మన అందరము covid-19 డ్యూటీలలో చాలా కష్టపడుతున్నాము. దానివలన చాలా మంది covid-19 పాజిటివ్ గా నిర్దారణ అయి చాలామంది చాలా బాధపడుతున్నారు. కావున హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినవారికి ప్రత్యేకముగా వైద్య సదుపాయాలు అందించు విధముగా స్పెషల్ వార్డు వుండేవిధముగా నాయకులు ప్రయత్నము చెయాలి. హెల్త్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ కు కనీసము ఆరోగ్యశ్రీ కూడా లేదు. ప్రస్తుతము covid-19 ఆరోగ్యశ్రీ లో చేర్చారు. కావునా కాంట్రాక్టు ఎంప్లాయిస్ కు హెల్త్ కార్డు ప్రొవైడ్ చేసేవిధముగా నాయకులు ప్రయత్నాలు చేయాలి అని నాయొక్క మనవి.
ఇది మనలోనో ఒక మిత్రుని మనవి.
ప్రస్తుత కరోనా పాండమిక్ సమయములో ఇది చాలా అవసరం అయిన విషయము, కృష్ణాజిల్లాలో మరణించిన (సుధాకర్) మిత్రునుకి సరియిన వైద్య సకాలంలో అంధక పోవడం వలననే మరణం సంభవించినది. మన మిత్రులు చాలా మంది కోవిడ్ - 19 భారిన పడినా కూడా హోమ్ ఐసోలేషన్ లోనే ఉండటానికి మొగ్గు చుపుచున్నారు, అందుకు కారణం ఐసోలేషణ్ సెంటర్ల వద్దకు వచ్చే సరికి అక్కడ కలెక్టర్ మరియు రెవిన్యు వారి ప్రోద్బలం ఎక్కువగా వుంటుంది. అటువంటి పరిస్థితులలో మన తోటి సిబ్బంది కూడా మనకు సహయము చేయలేని పరస్థితి నెలకొని వుంది. అదేవిధముగా పారా మెడికల్ సిబ్బందికి టెస్టులు చేయుంచు కోవాలి అన్నాకూడా ప్రాధాన్యత లేకుండా రెండు మూడు రోజులు వేచి ఉండవలసిన పరిస్థితి నేడు నెలకొని వుంది.
అసలే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది రెగ్యులరైజేషన్ విషయములో జరుగుతున్న జాప్యానికి ఎంతో మనోవేదంతో వుంటున్నారు అటువంటి పరిస్థితులలో ప్రంట్ లైన్ వారియర్స్ అని అందరితో చెప్పించు కుంటూ తీరా మనవద్దకు వచ్చే సరికి సప్తసముద్రాలు ఒంటి చేత్తో ఈది ఇంటిముందు మురుగు కాలువలో పడి చనిపోయినట్లు అవుతుంది. అందువలన ఈ అంశమును మన ప్రధాన ఎజెండా అంశములో చేరుస్తూ ఒక వారం రోజులలోగా మనం మెడికల్ అండ్ హెల్త్ లో పనిచేసే రేగ్యులర్ / కాంట్రాక్టు / ఔట్సొర్సింగ్ సిబ్బందికి కవిడ్ -19 పరీక్షా చేయించుకోవడానికి అదేవిధముగా సిబ్బందికి కవిడ్ -19 సంభవిస్తే వారికి సత్వర వైద్య అందించే విధముగా ప్రతి ఐసోలేషణ్ సెంటర్లో / జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేఖ వార్డును ఏర్పాటు చేయులాగున కోవిడ్ ప్రత్యేఖ అధికారి అయిన జిల్లా కలెక్టర్ మరియు DMHO లకు వినతి పత్రాలు అందించి సాధించులాగున మనం అందరం వెంటనే పని ప్రారంభించాలి. రేపు ఇవ్వ బోయే రిప్రజెంటేషణ్ లో కోవిడ్ వలన మరణించిన పారామేడికల్ సిబ్బందికి కూడా మరణించిన రెగ్యులర్ మాదిరి కుటుంబంలో ఒకరికి వెంటనే ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేర్చండి.
ఈ కార్యక్రముంలో మనతో పాటు లబ్దిదారులుగా రెగ్యులర్ ఉద్యోగులు కూడా వుంటారు కావున వారిని కూడా ప్రత్యేఖముగా భాగ స్వాములు చేస్తూ ప్రణాళిక చేయాలని మనవి చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అన్ని జిల్లాలలో ఒకేసారి ఉద్యమంలా ఈ కార్యక్రమం చేస్తే రష్ట్ర రాజధాని నుండి రావలసిన సహాయం కొరకు రెగ్యులర్ యునియన్లతో కలసి మేము ఇక్కడ పని చేస్తాము అని తెలియచేస్తున్నాము.
0 Comments:
Post a Comment