నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!
నేను సైతం
భువనఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!
(శ్రీ.శ్రీ. జయభేరి)
మహాకవి శ్రీ శ్రీ రచించిన జయభేరి గేయములో లాగా మనలో ప్రతి ఒక్కరూ నూతన ప్రభుత్వము వచ్చిన తరువాత, చాలా హుషారుగా ఉన్నట్లు కనిపిస్తుంది. వాట్స్ ఆప్ మోత మోగి పోతుంది పోన్ కాల్స్ కి అసలు విసుగే లేదు. ఈ లోపు కొత్త ముఖ్యమంత్రి కొంత మందికి ఇచ్చిన తాయిలాలు మనసును ఒకపట్టాన వురుకోనివ్వడం లేదు. అప్పుడు అందరి మదిలో పుట్టిన ప్రశ్న ఏం చేద్దాం ఏం చేద్దాం.... ......
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి.,
ఎముకలు కుళ్ళిన,
వయస్సు మళ్ళిన,
సోమరులారా చావండి
నెత్తురు మండే
శక్తులు నిండే
సైనికులారా రారండి
హరోం, హరోం, హర హర
హరోం హరా అని కదలండి
మరో ప్రపంచం
మహా ప్రపంచం
దరిత్రినిండా నిండింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు.......
(శ్రీ. శ్రీ. మహా ప్రస్థానం)
శ్రీ శ్రీ గారు బలే తిట్టారు కదా ఇలా అన్నా కుడా జనాలకు అప్పట్లో చైతన్యం రాలేదు, అప్పట్లో ఏంటిలే ఇప్పటికి కూడా చైతన్యం రావడం లేదు. మొన్నొకరోజు విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రి గారిని కొంత మంది కలసి వారికోర్కెలు చెప్పుకో గలిగారు, అప్పుడు మిగతా వారు ఏమి చేస్తున్నారు అని ఒకాయన ప్రశ్న వేస్తున్నాడు, ఆశ్చర్యం అయన కుడా ఇప్పటి వరకు కలవ లేదు అందుకు బదులుగా ఒక్కరు సమాధానం ఇవ్వలేదు కుడా.
ఆహా మా నాయకుడు చేసేస్తాడు, ఓహో మా నాయకుడు చేసేస్తాడు అని ఇప్పటికే ఒక విడత దరువు కార్యక్రమం అయిపొయింది, కానీ ఇంత వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు, ఎవరిని కలవాలి ఎప్పుడు కలవాలి ఎక్కడ కలవాలి ఏం చెప్పాలి అనే ప్రశ్నలు మస్తిషకాన్ని చీల్చేస్తుంటే అమావాస్య నాడు రేచీకటి వాడి నడకలా ఉన్న పరిస్థితులాలో మల్లి అదే ప్రశ్న ఏం చేద్దాం.... ఏం చేద్దాం..
చల్లారిన సంసారాలు,
మరణించిన జన సందోహలు,
అసహాయుల హాహాకారాలు,
చరిత్రలో మూలుగుతున్నవి.,
వైషమ్యం, స్వార్ధపరత్వం,
కౌటిల్యం, ఈర్ష్యలు, స్ఫర్ధలు,
మాయలతో, మారుపేర్లతో
చరిత్రగతి నిరూపించినవి
(శ్రీ.శ్రీ. దేశ చరిత్రలు)
ఇక్కడ శ్రీ. శ్రీ. గారి కవితలు అడ్డపెట్టుకొని నేను మిమ్ములను తిడుతున్నాను అని బాగా అర్ధం అయింది అనుకుంటా . కానీ నేను మిమ్ములను ఏమనా అంటే నా ఆత్మను అనుకున్నట్లే కదా కానీ ఏం చేస్తాం అది నేను చెప్పిన మాట వినదే........
నేను మన కాంట్రాక్టు ఉద్యోగులకు చెప్పేది ఒక్కటే వీలయినంత మంది MLA లను కలవండి మీ మాటలలో మన సమస్య వారికి చెప్పండి, మా వాడు వేష్టు అని ఎవరిని తిసివేయవద్దు ఏమో గుఱ్ఱం ఎగురావచ్చు. తెలివిగలావాడు అన్ని అలోచించి మనలను పక్కన పెట్టవచ్చు, వేష్టు అన్నవాడు బెస్టుగా మన సమస్య భుజాన వేసుకోవచ్చు.
పేకాట లాగ పట్టిన నాయకత్వ జిలతో మేము మా పరిధిలో (రాజధాని) అందరు మంత్రులు అధికారులు తమ తమ చోటులలో వచ్చిన తరువాత చేయవలసిన కార్యక్రమాల గురించి విరామం లేకుండా శ్రమిస్తూ దారులు ఏర్పాటు చేస్తున్నాము..
అసలైన రైలు పట్టాలు ఎక్కేవరకు గమ్యం చేరే వరకు ఇదే స్పూర్తిని కొనసాగిస్తారు అని ఆశిస్తూ......
జాన్ హెన్రీ...
0 Comments:
Post a Comment