AP MH RECE JAC
AP Medical & Health Regularization Eligible Contract Employees JAC
👉🏻అర్హత కలిగిన కాంట్రాక్టు వారిని రెగ్యులర్ చేయాలి.
👉🏻న్యాయపరమైన సమస్యలు ఏమిటో చెప్పాలి.
👉🏻ఉమాదేవి vs కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు పాటించాలి.
పత్రికా ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లోని మెడికల్ అండ్ హెల్త్ రంగంలోని రెగ్యులర్ కొరకు అన్ని అర్హతలు కలిగి ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ ఒకే సంఘం గా ఉండాలని రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 22వ (22-11-2020) తేదీ ఆదివారం నాడు విజయవాడ కేంద్రంగా *" ప్రెస్ క్లబ్ " నందు ఉదయం 10 గంటలకు రెగ్యులర్ కు అర్హత కలిగిన వివిధ సంఘాల నాయకులు మరియు వివిధ కేడర్ల సంఘాల రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులు అందరూ సమావేశంకు హాజరై చర్చించడం జరిగింది, అందరూ ఒక్కటై మన యొక్క న్యాయపరమైన డిమాండ్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళాలనే సదుద్దేశంతో అన్ని సంఘాల ఐక్యతతో ముందుకు వెళ్లాలని సభ్యుల సమక్షములో ఈ రోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నందు పనిచేయుచున్న ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధికరణ చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ పత్రికా ఈ ప్రకటన విడుదల చేస్తున్నాము.
శ్రీ. Y. S. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాలలో వెలుగులు నిండుతాయి అని ఎదురు చూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కాలం గడుస్తున్న కొద్ది ఆ ఆశ నిరాశే అవుతుంది అందుకు కారణం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి నియమించిన కమిటి యొక్క గడువు జూన్ 30 తో ముగియటం అందుకొరకు నియమించిని కమిటీలు ఎటువంటు చర్యలు చేపట్టకుండా వుండటం ఇటివల ముఖ్యమంత్రి వర్యులు న్యాయపరమై సమస్యలు అని కొత్త సీసాలో పాత సారా సామెత లాగా మాట్లాడటం ఇందుకు కారణం. ఇటువంటి పరిస్థితులలో మా బాధను ప్రభుత్వానికి అర్థం అయ్యే రీతిలో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని రేగ్యులరైజేషన్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి కావలసిన చర్యలు అన్ని యూనియన్ల సమిష్టి కృషితో చేపట్టాలని నిర్ణయించి, కార్యాచరన లో బాగంగా ఈ JAC ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పటికే రాష్ట్రములో పనిచేయుచున్న కాంట్రాక్టు ఉద్యోగస్తులను క్రమబధ్దీకరణ చేయుటకు కేబినేట్ - కమిటీ మరియు వర్కింగ్ - కమిటిని నియమించిన ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగనమోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా ముఖముగా విడుదల చేసిన ప్రకటనతో అందరి ఆసలు నీరుగారినట్లయినది.
1999 సంవత్సరంలో ప్రభుత్వం కాంట్రాక్టు విధానము ద్వారా ఉద్యోగములు చేపట్టడం ప్రారంభించి వైద్య ఆరోగ్యశాఖ, విద్య, లేబర్ మరియు పంచాయితి రాజ్ ఇతర శాఖలలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించింది. ఆంధ్రప్రదేశ్రాష్ట్రమందు సుమారు “24 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉద్యోగులు పనిచేస్తున్నారు”.
అందులో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కు సంభందించి గ్రామాలలో కర్తార్ సింగ్ కమిటీ (1973) మరియు శ్రీవత్సవ కమిటీ(1975) వారి సిఫార్సుల మేరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రాధమిక ఉపకేంద్రాలలో ప్రజారోగ్యం, పరిసరాల పరిశుభ్రత, వ్యాధుల వ్యాప్తి, వివిధ రకాల కీటక జనిత వ్యాధుల నివారణ, స్కూలు పిల్లల ఆరోగ్యం, పుట్టుక మరియు మరణముల రిజిస్ట్రేషన్ వంటి ముఖ్యమైన కార్యక్రమాల నందు పని చేయుటకు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA-Male) ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ మరియు ఇతర కేడర్ల వారిని గ్రామీణ మరియు పట్టణ ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉండే లాగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయుటకు రూపుదిద్దినారు. పై ఉద్యోగాలు అన్ని కూడా రెగ్యులర్ సాంక్షణ్డ్ ఉద్యోగాలు అయితే వాటిలో ప్రస్తుతం కాంట్రాక్టు పద్దతిన మాత్రమె నియామకాలు చేపడుతూ ప్రభుత్వాలు పారామెడికల్ సిబ్బందికి అన్యాయం చేస్తున్నారు.
పారామెడికల్ కోర్సులలో ఎక్కువ శాతం దిగువ మధ్య తరగతి కుటుంబాల వారు మరియు బడుగు బలహీన వర్గాల వారు అత్యధికంగా చేరుతుంటారు అందుకు కారణం తక్కువ ఖర్చుతో విద్య లభించడం చిన్నది అయినా చదువు పూర్తీ అయిన వెంటనే ఉద్యోగం సంపాదించడం ప్రధాన కారణం. అయితే వీటిని ఎక్కువ శాతం అనేకన్నా పూర్తిగా కాంట్రాక్టు పద్దతిన మాత్రమె నింపుతున్నారు కోవిడ్ సందర్భంగా చేపట్టిన నియామకాలే ఇందుకు నిదర్శనం ఇది బలహినుడుని ఇంకా బలహీనుడిని చేయడమే ఇది చాలా అన్యాయం.
దేశంలో అన్ని రాష్ట్రాలి ఉమాదేవి Vs కర్నాటక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్సకాల ఆదారంగా కాంట్రాక్టు వారిని రెగ్యులర్ చేస్తున్నాయి, అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని DoPT డిపార్ట్మెంట్ వారు ఒక లేకను కుడా ఇటివల అన్ని రాష్ట్రాలకు ఇచ్చి రెగ్యులర్ చేయమని తెలిపారు.
కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులు జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షలుగా గల డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్, రూల్ఆఫ్రిజర్వేషన్ (ROR) పాటిస్తూ అనగా రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధంగా నియమ నిబంధనలు పాటిస్తారో అదే నియమ నిబంధనలు అనుసరించి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమింపబడి సదరు ఉద్యోగానికి 100% అనుమతించిన జీతభాత్యలతో ప్రభుత్వ సాంక్షణ్డ్ పోస్టు లో పని చేయుచున్నారు. సాంక్షణ్ పోస్టులలో కాంట్రాక్టు పద్దతిన ఉద్యోగస్తులను నియమించడం బానిసత్వమే అవుతుంది, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ విధానంలో మాత్రం మార్పు రావడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరిoచమని గత ప్రభుత్వములను అనేక దఫాలుగా అభ్యర్దిoచినను కాంట్రాక్టు వారిని రెగ్యులర్ చేయుటకు కావలసిన చట్టమును గాని పద్దతులను గాని గత ప్రభుత్వాలు రూపకల్పన చేయలేదు, కాంట్రాక్టు ఉద్యోగములో దాదాపు 19 సంవత్సరముల నుండి పనిచేస్తున్న వారికి ఇప్పుడు 50 సంవత్సరాల వయస్సు దాటింది. ఎక్కువ శాతం మంది రాబోయే 5 సంవత్సరాలలో రిటైర్డ్ కాబోతున్నారు, కాంట్రాక్టు వారిని రెగ్యులర్ కు విధివిధానాలు లేవు అని చెప్పే అధికారులకు రెగ్యులర్ ఉద్యోగులు 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ పొందుతుండగా కాంట్రాక్టు వారికి మాత్రం 58 సంవత్సరాలకు రిటైర్డ్ చేసే విధానం ఎక్కడ లభించిందో అర్ధం కాని పరిస్థితి.
ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చిన విధముగా వైద్యఖర్చుల నిమిత్తము హెల్త్ కార్డులు మంజూరు చేయవలెనని కాంట్రాక్టు ఉద్యోగుల తరపున చేసిన అభ్యర్ధన గత ప్రభుత్వములో కాబినెట్ ఆమోదము పొంది కూడా ఇంతవరకు కాంట్రాక్టు వారికి హెల్త్ కార్డులు మంజూరు చేయడానికి ఉత్తర్వులు వెలువడలేదు. గత ప్రభుత్వాలు ఆమోదం ఇచ్చిన వాటికి మేము ఎందుకు మంజూరు చేయాలి అనుకున్నా మరి ఎందుకు ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలేదు అనేది ఎంతకి వీడని ప్రశ్న.
అయితే, గౌరవ. శ్రీ. Y. S. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను ఎంతమందిని వీలైతే అంతమందిని క్రమబధ్దీకరణ చేస్తాము అని ప్రకటించడమే కాకుండా కాంట్రాక్టు వారిని క్రమబధ్దీకరణ చేయుట కొరకు క్యాబినెట్ సబ్- కమిటీని వెనువెంటనే పై సూచిక ద్వారా నియమించినప్పుడు మేము చాలా ఆనందించాము. మరియు కాంట్రాక్టు ఉద్యోగుల రేగ్యులైజేషణ్ కొరకు IAS అధికారులతో కూడిన వర్కింగ్ కమిటిని నియమించి రాష్ట్రములో పని చేయుచున్న కాంట్రాక్టు సిబ్బంది అందరి లెక్కలు సరిచూసి మమ్ములను రెగ్యులర్ పధంలోకి నడిపిస్తారు అనుకున్న తరుణంలో న్యాయపరమైన సమస్యలు అని చెప్పడం దారుణమైన విషయం, అటువంటి న్యాపరమైన సమస్యలు ఏదైనా వుంటే వెంటనే పరిష్కరించి మేనిపోస్తో లో చెప్పిన విధంగా కాంట్రాక్టు వారిని రెగ్యులర్ చేయాలని శ్రీ. Y. S. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారములతో తెలియ చేసుకోనుచున్నాము...
ఈ కార్యక్రమములో ఏర్పడిన jac తమ తదుపరి ప్రణాలికను విడుదల చేసినది, వచ్చే 24 తారిఇకున మరలా సమావేశం ఏర్పాటుచేసి JAC ఇంకా మిగిలి వున్న కాంట్రాక్టు సంఘాలను చేర్చుటకు ప్రయత్నం చేయాలని, అలాగే వచ్చే ఆదివారం అనగా 29.11.2020 న మరలా సామ్వేసం ఉంటుందని ఈ లోపు ఏర్పడిన జిల్లాల JAC లను కలుపుకుంటూ ఆ సమావేశములో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైజెషన్ కొరకు పూర్తీ కార్యాచరణ సిద్ధంచేసి రెగ్యులర్ అయ్యేంతవరకు పోరాటం చేసే విధముగా ప్రయత్నం చేయాలని నిర్ణయించడం జరిగినది.
0 Comments:
Post a Comment