- ముఖ్యమంత్రి గారి మాట నెరవేరకుండానే మృత్యువాత పడుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు!
- సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యుల హామీ నెరవేరటం లేదు అని ఆందోళన!
- ఉద్యమ పదం దిశగా నడవాలని కాంట్రాక్టు ఉద్యోగుల కసరత్తు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 19 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతి పైన పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది రెగ్యులర్ కాకుండానే రోజుకొకరు చనిపోతుండటం... ప్రతిపక్ష నేతగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కాంట్రాక్టు వారిని రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన హామీ నేడు వారు ముఖ్యమంత్రి అయినా నెరవేరక పోవడం... రెగ్యులర్ వ్యవహారం పై ప్రభుత్వపరంగా ఎలాంటి స్పష్టత లేకపోవడం... కాంట్రాక్టు వారిని రెగ్యులర్ చేయడానికి నియమించిన వర్కింగ్ కమిటీ తమ గడువు ముగిసి 60 రోజులు గడచినా నేటికి వారి అభిప్రాయాలని ప్రభుత్వానికి తెలపక పోవడం... అయినాకూడా ప్రభుత్వం నుండి ఎటువంటి చర్యలు లేకపోవడం ... వెరసి మొత్తంగా కాంట్రాక్టు ఉద్యోగులను ఆందోళన బాట పట్టేలా చేస్తున్నాయి.
ఎన్నో ఏళ్ళుగా రెగ్యులర్ కోసం ఎదురు చూస్తూ, అన్ని అర్హతలున్నా కాంట్రాక్టు ఉద్యోగులు నేటికీ రెగ్యులర్ కాలేక పోవడం, మాట తప్పని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మాట అమలుకు నోచుకోకపోతుండటంతో దిక్కులేని స్థితిలో కాంట్రాక్టు ఉద్యోగులుగా చనిపోవడమో రిటైర్మెంట్ అవ్వదమో తప్ప రెగ్యులర్ కాలేకపోవడం వలన రాష్ట్ర వ్యాప్తంగా మన ఆవేదనను తెలియజేసేందుకు సన్నధం అవ్వవలసిందే. జూన్ నెలాఖరుతో కాంట్రాక్టు వారి రెగ్యులర్ కు సంభందించిన "వర్కింగ్ కమిటీ" గడువు ముగిసిపోయింది, మరో కొన్ని రోజులలో రాజధాని మార్పు వంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఇప్పటికైనా మనం గళం విప్పకపోతే మనకిక న్యాయం జరగదు. మన బాధ ఆవేదన అంతం అవ్వాలి అంటే మనం ఆందోళన బాట పట్టాల్సిందే.
ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కోవిడ్-19 కట్టడి కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ విధులను అంకితభావంతో చేస్తూ ఎందరో కాంట్రాక్టు ఉద్యోగులు కరోనాకు బలైపోయారు, అలాగే అనారోగ్యాలపాలైన నిండు జీవితాలు బలై పోతున్నా ప్రభుత్వం లో ఎలాంటి చలనం లేకపోవడం చూస్తుంటే... ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మనం పడుతున్న నిరంతర శ్రమ గురించి కానీ, పడుతున్నా అవస్థలు గురించి కానీ ప్రభుత్వం దృష్టికి అసలు వెళ్లడం లేదేమో అనే సందేహం వస్తోంది, ఇది మన అందరి ఆవేదన దీనిని మనమే తుడిచి వేయాలి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పైన, ఆయన ఇచ్చిన మాట పైన ఎంతో నమ్మకంతో కాంట్రాక్టు ఉద్యోగులం అందరం ఎదురుచూస్తున్నాము, ఆ మాట నెరవేరకుండానే రోజుకి ఒకరు మృతువాత పడుతున్నారని ఇది సాటి కాంట్రాక్టు ఉద్యోగులకు తీవ్ర ఆవేదన చెందేలా చేసే అంశం. పని ఒత్తిడి వలన అర్ధంతరంగా కాంట్రాక్టు ఉద్యోగులు చనిపోతున్నారు మహాప్రభో! అని మన తీరని ఆవేదనను, బాధను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళదామంటే ఏ కోవిడ్ కోసం కష్టపడుతున్నామో అదే కోవిడ్ అడ్డంకిగా మారిపోయింది. చెప్పుకుందామంటే దారి లేదు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మీదైతే విశ్వాసం ఉన్నా, అయినవారంతా కళ్లెదుటే కన్నుమూస్తూ వారిపై ఆధారపడిన కుటుంబాలు అనాథలై రోడ్డున పడుతుండటాన్ని చూస్తూ ఉరుకుకోలేని నిస్సహాయ, గత్యంతరం లేని స్థితిలో మనం రోడ్డెక్కితేగాని న్యాయం జరగదు.
రాష్ట్రములో పనిచేసే విదులు ఇటీవల కోవిడ్ తో మృతి చెందినా పట్టించుకోరా? నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన చేపడతాం...! అంటూ ప్రభుత్వ వైద్యుల జె.ఏ.సి తమ డిమాండ్ల తో నల్ల బ్యాడ్జీల ఉద్యమం ఆరంభిస్తే, అందులో కాంట్రాక్టు ఉద్యోగులు పెద్దా ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తే తక్షణమే ప్రభుత్వం స్పందించి కోవిడ్ విధుల్లో ఉద్యోగులు మరణిస్తే ముప్పై రోజుల్లోనే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా తక్షణ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమేనని, అయితే అదే సంధర్భంలో కోవిడ్ విధులను ఎంతో అంకితభావంతో చేస్తూ అదే కోవిడ్ విధుల్లో అనారోగ్యాల పాలై మరణిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల కూడా అదే విధానంలో స్పందించాలని కాంట్రాక్టు ఉద్యోగుల తరుపున డిమాండ్ చేస్తున్నాము. ప్రజారోగ్యమే పరమావధిగా కుటుంబ సభ్యులకు దూరంగా కోవిడ్ విధుల్లో ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా కష్టిస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించి, కోవిడ్ సేవలకు గుర్తింపుగానైనా అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పత్రికా ముఖంగా విన్నవించుకుంటూ.. మన తదుపరి ప్రణాళిక ప్రారంభిచ వలసిన ఆవశ్యకత ఏర్పడింది అందుకు గాను ప్రభుత్వం పై అంచెలంచెలుగా ఒత్తిడి తీసుకు రావడానికి గాను మనలోని కొందఱు పెద్దలతో కలసి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది.
మనం అందరం ఎంతగానో ఎదురు చుసిన రేగ్యులరైజేషణ్ అనేది మన చిరకాల వాంచ గత ప్రభుత్వాలను కూడా మనం అనేక రకాలుగా అడిగాము కాని విఫలం అయ్యాము, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు మనపై జాలి కలిగి వున్నవారు కాబట్టి మనకు అయన వచ్చిన 6 నెలలలోనే రెగ్యులర్ అవుతుంది అని భావించాము, అయితే నిబంధనలకు లోబడి ఒక కమిటిని నియమించి అందు వచ్చిన రిపోర్టు/అభిప్రాయాల ఆధారంగా రెగ్యులర్ చేయాలని భావించారు కావున జూన్ 30 వరకు గడువు ఇచ్చినా మనం సంతోషంగా నమ్మకంతో వున్నాము, అయితే ప్రస్తుతము గడువు దాటి పోవడము, రాజధాని తరలింపు వంటి అంశాలు తెరపైకి రావడం వలన మనం కొంత భయపడవలసిన పరిస్థితి వచ్చింది. మనకు మన ప్రభుత్వం పై ఎటువంటి కోపం లేదు కేవలం జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి మాత్రమే మనం ఉద్యమం చేస్తున్నాము అని తెలియ చేస్తూ అందరూ ఒకే మాట మీద వుండి మనం రెగ్యులర్ అయ్యేంత వరకు మనం ఉద్యమాన్ని ఆపకుండా ముందుకు సాగిపోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటూ జూన్ 30 తారీఖున గడువు పూర్తి అయ్యింది కావున మనం 60 రోజులు ఎదురు చూసాము, అయితే సెప్టెంబర్ - 1 వ తారీఖున CPS రద్దు అనే అంశంపై CPS క్రింద పనిచేసే ఉద్యోగులు కార్యక్రమం నిర్వహిస్తున్నారు కావున మనం మనం ప్రణాలికను సెప్టెంబర్ - 2 తారిఖు నుండి ప్రారంభించాలి అని తలంచుచున్నాము మొదట మన భాదను తెలియచేసే విధముగా తదుపరి మన ఆవేదన చూపించే విధముగా ప్రణాళిక వుంటుంది.
02-September 2020 :Submitting Representation to Y.S. Rajashekar Reddy Status (if Possible with black Masks)
02 to 07-September 2020 : Working with Black Badges and Play cards
03/04-September 2020 : Sending Emails and Writing Post Cards to Hon'Ble Chief Minister and Group of Ministers.
05-September 2020 : Gathering of contract staff at PHC for One hour pen down program at PHC and Press Coverage
ఇవ్వన్ని ఏమి వద్దు డైరెక్టర్ ఎటాక్ సీఎం క్యాంపు ఆఫీస్.... డేట్ అర్జెంటు గా ఫిక్స్ చేయండి..... అప్పుడే సీఎం దృష్టిలో పడుతుంది.... ఇప్పుడు అందరూ కష్టం గా పనిచేసున్నారు కావున ఈ డ్యూటీ కన్నా విజయవాడ ధర్నా బెటర్ అని భావించి చాలా మంది స్పందించి, వస్తారని నా అభిప్రాయం.....
ReplyDeleteYes డైరెక్టర్ గా సిఎం కార్యాలయం వెళ్లాలి
ReplyDeleteOk as you wish and what you decide.
ReplyDeleteYes direct attack is correct becausa andaru duties other places lo chestunnaru phc lo kudaradu pl dharna kiraku dt fix cheyandi
ReplyDeleteGood decision friends
ReplyDelete