మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న మగ ఆరోగ్య కర్తలు అందరూ 2002 నోటిఫెకేషన్ కి చెందినవారే అలాగే అందరూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారి ఆద్వ్యర్యములో పని చేస్తున్నవారే అయితే వీరిలో.
1. 2003 లో 159Go తో జాయిన్ అయిన వారు
2. 2006 లో 1234Go తో జాయిన్ అయిన వారుగతములో ఉండేవారు కాలం గడచిన తరువాత
3. 2102లో 273Go తో జాయిన్ అయిన వారు
4. 2014లో 1207Go తో తిరిగి జాయిన్ అయినవారు అని రెండుగా ఉండగా
5. 2018లో 298Go తో కొందరు జాయిన్ అయినారు.
పై విధంగా చూసుకుంటే 2012కి ముందు ఉన్న రెండు గ్రూపులు కానీ 2012 తరువాత వచ్చిన 3 గ్రూపులు కానీ ఉండాలి కానీ
7. 2012లో Go159 తో చేరి Go273 దెబ్బకు బయటకు వెళ్లకుండా ఉన్నవారు వున్నారు.
అంటే ఇప్పుడు ఉన్నది 4 గ్రూపులు.
1. 2002లో 159 ప్రకారం చేరి ఇప్పటి వరకు బ్రేక్ లేనివారు.
2. 2006లో 1234 ప్రకారం చేరి ఇప్పటివరకు బ్రేక్ లేని వారు
3. 2012లో బ్రేక్ వచ్చి మరల 1207తో చేరినవారు
4. 2017 నుండి కోర్టు అర్దర్తో జాయిన్ అయినవారు వున్నారు.
ఇప్పుడు ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్పాను అంటే గ్రామ సచివాలయం పోస్టులలో ఆడవారికి అన్యాయం చేసారు (మంత్రిగారు / నాయకులు చెప్పిన ఏ విషయం కాగితాల మీదకు రాలేదు) కాబట్టి మనం కూడా అలాంటి అన్యాయానికి గురికాకుండా ఉండాలి అంటే అందరం కలిసి పనిచేయాలని సూచిస్తూ అందరిని అనగా పై నాలుగు గ్రూపులకు చెందిన దాదాపు 60మంది నాయకులను కలిపి మిటింగ్ ఏర్పాటు చేయడము వలన, జగన్ గారు రెగ్యులర్ చేస్తాను అని అన్నా GO ఆయన రాయడు కాబట్టి రాయమని ఇచ్చినవాడు అడ్డగోలుగా రాస్తే మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అందరిని కలవమని పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నెంబర్లలో 1.2.3.4. అని వరుసగా ఉన్నాయి కానీ అందరూ కలసి పనిచేయాలి అనేదానికి మాత్రం 4.3.2. మాత్రమే ముందుకు వస్తున్నారు.
అలాంటి పరిస్థుతులలో ఇది కరెక్టా కాదా అని కొంత మంది మిత్రులను అడగగా ఇలా కలసి పనిచేయడం మంచి పద్దతే అని అందరూ అంటున్నారు, కాని మీటింగుకు మనషులు రావడం లేదు అందుకు ముందుగా ఆలోచించింది ఎవరైనా వ్యక్తిగతముగా దుర్లాభము కొరకు ఇలా మనుషులు రాకుండా చేస్తున్నారా అని ఆలోచన చేయగా రాష్ట్రములో అలా చేయడానికి అవకాసం వున్నది ఇప్పటికే ఏదైనా ప్రదాన సంఘానికి అనుసంధానముగా వుంటూ ఇలాంటి ప్రయత్నమూ జరగటము వలన వారి సంఘానికి ఆటంకము కలుగుతుంది అని భావించిన వారు అలా చేయాలి, కాని మన వారు ఎవరూ ప్రత్యేకముగా ఒకే సంఘానికి పనిచేస్తున్నవారు లేదు అనేది స్పష్టమైన విషయం అందుకు ఆలోచించ వలసిన అవసరం లేదు. అంటే మనలో మనకే పడటంలేదు అందు వలననే మనము అందరమూ ముందుకు రావడం లేదు.
ఇందుకు కారణం జగన్ గారు అందరిని రెగ్యులర్ చేస్తాను అని చెబుతూ వారు చేసిన సర్వీసు అర్హత అని రెండు పదాలు నొక్కి చెబుతూ వున్నారు, అలాంటి పరిస్థితులలో 2017తరువాత చేరిన వారు చాలా అంధోలన చెంది అందరితో పాటు మనము రెగ్యులర్ కాలేమా అని బాధపడి ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలి అని వారు ఈ అందరిని కలపి పోరాటం చేద్దాము అనే విషయానికి ముందు నడవడానికి వస్తున్నారు
తరువాత, రెగ్యులర్ పోస్టులు గనుగ తీయడం మొదలు పెడితే 2002లో ఇచ్చిన నోటిఫికేషన్ లో వున్న పోస్టులను మాత్రమే తీస్తే మాకు అన్యాయము జరుగుతుంది అందువలన ఎక్కువ పోస్టులకు రెగ్యులర్ చేయించు కోవాలి అని అంటే అందరం కలసి పనిచేయాలని 1207 లో చేరిన వారు ఆలోచన చేస్తూ ముందుకు వస్తున్నారు.
ఇక పోతే 1234లో చేరిన వారు (2003కోర్టు తీర్పు, 2011 సుప్రీంకోర్టు వున్నా) ఒక వేల ప్రభుత్వాన్ని 1207 వారు కనుక చెడగొట్టి మరల ఇంటర్మిడియట్ అనే దానిని పైకి తీసుకు వచ్చారు అంటే రోస్టర్ లో 2003లో చేరిన వారు ముందు ఉండేలా పరిస్థితి మారిపోతుంది, మరియు వారిలో కొందరు జగన్ చేస్తాను అన్నాడు ఏదన్నా తేడా జరిగినా కోర్టుకి కూడా వెళ్ళాము కాబట్టి కోర్టు ఆర్డర్ వచ్చే అంత వరకు ఆగితే లాభం జరుగ వచ్చు అనే ఉద్దేశంతో ఉండటం వలన వారు అందరు కలసి రావాలి అనేదానికి కొంచెం దూరంగా వుంటున్నారు.
చివరిగా, 2002చేరి ఇప్పటి వరకు బ్రేక్ లేకుండా వున్నవారు మాకు డోకా లేదు ఎందుకంటే మేము అలా చూసుకున్నా ఉంటాము ఇక ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని భావిస్తూ అందరితో కలసి ఎందుకు పోరాటం చేయడం రెగ్యులర్ ఆనుతు ప్రభుత్వము చేస్తే మేము అవుతాము అని అందరూ కలవాలి అనే దానికి దూరంగా వుంటున్నారు.
0 Comments:
Post a Comment