Capital City Amaravati

CONTRACT EMPLOYEES DEMANDS

అందరికి నమస్కారం, 
            దాదాపు రెండు శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర (1864) కలిగిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నందు కాంట్రాక్టు వ్యవస్థను పరిచయం (2002) చేసి గత ప్రభుత్వాలు పనిచేసే ఉద్యోగులకే కాకుండా సంస్థకు కూడా అన్యాయం చేసింది అనుకున్న మాట వాస్తవమే, అప్పటి నుండి వచ్చిన తరువాత ప్రభుత్వాలు అలాగే ప్రస్తుత ప్రభుత్వం అదే పందాను కొనసాగిస్తూ కేవలం ఉద్యోగుల జీతాలు మిగుల్చుకొని ప్రజలకు సేవ చేస్తాము అనే విధంగా వ్యవహరించడం చాలా దారుణమైన పరిస్థితి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం కాదుకదా కనీసం రెగ్యులర్ కి సంభందించిన విధివిధానాలను కుడా రూపొందించలేదు అంటే ఇది వెసులు బాటు అకపోవడం అనాలా కుట్ర అనాలా ఆలోచించండి. 
            ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాపీలు విదివిదానాలు అనుసరించి ప్రభుత్వం అప్పటికే మంజూరు చేసిన సాంక్షన్డ పోస్టులో ఉద్యోగంలో చేరిన కాంట్రాక్టు ఉద్యోగికి ఇచ్చే రాయతిల విషయంలో మీకు ఇలా చేయమని ఏ ప్రభుత్వ ఉత్తర్వు లేదు అని చెప్పే అధికారులు కాంట్రాక్టు వారికి కోతలు విధించడం వచ్చే సరికి అన్ని ఆర్డర్లు మీవే అని చెప్పి మీకు సబార్డినెట్ రూల్సు అన్ని వర్తిస్తాయి అని చెబుతూ వుంటారు ఇది ఎంతవరకు సమంజసం. అందుకు పెద్ద ఉదాహరణ సెలవులు, సెలవు అడిగితె మీకు అన్ని సెలవులు లేవు అంటారు రెండవ శనివారం ఉద్యోగానికి రావాల్సిందే అంటారు. వారి వద్ద డానికి కాగితం వుండదు దీనికి కాగితం వుండదు.  
        ఎన్నో కోర్టు కేసులు కాంట్రాక్టు వారిని పర్మేనేంట్ చేయాలని తీర్పులు చెబుతున్నాయి వాటిని పట్టించుకే నాదుడు లేడు రెగ్యులర్ ఉద్యోగికి ఏదైనా రాయితీ ఇస్తే పత్రికలలో చూసే బిల్లులు పెట్టుకునే అధికారులు కాంట్రాక్టు వారి జీతాల  విషయంలో "త్రో ప్రాపర్ చానల్" అని పెట్టి ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వాలి అది శాఖాదిపతులకు రావాలి శాఖదిపతులు జిల్లాలకు పంపాలి జిల్లాఅధికారి DDOకి పంపాలి అప్పుడు గాని బిల్లులు పెట్టరు ఇదేం విడ్డురం, ఇలాంటి పరిస్థితి మారాలి. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ నేరుగా DDO అమలు చేయాలి. ఉద్యోగులకు చెల్లించే జీతాలు ఇతర ఎలవేన్సులు STO, DTO తో సంభందం లేకుండా ప్రభుత్వం చేతిలో పెట్టుకున్నప్పుడు ఇది కుడా సాధ్యమే అవుతుంది.    
        ఇలా చెప్పుకుంటూ పొతే కాంట్రాక్టు ఉద్యోగి బాధ అరణ్య రోదనే తప్ప దారి కోసం ప్రయత్నం మాత్రం లేదు, అయినా ఆశా జీవులం కనుక రెగ్యులర్ ప్రక్రియ జరిగే లోపు ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాము.  (క్రింద పేర్కొన్నవి అన్ని కలపి రేప్రజేంట్ చేయడం కుదరదు అందు వలన విడివిడిగా విజ్ఞప్తి చేసి యున్నాము)                    
  • కరోనా (Covid-19)   కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తూ కరోనా భారిన పడిన వారికి ప్రత్యెక  వార్డులు ఏర్పాటు చేయాలి.  
  • ప్రభుత్వ ఉద్యోగులకు పెరుగుతున్న అవసరాలకు అనుగునంగా ప్రస్తుత ప్రభుత్వము రాగానే 27% IR (ఇన్టర్మ్ రిలీఫ్) ప్రకటించింది అయితే దానినే కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింప చేయాలి. 
  • కాంట్రాక్టు ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
  • ప్రభుత్వం కాంట్రాక్టు వారికి ఇచ్చే కంటిన్యుషణ్ సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి, లేదా ఉద్యోగి బాoడ్ పేపర్ సంవత్సరానికి ఒకసారి సమర్పించే  విధముగా ఉత్తర్వులు ఇవ్వాలి. 
  • కాంట్రాక్టు ఉద్యోగి మరణిస్తే చెల్లించే 2 లక్శల ఎక్సగ్రేషియాను 10 లక్షలకు పెంచాలి.
  • కాంట్రాక్టు ఉద్యోగులకు అందరికి కేడర్ వారిగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 
  • ఫీల్డు డ్యుటి  చేసే సిబ్బందికి ట్రావలింగ్  ఎలవేన్స్ మంజూరు చేయాలి.   
  • మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కాలిగా వున్నా పురుష ఆరోగ్య కార్యకర్తల పోస్టులను నింపాలి.
  • B.Sc నర్సింగ్ / నర్సింగ్ / ఫార్మ / ల్యాబ్ టేక్నిషియాన్ ల మాదిరి హెల్త్ వర్కర్ పోస్టులలో కూడా జెండర్ డిఫరెన్స్ తీసివేయాలి. 
  • కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ట్రాన్స్ఫర్స్ మంజూరు చేయాలి.   
  • PRC కమిటి తమ నివేదిక ప్రకటించినది కావున రెగ్యులర్ ఉద్యోగులకు PRC వర్తింపచేసే రోజు నుండే కాంట్రాక్టు ఉద్యోగులకు PRC వర్తింప చేయాలి.  


About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.