News

జస్టిఫికేషన్ గురించి..

ఉద్యోగ మిత్రులకు అభినందనలు... 

మన కాంట్రాక్టు ఉద్యోగుల  కంటిన్యూషన్ కు సంబంధించి వివిధ శాఖాధిపతుల నుండి సమాచారం ఇంకా అందకపోవటం, ప్రత్యేకంగా మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శాఖలో జిల్లాల నుంచి సమాచారం అడగడం వంటి పరిణామాల దృష్ట్యా కంటిన్యూషన్ ఇంకా లేట్ అవుతుంది అనే తలంపుతో ఈరోజు సెక్రటేరియట్ ను సందర్శించి ఏపీ జెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి సహాయంతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ గారిని జస్టిఫికేషన్ కి సంబంధం లేకుండా కంటిన్యూషన్ ఇవ్వవలసిందిగా కోరి యున్నాము.  ఇదే విషయమై గత వారంలో అజయ్ కల్లం గారిని కలిసినప్పుడు వారు ఇచ్చిన సూచన మేరకు ఫైనాన్స్ సెక్షన్ నుండి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కంటిన్యూషన్ కోసం ఫైలు  పెట్టడం జరిగింది,  కానీ దానిని వారు ఇంతవరకు ఆమోదించటం గాని తిరస్కరించటం గానీ చేయకుండా తన వద్ద ఉంచుకొని ఉన్నారు అందువలన ఈ రోజు ఫైనాన్స్ సెక్రెటరీ వారిని కలిసి మీరు ఏదైనా చేస్తే తిరస్కరించటం ఆమోదించడం చేస్తే మేము తదుపరి చర్యలు చేయడానికి అవకాశం ఉంటుంది కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ కూడా పర్మినెంట్ ఉద్యోగుల లాగానే ఉద్యోగంలోకి  వచ్చిన వారికి జీతాలు రాకుండా ఆపడం  చాలా భదాకరమైన విషయం,  దీని మీద ఎంత వరకైనా పోరాటం చేస్తాం అని తెలియజేస్తూ రెగ్యులర్ అవుతామని ఎదురు చూస్తున్న వారికి జీతాలు కూడా చెల్లించకుండా చేయడం సరికాదని వెంటనే కంటిన్యూషన్ విడుదల చేయాలని కోరటం జరిగింది అలాగే రెగ్యులర్ కు  సంబంధించిన ప్రతి సమాచారాన్ని నేరుగా శాఖాధిపతుల నుండి తెప్పించుకోవాలి కానీ ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతభత్యాలకు ముడిపెట్టడం సరికాదని తెలియజేస్తూ ఏపీ జెఏసి అమరావతి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే విషయంలో కాంట్రాక్టు ఉద్యోగుల కు అండగా ఉంటుందని అలాగే  అన్ని విధాల ప్రభుత్వానికి కూడా సహాయ సహకారాలు అందిస్తుందని, వారి ఆశలను నిరుగార్చే విధంగా జరిగే ఎటువంటి చర్యను అయినా ఎదుర్కొంటామని  తెలిపడం జరిగింది. 
రేపు దీనిమీద మనకు స్పష్టత రావడం జరిగుతుంది. అలాగే DH నుండి అసంపూర్తిగా వచ్చిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు అడిగిన జస్టిఫికేషన్ విషయం కూడా మన DH అధికారులతో మాట్లాడటం జరిగింది. రేపు DH మేడంని కలసి అందుకు కావాల్సిన మెమో రావడానికి కృషి చేస్తాము అయితే  జిల్లాల నుండి సమాచారం మాత్రం ఖచ్చితంగా రావాలి మీరు అందుకు DMHO లో మనకు కావలసిన సంమాచారం కోసం ప్రయత్నించండి. 

జాన్ హెన్రీ. 9059279777.

About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.