికి ఎక్సగ్రేషియా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలు
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది కాంట్రాక్టు సిబ్బంది వివధ డిపార్టమెంట్లలో పని చేస్తూ ఉన్నారు. వీరు రెగ్యులర్ పోస్టులలో ఒప్పంద ఉద్యోగులుగా ఒక రెగ్యులర్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్క పని చేస్తూ తమ రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తూ ఉన్న సిబ్బంది. అయితే 20 సంవత్సరాల క్రితం మొదలైన ఈ కాంట్రాక్టు వ్యవస్థలో ఇంతవరకు చాలామంది కాకపోవడం రెగ్యులరైజేషన్ చాలా దురదృష్టకరం ఇటువంటి పరిస్థితులలో దాదాపు 17-18 సంవత్సరాల క్రితం ఉద్యోగస్తులలో చేరిన వారు ఇప్పుడు 50 సంవత్సరాల వయస్సు దాటిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటివారిలో 2017-18 సంవత్సరంలో సుమారుగా 100 మంది పైగా వివిధ కారణాలచేత అకాల మరణం చెందడం జరిగింది. ఈ విషయాన్ని ఏపీ జెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు అన్నగారి సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ పారామెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి కాంట్రాక్టు ఉద్యోగులకు వెంటనే మరణానంతరము ఆర్థిక భరోసా కల్పించే విధంగా నిర్ణయము తీసుకోని ఆ విషయాన్ని తదుపరి కేబినెట్ లో చర్చకు వచ్చేలా చేసి జీవో నెంబర్ 25 విడుదల రావడానికి అనుమతి నిచ్చిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
అదేవిధంగా ఏపీ జేఏసి అమరావతి ద్వారా తన శ్రమ మరియు ప్రజ్ఞాపాటవాల వలన రెగ్యులర్ ఉద్యోగస్తులకు దాదాపు 10సంవత్సరాలుగా పేరుకు పోయిన ఎన్నో సమస్యలను తీర్చడమే కాకుండా, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ part time full time ఉద్యోగులకు న్యాయం జరగాలని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిన్న ఉద్యోగస్తులను ఆదుకోవాలని వారందరికీ కూడా సత్వర న్యాయం చేయలేక పోయినా చిన్న చిన్న రాయితీలు కల్పించి వారికి సహాయము చేయాలని వారి ఆనందానికి ఎంతో ప్రయత్నం చేసి మరణించిన కాంట్రాక్టు ఉద్యోగికి మట్టి ఖర్చులు (GO.MS.119) క్రింద 15వేల రూపాయలు మంజూరు చేయడానికి కృషిచేసి మరలా ఈ విధంగా మరణానంతరం ఆర్థిక భరోసాగా ఆకస్మిక మరణమునకు 5లక్షలు మరియు సాధారణ మరణమునకు 2లక్షలు ఆర్ధిక భరోసా ప్రభుత్వముద్వారా కల్పించినందుకు బొప్పరాజన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరియు ఈ విజయాలలో మా వెన్నంటే ఉండి మమ్ములను ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న APJAC అమరావతి సేక్రేటరిజనరల్ ఫణి పేర్రాజు గారికి, APJAC అమరావతి ట్రెజరర్ మురళీకృష్ణ గారికి, కృష్ణా జిల్లా APJAC అమరావతి చైర్మన్ ఈశ్వర్ గారికి, గుంటూరు జిల్లా APJAC అమరావతి చైర్మన్ సంగీతరావు గారికి, ఆంధ్ర ప్రదేశ్ డ్రైవర్ల సంఘం ప్రెసిడెంట్ కొండయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ లేబర్ డిపార్ట్మెంట్ సంఘం సేక్రేటరి కిశోర్ గారికి, రాజేష్ గారికి మాకు సహాయం గా వుండి మా కష్టంలో ఆనందంలో పాలుపంచుకున్నదుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము...
APPMACEA AMARAVATI.
0 Comments:
Post a Comment