నిన్న జరిగిన కాంట్రాక్ట్ ఉద్యోగి మరణం ఒక హత్య
దీనిని చేసింది సాక్షాత్తు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లోని ఎన్టీఆర్ వైద్య సేవ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు మాత్రమే
2002 సంవత్సరంలో విజయవాడ మలేరియా విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగి ప్రస్థానం ప్రారంభించిన లంకపల్లి సంజయ్ అధికారులందరికీ అణకువగా ఉంటూ తోటి ఉద్యోగులతో సంయమనం పాటిస్తూ ఉండే ఒక ఉద్యోగి, సాటి ఉద్యోగిగా తన ఆర్థిక పరిస్థితి చెప్పాలంటే తను ఒకరి దగ్గర చేయి చాపకుడా ఘనంగా బ్రతికిన వ్యక్తి రెగ్యులర్ ఉద్యోగులు అందరికీ ఎంప్లాయ్ హెల్త్ కార్డులు ఉన్నాయి మాకు కూడా ఇవ్వండి అని 2018 సంవత్సరంలో మన కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ తరఫున అప్పటి ప్రభుత్వాన్ని అడిగినప్పుడు దానిని 2019 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఆమోదిస్తూ కేబినెట్లో నిర్ణయం చేయడం జరిగింది, అయితే దానిని అప్పటి నుండి GO ఇవ్వకుండా కాంట్రాక్టు ఉద్యోగులకు వారు ఎంతమంది వున్నారో లక్క తేలకుండా GO వీలుపడదు అని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు యు.ఎన్ టీఆర్ఎస్ వైద్య సేవ ట్రస్ట్ డైరెక్టర్ కాంట్రాక్టు ఉద్యోగుల గురించి లెక్కల కావాలి అని తాత్సారం చేయడం వలన అది అప్పుడు GO కి నోచుకోలేక పోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఎప్పుడూ ప్రభుత్వ శాఖలలో DA పెరిగినా ఎంతంనది వున్నారు అని లెక్కలు చూడని అధికారులు వారి ఆఫీసు లో పెట్టి DA వాడేసుకుంటారు, అయితే కాంట్రాక్టు వారి విషయంలో మాత్రం లెక్క కావాలి అని చెప్పడం జరిగింది ఎంతమంది ఎన్రోల్ చేసుకుంటే అంతమంది ఉన్నట్లే కదా అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా దానిని అటకెక్కించారు, అయితే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని GO రూపంలో ఇవ్వడం జరిగింది కానీ GO వచ్చినా ఇంతవరకు దానిపైన ఎటువంటి విధి విధానాలు ప్రకటించకుండా దానికి బడ్జెట్ కేటాయింపు చేపట్టకుండా అది మాకు పట్టని విషయం అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు అయితే కాంట్రాక్టు ఉద్యోగిది ప్రభుత్వ హత్యే అని ఎందుకు అన్నానంటే నిన్న మరణించిన హెల్త్ అసిస్టెంట్ కేవలం ఒక సంవత్సరం క్రితం జబ్బు పడి ఈ సంవత్సర కాలంలో లక్షల రూపాయలు హాస్పిటల్కు ధారపోసి ఆర్థికంగా చితికిపోయి చివరికి మరణించడం జరిగింది. ఆర్ధికంగా సరిగాలేని/లేక మరణించిన ఏ కాంట్రాక్టు ఉద్యోగి మరణం అయినా అధికారులే భాద్యులు ఎందుకంటే కాంట్రాక్టు ఉద్యోగుకి ఎటువంటి భద్రతా లేదు అలాగని రెగ్యులర్ చేయమంటే దానికి 17 సంవత్సరాల నుండి ఎటువంటి సమాధానం లేదు మిత్రులారా మనం చేసే ఉద్యోగం ఎంత అభద్రతాభావంతో మీ అందరికీ తెలియాలి అదే విధముగా మీ పిల్లల భవిషత్తు చక్క దిదే వరకు అయినా మీరు ప్రాణాలతో వుండాలి ధైర్యంగా వుండండి రెగ్యులర్పో ఉద్యోగం కొరకు పోరాటం చేయడానికి నడుంబిగించండి
Bagacheparu sir poradadam cm garu regularchestharu
ReplyDelete