Capital City Amaravati

JOIN US AS A MEMBER

మిత్రులకు ఉద్యమాభివందనాలు.

APPMCEA గా మేము మన కాంట్రాక్టు వారి అవసరాలకొరకు అహర్నిశలు శ్రమిస్తున్నాము, మేము ఎంతో కొంత మన కోసం పాటుపడుతున్నాము అనడానికి మన జీతాలు పెరగడము, మనకు CFMS లో ID నెంబర్లు రావడము, పారామెడికల్ బోర్డు నందు ఎప్పుడో ఆగిపోయిన మన సర్టిఫికేట్ ల రిజిస్ట్రేషన్ మరలా జరగడం, మనలో చనిపోయిన వారికి మట్టిఖర్చులకు 119GO రావడము, కరెక్టు టైంనకు మన కంటిన్యూషన్ రావడము నిదర్శనం, ఈ మా పనిలో మాకు నిత్యం వెన్నంటి ఉన్నది APJAC అమరావతి సంఘము, దాని చైర్మన్ బొప్పరాజు గారు మరియు టీం. GO27 సవరణ విషయంలో కూడా ప్రతినిత్యం పోరాటం చేస్తూ ఉన్నాము, త్వరలోనే 27GO సవరణ చెపిస్తాము, ఈ క్రమములో మనము APJAC అమరావతికి ప్రత్యక్షం గా సభ్యులమై ఉన్నాము. మనం మన సంఘం బలోపేతం కొరకు జిల్లా స్థాయు కేడర్లను నియమించు కోవడానికి, సంఘములో ఆఫీస్ బేరర్ గా ఉండటానికి మన www. appmcea.com వెబ్ సైట్ నందు JOIN AS A MEMBER నందు SUBMIT YOUR DETAILS లో మీ పేరు నమోదుచేసుకోవలని మనవి.
 మనము APJAC అమరావతి తో సభ్యసంఘమై ఉన్నందువలన ప్రస్తుతము APJAC అమరావతి మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తుంది కావున వాటిలో మీరు మన సంఘము తరుపున ప్రతినిదులుగా మీరు ఉండటానికి ఇది చాలా అవసరం అందరూ దీనిని వినియోగించుకోవాలని మనవి.

ప్రెసిడెంట్.
APPMCEA,246
AMARAVATI.

About APGCEA

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.