Capital City Amaravati

WHO MAKE MISTAKES - WHO WILL GET PUNISHMENT

అనగనగా ఒక రాజ్యం.... పల్లవులు చోళులు చాళుక్యులచే పరిపాలించబడి, కృష్ణా గోదావరి తుంగబద్ర వంటి నదులను తనలో  ఇనుమడింప చేసుకొని దేశం మొత్తంలో ప్రజలందరు అసూయపడేలా జీవనంసాగిస్తూ ఉండే ప్రాంతం, ఎంతో సుభిక్షం అయిన ప్రాంతంలో రాజ్యపాలన చేయడానికి ఒక వ్యక్తికి  అవకాశం వస్తే కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన ఆస్థాన ఉద్యోగులకు ప్రతిసారి (PRC) పెంచకుండా వుండాలి అని ఆ విధముగా చేకూరిన పైసలను ఏదోఒక కాకమ్మ కబుర్లు చెప్పి సొంత ఖజానా వేసుకోవాలని చేసిన ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 54వేలమంది ఒప్పంద మరియు 2 లక్షల మంది పోరుగుసేవల ఉద్యోగులు. 

ఈ మాస్టర్ ప్లాన్ వేసి ఇప్పటికి 19 సంవత్సరాలు  తరువాతి కాలంలో నాలుగు సార్లు రాజ్యాధికారం మారింది  నేతలు మారారు. ప్రతి ఒక్కరు 2000 -2002 కాలంలో జరిగింది పెద్ద గోరం-నేరం మేము అధికారంలోకి రాగానే ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులు అందరిని క్రమబద్ధికరిస్తాము అని చెప్పారు కుర్చీలో కూర్చున్నారు అందువలన వచ్చిన మతిమరుపు వలన క్రమబద్ధికరిస్తాము అని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. అయితే 2004లో అధికారంలోకి వచ్చిన డా. వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు మొదటి సారి రాజ్యాధికారం చేబూనినప్పుడు కొంత మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధికరించడం వలన మిగతా వారంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఆయన రెండవ సారి రాజ్యాధికారం చేపట్టినప్పుడు భ్రమ్మరధం పట్టారు అయితే ఆయన మరణం మరో 5 సంవత్సరాలు ఒప్పంద / పొరుగు సేవల ఉద్యోగులు నోరు మెదపకుండా చేసేసింది. 

ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపించింది. అసలు ప్రభుత్వంలో 2 లక్షల మంది పొరుగు సేవల ఉద్యోగులు ఎందుకు ఉండవలసి వచ్చింది అంటే ప్రభుత్వంలో ఒక ఉద్యోగం నింపాలి అంటే పలానా స్థలంలో మాకు పనిచేయడానికి ఒక ఉద్యోగి కావాలి అని అడిగినప్పుడు ఆ పనికి కావాల్సిన అర్హతలు ఏమిటి జీతభత్యాలు ఎంత ఇవ్వవచ్చు వంటి విషయాలు పరిశీలించి దానిని మంజూరు (Sanction) చేస్తారు, G.O. 212 ద్వారా అనేకమంది NMR | PART TIME | FULL TIME ఉద్యోగులకు క్రమబద్ధికరణ ఫలాలు అందించిన  గౌ|| అన్న NTR గారి పాలన వరకు ఆ ప్రక్రియ సజావుగా సాగినా వైస్రాయ్ ల పరిపాలన ప్రారంభం కాగానే ఈ ఉద్యోగాల మంజూరు అనే అంశాన్ని హుస్సేన్ సాగర్ లో కలిపేసారు. అంటే దాదాపు 1999 తరువాత కొత్తపనివారు అవసరంలేదు కేవలం రోజువారి కులీలులాగా నెలవారీ కులీలను పెట్టుకుంటాం అని నిసిగ్గుగుగా చెప్పారు, రేపు మా పిల్లలు కూడా ఒప్పంద ఉద్యోగులుగా చేయవలసి వస్తుంది అనే ఇంగితజ్ఞానం కూడా  లేకుండా సంఘాలన్నీ జై కొట్టేసాయి.  అదన్నమాట అందువలన రెగ్యులర్ ఉద్యోగులకు సంమాంతరముగా పొరుగు సేవల సంఖ్య కూడా పెరుగుకుంటూ వచ్చింది. 

ప్రశ్న: రాష్ట్ర మౌలిక అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు భవనాలు పెంచుకుంటూ వచ్చినట్లుగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను పెంచాలా వద్దా?  

మల్లి మన విషయానికి వద్దాం, ఆ తరువాత రోశయ్య గారు పరిపాలన ప్రారంభించడం, కిరణ్ కుమార్ రెడ్డి గారికి పాలన అప్పగించడం రాష్ట్రం విడిపోవడం చకచక జరిగిపోయి అమరావతి కేంద్రం గా కొత్త రాజధాని రావడం నేను గతంలో చేసినవి అన్ని తప్పులు అన్ని దిద్దుకుంటా అని మల్లి 40 సంవత్సరాల అనుభవం కలిగిన  నాయకుడు రాజ్యాధికారం చేపట్టడం జరిగింది ఆయన చెప్పిన మాటలను పాపం ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులు తప్పుగా అర్ధం చేసుకున్నారు, దాని ఫలితం నేను 2002 లో మాస్టర్ ప్లాన్ వేసి సగం జీతానికే పని చేయించు కోవాలని ఒప్పంద ఉద్యోగులు అని కొత్త సూత్రం తీసుకు వస్తే  వారికి జీతాలు పెంచుతారా అని G.O. 27, G.O.12 లతో ఒప్పంద ఉద్యోగుల గొంతుకోసారు. ఇక్క అక్కడితో ఒప్పంద | పొరుగు సేవల ఉద్యోగులు ఎవరుకుడా 2019 వరకు ఒక్కసారి కూడా ప్రభుత్వాన్ని అడగలేదు అంటే 40 సంవత్సరాల అనుభవం అంటే ఏమిటో అప్పుడే అర్ధం అయ్యింది అందరికి.  

ఇక్కడ సీన్ కట్ చేస్తే.. వై. యస్ రాజశేకర్ రెడ్డి తనయుడు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన ప్రతి తప్పును ఎండగట్టడం నా పరిపాలన రావడం తోనే మీకు అంతా మంచి జరుగుతుంది అని హామీ ఇవ్వడం అదేవిధంగా ఒక్క పేజి ప్రణాళిక ప్రకటన పత్రం (MANIFESTO)లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశం చేర్చడం వలన ఒప్పంద ఉద్యోగుల ఆశలు మల్లిచిగురించి ఇప్పటికి స్థిరంగా ఉన్నాయి. 
        
కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల గ్రహచారమో ఉన్నత అధికారుల అలసత్వము సరిగా అర్థం కాలేదు కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన వెంటనే తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా  దానిని పూర్తి చేయటానికి అహర్నిశలు శ్రమించడం మొదలుపెట్టారు ఇప్పటికి 90% అయిపోవచ్చింది కూడా,  మిగిలి ఉన్నది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు ఇంకా ఒకటి రెండు అంశములు మాత్రమే. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల అధికరణ అనే అంశం పై వారు నిర్ణయం    తీసుకునే ముందు అధికారుల సలహా వల్లనైతేనేమి మరే ఇతర కారణాల వల్ల నైతేనేమి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయటం కోసం ఒక కమిటీని నియమించారు (G.O. Rt. No. 1567 GAD Dated: 10.07.2019)  "అయ్యో ఇదేంటి గతంలో 40 సంవత్సరాల సీనియర్ కూడా ఇలాగే చేశాడు కదా ఆఖరికి కోర్టు జడ్జిమెంట్ కాకుండా అప్పీలు ఆధారంగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధికరించలేము అని చేతులు దులుపు కున్నాడు కదా అని అందరూ ఒక సారిగా గుప్పు మనడంతో వెంటనే క్రమబద్ధికరణ కమిటిని చూసుకుంటానికి ఇంకో కమిటీని (G.O.Rt. No. 2657 GAD Dated: 26.11.2019) వేశారు అంటే సలహా ఇచ్చేవాడికి సలహా ఇచ్చే విధానం అన్నమాట. ఇంతవరకు బాగుంది రెండు కమిటీలు కలిసి పనిచేస్తాయి త్వరగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది అన్న సందర్భంలో జూన్ 30 కల్లా ఈ అంశం పూర్తి చేయాలి అని మరొక ప్రకటన (G.O.Rt. No. 2740 GAD Dated: 04.12.2019) విడుదల చేశారు దీనివలన వై. యస్. జగన్ మోహన్ రెడ్డి గారి పై ఒప్పంద ఉద్యోగుల నమ్మకం ఒక్కసారిగా ఎవరెస్ట్ శిఖరం మించి పోయాయి. 

ఆ తరువాత ప్రస్తుత చీఫ్ సెక్రెటరి గారు ఒక మేమో విడుదల చేసి ఉన్నాఫలంగా రాష్ట్రంలో పనిచేసే ఒప్పంద | పొరుగు సేవల ఉద్యోగుల లెక్కలు నాకు కావాలి అనడంతో ఒప్పంద ఉద్యోగులు అందరు నాటుకోడి పెట్టలు అప్పు చేసిమరి కొని | కోసి | ఆరగించి దండాలు పెట్టారు. ఈ లోపు జూన్ 30 వచ్చింది. ఆ తరువాత జులై 30 వచ్చింది, అంతే కదా జూన్ 30 తరువాత జులై 30 యే కదా వచ్చేది అలా వచ్చింది అన్నమాట, మరి ఇచ్చిన మాట ఏది... జులై 30 తరువాత ఒప్పంద ఉద్యోగిలోని అనుమానం గాడు నిద్రలేవడం మొదలు పెట్టాడు ఎం జరిగింది అంతా ఇప్పటి వరకు బాగానే జరిగింది కదా ఇప్పుడు ఏంటి ఎవరూ మాట్లాడరు ఏంటి? జూన్ 30 వరకు వాళ్ళతో మాట్లాడాము వీళ్ళతో మాట్లాడాము అదిగో పులి ఇదిగో తోక, పెట్రోలు పోసుకుంటా, పీక కోరికేస్తా, నేనిక్కడే ఉన్నా అని రుజువులు చూపిస్తూ రంకెలు వేసిన నా......లు నోరు మెదపడం లేదు ఏమిటి అని.....దు:ఖిస్తూ....రోదిస్తూ ...

అయితే వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నేరవేదా అంటే నెరవేరుతుంది అది జగన్ గారు చేయలేరు అది 19 సంవత్సరాలుగా అర్ధాకలితో, అవమానాలతో, చిత్కరింపులతో నిండి వున్న ఒప్పంద ఉద్యోగి నేను మనిషినే నేను అందరితో సమానంగా జీవించాలి, నన్ను మాటలు అన్న వాళ్ళని రెగ్యులర్ అయ్యి వాళ్ళ మొహం మీద కొట్టాలి అని పౌరుషం కలిగి నాలుగు పదులు దాటినా నీకడ లేని జీవితం ఎలా నెట్టుకు రావాలి అని కాకుండా నేను నుంచోవాలి నాతొ వున్న వాళ్ళు అందరు ఒక సోషల్ స్టేటస్ సాధించాలి అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కమిటిలలోని డజను (6 గురు మంత్రులు / 6 గురు అధికారులు ) మందిని నిలదియాలి సమయం గడిచి పోయినా ఎందుకు మీ నివేదిక ఇవ్వలేక పోయారు దీని వలన జరిగిన నష్టానికి మిరే భాధ్యులు అని తెలియచేసి సత్వరం వారు తమ పనిని ముగించే విధముగా ప్రయత్నం చేయాలి. 
   

About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.