Capital City Amaravati

APJAC AMARAVATI EXPLAINED CONTRACT OUT SOURCING EMPLOYEES PROBLEMS TO PRC COMMISSIONER.

                       
 11వ PRC కమిషనర్ గరిని కలసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సొర్సింగ్ వ్యవస్థలలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క బాధలను వివరించడం జరిగింది. ఈ సందర్భముగా చైర్మన్ బొప్పరాజు గారు మాట్లాడుతూ గవర్నమెంటులో రెగ్యులర్ ఉద్యోగులతో సమానముగా పనిచేస్తున్నకాంట్రాక్టు వారి సంక్షేమము గురించి ఏమన్నా అడుగుదాము అంటే వారి గురించి మీరు మాట్లాడ వలసిన అవసరం లేదు అని అధికారులు ప్రజానాయకులు అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని అయన ఆవేదన వ్యక్తం చేసారు. ఒకే ప్రభుత్వ కార్యాలయములో ఒక ప్రక్క రెగ్యులర్ ఉద్యోగి ఒక పక్క కాంట్రాక్టు ఉద్యోగి మరోపక్క ఔట్సొర్సింగ్ ఉద్యోగి ఇంకోపక్క NMR కూర్చొని పనిచేస్తున్నారు.  ఉద్యోగాల్లో చేరేఅప్పుడు పాపం ఇన్ని తేడాలు ఉంటాయని వారికి తెలియదు. బాధ్యతలు ఏమో అంతే సమయం అంతే పని రెగ్యులర్ ఉద్యోగులతో సమానముగా వారితో కూడా పనిచేయిస్తున్నారు, ఇంకా కావాలంటే ఎక్కువగంటలు పనిచేపిస్తున్నారు. కానీ ఉద్యోగము చేసే అపుడు పై అధికారికి కోపం రానివ్వండి లేదా పక్కన పనిచేసే జూనియర్ అసిస్టెంట్ కి కోపం రానివ్వండి అధికారి జునియర్ అసిస్టెంట్ కుమ్మకై పాపం పాపం ఈ ఔట్సొర్సింగ్ ఉద్యోగిని ఇంటికి పంపించి వేయడానికి చూస్తున్నారు. ఇంకా కొన్ని సందర్బాలలో దుర్మార్గముగా తన వాళ్లకు ఉద్యోగం ఇప్పించాలనిలేదా నాలుగు పైసలు లాభం కలుగుతుంది అనుకుంటే కూడా వీళ్ళను ఉద్యోగాల్లో లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

               దీనికి ఒక సిస్టం ఏర్పాటు చేయాలి, జీతం ఏదైతే వారికి ఇస్తున్నారో అదికూడా వారికిసరిగా అందని పరిస్థితి ఏర్పడింది, ఉద్యోగులకు నియామకాలకు ఏర్పటుచేసిన ఏజన్సీలు పార్టీల ప్రాతిపదికన ఏజన్సీలు పంచుకున్నారు, ఒక చోట 40 ఉద్యోగాలు ఉంటె అక్కడ 5 నుండి 6 ఏజన్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ని ఏజన్సీలు అవసరమా అని ఆలోచించాలి, చాలా ఏజన్సీలు PF లు కట్టకుండా, ESI షేర్ చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారు దీనివల్ల ఆ పైసలు వీళ్ళచేతికి అందక అవసరంలో ఆపదలో అడ్డంపడకుండా ఏజన్సిల కడుపు నింపుకుంటున్నారు.   అసలు ఆ వ్యవస్థ పరిస్థితి దారుణంగా వుంది. క్షేత్రస్థాయిలో ఉద్యోగి వద్దకు వెళ్లి మాట్లాడితే ఎదోఒకటి ఇస్తున్నారులే అన్ని ఇవ్వమంటే ఇక్కడనుండి పోమ్మంటారేమో ఇలా వుంటే చాలు అనే పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం. HR పాలసీని కొందరికే వర్తింపచేస్తున్నారు, అంటే బద్రత ఇస్తున్నాము అంటున్నారు అదే బద్రత అందరికి కల్పించండి, మీకు నచ్చిన వారికి బద్రత అన్ని రాయితీలు ఇస్తున్నారు కొందరిని గాలికి వదలివేస్తున్నారు   దీనిని పోగొట్టడానికి ఒక పద్దతిని మీరు రూపకల్పన చేయించి చిన్న చిన్న ఉద్యోగులను ఆడుకోవడం వలన మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అని ఆయన విన్నవించారు.   

                   అదేవిధముగా సెక్రెటరి జనరల్ పేర్రాజు గారు మాట్లాడుతూ ప్రభుత్వము ఇప్పుడు ఒకే పని చేసే వారికిఒకే జీతం ఇవ్వాలి అని ఒక పద్దతిని ప్రవేశ పెడుతుంది కాని ఇలా ఎజన్సిల ఇష్టా రాజ్యం అవ్వడం అవ్వడం వలన కష్టపడి పనిచేసే వారిని అధికారి పొమ్మని ఎప్పుడు పొమ్మని చెప్పలేదు ఎందుకంటే పని కుంటూ పడిపోతుంది కాని ఏజన్సీలు వాళ్ళ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ ఇలా ఉద్యోగులలో భయాందోళనలు గుచేయడం మంచి పధ్ధతి కాదు అందుకని బొప్పరాజు కోరిన విధముగా ఒక కాంట్రాక్టు ఔట్సొర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా ఒక సిస్టం ను రూపొందించడం జరగాలని ఆయన విజ్ఞప్తి చేసారు. 


About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.