Capital City Amaravati

Save us from injustice


పత్రికా ప్రకటన
రాష్ట్ర వ్యాప్తముగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నందు ఏ.యన్.యం / యం.పి.హెచ్.ఏ./ల్యాబ్ టెక్నీషియన్ /ఫార్మాసిస్ట్  మరియు స్టాఫ్ఫ్ నర్స్ కేడర్లలో పనిచేస్తున్న సుమారు 24వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రాధేయపడే పరిస్థితి నేడు నెలకొన్నది. దీనికి ప్రదాన కారణం గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగాలలో మెడికల్ అండ్ హెల్త్ కి చెందిన ఏ.యన్.యం (MPHA(F)) ఉద్యోగాల భర్తీ విషయములో గతములో ఎన్నడు లేని విధముగా కాంట్రాక్టులో పనిచేస్తున్న వారి స్థానాన్ని కూడా కాలిగా (Vacant) చూపడం వలన ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించబోయే వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక పోయినా లేదా వయస్సు అడ్డంకి వంటి మరి ఏ ఇతర కారణము చేతనైన అర్హత సాధించక లేకపోతే సదరు కాంట్రాక్టు ఉద్యోగి తన ఉద్యోగం కోల్పోవలసి రావడం పై అభ్యర్ధనకు కారణం అయ్యింది.
ఇటివంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారు తమకు హామీ ఇచ్చిన విధముగా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించిన తర్వాతే కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని, ఒకవేళ తమను ప్రస్తుతము ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము గ్రామ / వార్డు సచివాలయంలో తీసుకోవాలి అంటే తమను రెగ్యులర్ చేస్తూ ప్రస్తుతము ప్రభుత్వము రెగ్యులర్ ఏ.యన్.యం లకు ఇస్తున్న జీతమును ఇవ్వాలని  డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఏఎన్‌ఎంలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన తీరు రాస్జ్త్రములో పనిచేస్తున్న మరిముఖ్యముగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులలో భయాందోళనలు కలిగించాయి.
మేము కలలు కన్న రాజన్న రాజ్యం ఇదికాదు. జగనన్న రాజ్యం వస్తే మమ్ములను ఎంతో ఆదరించిన రాజన్న అకాలమరణంతో అర్ధంతరంగా ఆగి పోయిన మా బతుకులలో వెలుగులు మరలా వస్తాయని ఎదురు చూసాము. కొంత మంది అధికారులు మా పై సీత కన్ను వేసి మాకు అన్యాయం చేస్తున్నారని అనుకుంటున్నాము.  “రాజన్న రాజ్యంగా” విశేష ఖ్యాతి గడించాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్ది ఆకాంక్ష, ఆశయాలకు తూట్లు పొడిచేలా కొంత మంది అధికారులు వ్యవహరిస్తున్నారు. మా చిరకాల వాంఛ అయిన రెగ్యులర్ అనే అంశాన్ని తూట్లు పొడిచి ఏ ప్రయోజనాలు ప్రభుత్వానికి అందించడానికి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారిపై కాంట్రాక్టు ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తున్నారో అర్ధం కావడం లేదు.
 గ్రామ /వార్డు సచివాలయాలలో ఇస్తున్న మొత్తం 1.50 లక్షల ఉద్యోగాలలో ఉన్న కాంట్రాక్టు వారు ఉన్న పది కేడర్లకు కలిపి 11 – 12 వేల మంది మాత్రమే కాంట్రాక్టు వారు వున్నారు మిగతా 20వేల మంది వేరే కేడర్లలో వేరే వెరే డిపార్టమెంట్లలో వున్నారు, ప్రస్తుతము వచ్చిన నోటిఫికేషన్లలో ఈ 11-12 వేలమందిని డైరెక్టుగా రెగ్యులర్ చేసినా నిరుద్యోగుల నుండి ఎటువంటి ఆపేక్షన వచ్చి ఉండేది కాదు. ఈ విషయాన్ని భూతద్దములో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి చూపించి తప్పుదోవ పట్టించారు. మాట తప్పని, మడమ తిప్పని నేతగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి వున్న విశ్వసనీయతను దెబ్బతీసేందుకు అధికారులు వ్యవహరిస్తున్నట్లుగా వుంది.
అయ్యా, మా జీవితాలను ఆంధకారం చెయ్యోద్దంటూ… బ్రతుకుపై భరోసాతో మాకు కలిగిన ఆందోళనను గౌరవ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్ది గారికి దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఏ.యన్.యం అక్కాచెల్లెమ్మలు చేప్పట్టిన బ్రతుకు భరోసా ఆందోళనను ఉగ్రవాద దాడి అంత స్ఠాయిలో చిత్రికరించవద్దు, ముఖ్యమంత్రి గారి వద్ద కీలక స్ఠానాల్లో వున్న అధికారుల సూచనల కారణంగానే పోలీసులు మా పై ఇంత దారుణంగా అమానుషంగా వ్యవహరించారని మాకు అనుమానంగా వుంది తక్షణం ఇటువంటి చర్యలు చేపట్టిన అధికారులపై ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకోవాలి.
మేము మా ఉద్యోగాల భద్రత కొరకు పైన చెప్పిన అన్ని అంశములు HOD లవద్ద నుండి ప్రిన్సిపల్ సెక్రెటరీ వరకు అందరి అధికారుల వరకు విన్నవించాము, ముఖ్యమంత్రి ఆఫీసు స్థాయి అధికారుల సూచనలు మేరకే నోటిఫికేషన్ ఈ విధముగా ఇవ్వడం జరిగిందని వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాదించలేని కాంట్రాక్టు ఉద్యోగులకు భరోసా కల్పించాలని మా అధికారులు తెలియచేసినా పై అధికారులు పెడచెవిన పెట్టారని తెలియవచ్చింది. అటువంటి పరిస్థితులలో  ఏ.యన్.యం అక్కాచెల్లెమ్మలు ఎదుర్కోంటున్న సమస్యను, వారి మానసిక క్షోభను ముఖ్యమంత్రి కార్యాలయ ఆధికారులతో చర్చించడం ఏ.యన్.యం లకు అయ్యే పనికాదు అందువలన సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్ళడానికి చేస్తున్న ఆందోళనను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలుగా చూడవద్దు, కేవలం మా బ్రతుకు భరోసాకు చెందుతున్న ఆందోళనగా పరిగణించి, ఉద్యోగ భద్రత కల్పించే విధముగా అధికార్లతో లేదా స్వయముగా ముఖ్యమంత్రి వర్యులు చర్చలు జరిపి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలి.
ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను తీసేసి, కొత్తవాళ్ళను తెచ్చుకోవడం, వాటికే ఉద్యోగాల కల్పన అని అనడం సరికాదు, కాంట్రాక్టు వాళ్ళను పర్మినెంట్ చేస్తామని, ఔట్సొర్సింగ్ వారికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని   ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు హమీ ఇచ్చారు, ఆ మాటలు నమ్మి, ఉద్యోగులు ప్రయోజనం పొందుతారనే భావనతో మేమందరం వైసిపిని గెలిపించేందుకు కృషి చేసాము, ఒక్క ఉద్యోగం ఊడగొట్టకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.  గ్రామ / వార్డు సచివాలయ పోస్టుల్లో ఏ.యన్.యంలకే ప్రాధాన్యం ఇవ్వాలని  సీయం కార్యలయాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము.
రాష్ట్రములో కాంట్రాక్టు  ఏ.యన్.యంలపై జరిపిన అమానుష, దారుణ చర్యను తీవ్రంగాఖండిస్తున్నాము.  రాష్ట్రములో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు పద్దతిన పనిచేస్తున్న అందరిని రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్టు వారినందరినీ రెగ్యులర్ చేయుట గురించి ప్రభుత్వానికి మా ఆవేదన తెలియచేయుటకు అంధ్రప్రదేశ్ పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం తరుపున రాష్ట్ర వ్యాప్తంగా వున్న వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులందరు కలసి పనిచేయాలని కోరుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపి ఈ సమస్యను పరిష్కరిశారని ఆశిస్తు, వైద్య ఆరోగ్య శాఖలోని రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు మాకు సహకారం అందించాలి అని కోరుచున్నాము. అదే విధముగా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులర్ అనే సమస్య రాష్ట్రములో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నది కావున అన్ని డిపార్టమెంట్ల  ఉద్యోగ సంఘ నాయకులు, రెగ్యులర్ ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులకు సహాయముగా వుండాలని ప్రార్థిస్తున్నాము.

About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.