అమరావతి...19.10.2020...
ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సచివాలయం నుండి వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్...
కరోనా నివారణ, వైస్సార్ ఆరోగ్య శ్రీ, వైస్సార్ కంటి వెలుగు, వైస్సార్ వార్డ్, గ్రామ హెల్త్ క్లినిక్స్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు పరిధిలో వైద్య సేవలు, మెడికల్ కాలేజ్లు నిర్ణయం అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ లో చర్చ...
పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అశోక్ కుమార్ సింఘా ల్, కమీషనర్ కాటంనేని భాస్కర్, డైరెక్టర్ అఫ్ మెడికల్ అండ్ హెల్త్ డాక్టర్ అరుణ కుమారి, ఆరోగ్య శ్రీ సీఈఓ డాక్టర్ మల్లికార్జున, పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు...
రాష్ట్రములో కరోనా నివారణలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర శాఖలు అధికారులు ఎంతో సమర్ధవంతంగా పని చేశారు...
కరోనా నివారణలో భాగస్వామ్యం అయినఅన్ని శాఖలు అధికారులు, డాక్టర్స్, మెడికల్ సిబ్బంది, పోలీస్, శానిటేషన్, రెవిన్యూ, మీడియా, అందరిని మనసు పూర్తిగా అభినందిస్తున్నాను....
రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి కరోనా నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు..
అన్ని రాష్ట్రాలు కంటే మన రాష్ట్రములో ఎక్కువగా కరోనా టెస్ట్లు చేసాం...
అన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ అందుబాటులో ఉంచాం...
కరోనా రోగులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలిచింది...
కరోనా రెండవ దశలో కూడ పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉంది....
ప్రతి ఒక్కరూ మాస్కులు, భౌతిక దూరం పాటించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...
వైస్సార్ కంటి వెలుగు కూడ దశలు వారిగా సమర్ధవంతంగా అమలు చేయాలి...
రాష్ట్రములో భారీ వర్షాలు పడుతున్న దృష్ట్యా అంటు వ్యాధులు ప్రభలకుండ అన్ని ముందోస్తు జాగ్రత్తలు తీసుకోవాలి...
శానిటేషన్ విషయంలో జాగ్రత్తలు పాటించండి..
మందులు అందుబాటులో ఉంచి, అవసరం ఉన్న ప్రాంతంలో మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయాలి...
*********************
మాణిక్యరావు. కె
పి. ఆర్. ఓ...టు...ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి....
0 Comments:
Post a Comment