Contracted Beacons

మనదీ ఒక బ్రతుకేనా కుక్కలవలే నక్కల వలే  మనదీ ఒక బ్రతుకేనా సందులలో పందులవలే ................?



ఒక హల్త్ అసిస్టెంట్గా పై శ్రీ శ్రీ గారి కవితతో నీవు ఏకీబవిస్తున్నావా అయితే పెద్ద సుత్తి తీసుకొని నీ తలకు వేసి కొట్టుకోకాదు అయితే నీ తల తీసుకువెల్లి పెద్ద సుత్తికి కొట్టుకోండి,
ఇదేంటి రెండూ ఒకటే కదా అని అనిపిస్తుందా,ప్రస్తుతం మన పరిస్థితి అంతే. ఎలాగంటే సుప్రింకోర్టు తీర్పు వచ్చేవరకు ఎలాగైతే పది సంవత్సరాల సర్వీసు మాకు వుంది ప్రభుత్వం మాకు అనుకూలంగా వుంది మా ఉద్యోగాలకు ఎటువంటి డోకాలేదు అని భావించి, ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వున్నారోప్రస్థుతం 273 జి.. ప్రకారం మరలా క్రొత్తగా నియమితులైన వారి పరిస్థితి కూడా త్వరలో అదే కావచ్చు. పైన శ్రీ శ్రీ గారిని ఎందుకు ప్రస్థావించామంటే మన పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా వుంది, 40 సంవత్సరాలు వయస్సు దాటినా కాంట్రాక్టు భూతం మనలను వీడదు నాలుగు పదులు దాటినా ఈ వయస్సు లో ఉద్యోగికి ఎమన్నా అయితే కుటుంభం పరిస్థితి ఏమిటి ఆలోచించే ధైర్యం కూడా చేయలేము, ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వమునుండి ఎటువంటి సహాయము ఉండదు, రవాణా భత్యం వుండదు, ఏరియర్స్ వంటి వాటీకి అసలే నోచుకోము ఎంత చేసినా "నువ్వు కాంట్రాక్టులో చేస్తున్నావ్" అనే పై అధికారుల మాటాలు గుండెలొ సూదిలా గుచ్చుకుంటున్న సిగ్గు ఎగ్గు వదిలేసి నా కేంటి నవ్వి పోదురుగాక....  అని మనసంతా చిమ్మ చీకటిగా వున్నా తెల్ల చొక్కాలు వేసుకొని తిరిగేస్తున్న మనకు పై వాక్యాలు వర్తించ వంటారా .......? 

           
ఆహా ఓహో ఇంకేముంది కేబినెట్ సబ్ కమిటీ వేసేసాం మీ సమస్యలన్ని తీర్చేస్తాం మిమ్ములను రెగ్యులర్ చేసేస్తాం అన్న ప్రభుత్వ పెద్దలు సంగతి మర్చి పోయారు, సబ్ కమిటీకి అన్ని చెప్పేసాం వాళ్ళకు అంతా అర్ధం అయింది మేము చెప్పినట్లే కాంట్రాక్టు ఉద్యోగస్తులందరిని పర్మినెంట్ చేయిచేస్తాం అన్న లీడర్లు నోరు మెదపడం లేదుకాని, ప్రభుత్వంలో మెడికల్ అండ్ హెల్త్ లోని కాంట్రాక్ట్ సిబ్బందికి సంబందించిన నిర్ణయాలు మాత్రం జరిగి పోవుచున్నాయి, అవ్వన్ని మీకు వేరుగు రుచి చూపించవలసిన అవసరం లేదు. కాని జరిగేదంతా మనకు అన్యాయం  జరిగేవిధంగా వుంటుంది అన్న విషయం మరువ వద్దు

About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.