- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఒక కలేనా.....
- గత ప్రభుత్వాలు మోసం చేశాయని ఈ ప్రభుత్వం పై ఎంతో ఆశతో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ సారి కూడా నిరాశ మిగులుతుందా.....
- ఏ పనిని అయినా ప్రకటించిన రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేస్తున్న ప్రభుత్వానికి కాంట్రాక్టు వారి రెగ్యులరైజేషన్ అనే అంశం సంవత్సరం గడిచిన కమిటీ నివేదిక ఇవ్వకపోతే ఏమిటి అర్థం.....
- ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నేపథ్యంలో కూడా ఎంతో ఓర్పుతో సేవలందిస్తున్న కూడా కనికరం చూపడం లేదు ఎందుకు......
- కాంట్రాక్టు ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబం అనాధ గానే మిగిలిపోతుంది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు......
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారు వారిలో ఇప్పటికీ మన విధి విధానాలను పరిశీలించి చూస్తే 15 వేల మంది ఇప్పటికిప్పుడు రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిక మునుపు అదేవిధంగా పదవి అధిరోహించిన తర్వాత కాంట్రాక్టు వారికి ఇచ్చిన హామీల మేరకు కాంట్రాక్టు ఉద్యోగులు ఎంతో ఆశతో ఉన్నారు కానీ ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పిన కమిటీ గడువు తీరిపోయిన రెండు నెలల సమయం గడుస్తున్నా ఇంత వరకూ వారు నివేదిక ఇవ్వక పోవడానికి గల కారణాలు ఎవరు తెలియజేయడం లేదు, కేవలం వర్కింగ్ కమిటీ వారి అభిప్రాయాలను చెప్పలేదు కాబట్టి మేము రెగ్యులర్ ప్రక్రియ ప్రారంభించ లేదు అని చెప్పటం చాలా విచారించదగ్గ విషయం.
మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారిలో 2002వ సంవత్సరం నుంచి పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు వారు ఇప్పటికి 45 సంవత్సరాలు దాటిన వారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపు రిటైర్మెంట్ అయ్యే వారు కూడా ఉన్నారు. పనిచేసే శాఖలో ఒత్తిడి అధికంగా ఉండటం వయసు మీద పడి ఉండటం వల్ల కనీసం ఒక నెలరోజులకు రెండు నుంచి ఐదు మంది చనిపోవడం జరుగుతుంది ఇదే పరిస్థితి కొనసాగితే రెగ్యులరైజేషన్ జరిగే లోపు ఎవరు మిగలని పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ విషయంపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గ్రూప్ అఫ్ మినిస్టర్స్ కమిటీలోని మంత్రివర్యులు అందరూ కూడా చొరవ చూపించి కాంట్రాక్టు వారిని రెగ్యులర్ చేయుటకు కోసం నివేదికలు తెప్పించుకొని కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలలో వెలుగులు నింపాలని కోరుతున్నారు.
0 Comments:
Post a Comment