మనదీ ఒక బ్రతుకేనా కుక్కలవలే నక్కల వలే ......
మనదీ
ఒక బ్రతుకేనా సందులలో పందులవలే ................?
ప్రస్తుతం మన
పరిస్థితి అంతే. ఎలాగంటే ప్రతిసారి ప్రభుత్వాలు మారగానే ఆశగా మాకు పది/పదిహేను/పంతొమ్మిది సంవత్సరాల
సర్వీసు మాకు వుంది మమ్ములను రెగ్యలర్ చేయండి అని ప్రతి కొత్త ప్రభుత్వాన్ని మొరపెట్టడం, ప్రభుత్వం మాకుఅనుకూలంగా వుంది మా ఉద్యోగాలకు
ఎటువంటి డోకాలేదు అని ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు చెప్పుకు తిరగడం, ప్రభుత్వం
చట్టం తన పని తాను
చేసుకుపోతుంది అని చెప్పడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో డిప్రేషన్లోకి వెళ్ళిపోవడం ప్రస్థుతం ఒప్పంద ఉద్యోగులుగా నియమితులైన వారి పరిస్థితి. పైన
శ్రీ శ్రీ గారిని ఎందుకు ప్రస్థావించామంటే
నెల నెల జీతాలు సరిగారావు, రవాణా భత్యం
వుండదు, ఏరియర్స్
వంటి వాటీకి అసలే నోచుకోము ఎంత
చేసినా "నువ్వు కాంట్రాక్టులో చేస్తున్నావ్" అనే పై అధికారుల మాటాలు
గుండెలొ సూదిలా గుచ్చుకుంటున్న సిగ్గు ఎగ్గు వదిలేసి నా కేంటి నవ్వి
పోదురుగాక.... అని మనసంతా చిమ్మ చీకటిగా వున్నా తెల్ల చొక్కాలు
వేసుకొని తిరిగేస్తున్న మనకు పై వాక్యాలు వర్తించ వంటారా .......?
ఆహా
ఓహో ఇంకేముంది కేబినెట్ సబ్ కమిటీ వేయించేసాం మీ సమస్యలన్ని తీర్చేస్తాం మిమ్ములను
రెగ్యులర్ చేసేస్తాం అన్న ప్రభుత్వ పెద్దలు ఆ సంగతి మర్చి
పోయారు, సబ్
కమిటీకి అన్ని చెప్పేసాం వాళ్ళకు అంతా అర్ధం అయింది
మేము చెప్పినట్లే కాంట్రాక్టు ఉద్యోగస్తులందరిని పర్మినెంట్ చేయిచేస్తాం అన్న
లీడర్లు నోరు మెదపడం లేదు, కాని కరోనా పుణ్యమా అని మెడికల్ అండ్ హెల్త్ లో అనేక కీలక నిర్ణయాలు మాత్రం
జరిగి పోతున్నాయి, అవ్వన్ని
మీకు వేరుగు చెప్వపలసిన అవసరం లేదు. కాని జరిగేదంతా మనకు అన్యాయం జరిగేవిధంగా
వుంటుంది అన్న విషయం మరువ వద్దు. అయితే
ప్రస్థుతం జరిగే విషయాలను మీముందు వుంచడానికి మేము చేసే ప్రయత్నమే ఈ
వ్యాసం
మనం
రెగ్యులర్ కావాలి అందుకు మన కృషితో పాటుగా మనకు రెగ్యులర్ ఎంప్లాయిస్ సహాయం కూడా
చాలా అవసరం, అయితే కాంట్రాక్టు అభ్యర్ధులుగా ఫలాన్ని నేరుగా అందుకునే వారిగా మనం ఎంత వరకు కృషి చేస్తున్నామో
ఆలోచించండి. మనం మన కేడర్ ని రెగ్యులర్ చేయమని అన్ని వివరములతో కూడిన
రిప్రజెంటేషన్ ఇప్పటి వరకు ఎన్ని సార్లు రిప్రజెంటేషణ్ చేసామో లెక్కలేదు, అలా చేసిన సదరు రిప్రజెంటేషన్లు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ వున్నాయి వాటి ఫైల్ నెంబర్లు ఎంత? బేతాల ప్రశ్న ఇది, ఒక్కసారి
ఆలోచించండి.
మేము ఒక మంచి ఆలోచనతో మన డిపర్ట్మెంట్ లొనే కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్ ల ఉద్యోగ సంఘాలతో కలసి పనిచేస్తున్నాం. కాంట్రాక్టు ఉద్యోగాస్తులమైన మనం అందరం ఒక స్టాండ్ మీదకు వస్తే రెగ్యులర్ వారంతా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ గవర్నమెంట్ లో పనులు ఒక్కరోజులో ఒక్క నెలలో అవ్వవు ఒడుపుగా అడుగులు వేసుకుంటూ ఫైల్స్ ముందుకు నడపాలి సహనంతో ఉండాలి చీత్కరించు కున్నా పడాలి అప్పుడు మాత్రమే రెగ్యులర్ ఫలం అందుకుంటాము. అందువలన అన్ని కేడర్లకు కలిపి ఒక్కసారే మేము వర్క్ అవుట్ చేయగలం. ఇది మంచి సమయం గవర్నమెంట్ అవసరం లో ఉంది.
- ప్రతి కేడర్లోని ఒప్పంద ఉద్యోగి మీ కేడర్ కి సంబంధించిన పూర్తీ వివరాలతో కూడిన రిప్రజెంటేషన్ తయారు చేయండి.
- దానికి సంబంధించిన అన్ని GO లు జోడించండి.
- మీకు ప్రత్యేకంగా సంఘం ఉన్నట్లయితే మీ సంఘం పేరు మీద దానిని HOD లో ఇవ్వండి. ఫైల్ ప్రభుత్వానికి పంపెంతవరకు ఫాలో చేయండి అది ఒక ఫైల్ నెంబర్ తో గవర్నమెంట్ కు (సేక్రేట్రియేట్) వస్తుంది అది మాకు (ఫైల్ నెంబర్) ఇవ్వండి.
- లేకపోతే మాకు పంపండి మేము మన అసోసియేషన్ తరుపున రిప్రజెంటేషన్ చేస్తాము.
ఇక్కడ
మనం గమనించ వలసిన విషయం ఏమిటంటే మీరు కొత్తగా వచ్చారా పాతవారా కాదు మీకు కసి ఉందా
లేదా అన్నది ముఖ్యం నేను చెప్పినవి చేస్తూ ఉంటే మీకు చేయాలి అని తపన పెరుగుతుంది, అలాగే
చాలా మంది ఎంతో కష్టించి పనిచేసి కూడా ఇప్పుడు స్తబ్దుగా అయిపోయారు ఎందుకంటే వారు ఏ MLA, MP, లేదా మినిష్టర్ కో అలాగే HOD లోనో
రిప్రజెంటేషన్ చేసివుంటారు ఒక వారం/నెల ఎదురుచూసినా ఎటువంటి రిజల్ట్ రాకపోగా మనవాళ్ళు వాళ్ళను గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడగటం కొన్ని సందర్భాలలో మోసం
చేసారు అనికూడా అనడం పరిపాటి అయ్యింది అందువలన వారిలో నిసత్సువ వచ్చేస్తుంది ఎవరు ఎటుపోతే నాకెందుకు లే నా ఉద్యోగం నేను చేసుకుంటాను అని అనుకుంటూ వుంటారు, అసలు
మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏమైంది అది మన డిపార్ట్మెంట్ కి చేరిందా, దాని
మీద ఏమైనా ఫైల్ తయారు చేశారా చేస్తే రిమార్క్స్ ఎలా ఉన్నాయి అవి మనం అధిగమించ
వచ్చా లేదా ఎవరైనా సహాయం తీసుకోవాలా ఇవన్నీ మనవారు ఆలోచించరు. నేను చెప్పేది ఏమంటే మీ
కోసం మేము తిరుగుతాం కానీ ఒప్పంద ఉద్యోగులుగా మీరు ఉన్నారు కాబట్టి మీ
పార్టీసిపేషన్ పెంచడం కొరకు అలా చెబుతున్నాను, ఆడపిల్లలు గ్రామాలు వదలి
రావాల్సిన పనిలేదు, మగపిల్లలు అందుకు సిద్దంగా వున్నారు. మనకు ఏదన్నా అనుమనాం వస్తే ఫోన్ లో / (Whatsapp లో ) టచ్ లో ఉంటే చాలు మీకు కావాల్సింది
మీకు అందించడానికి
మేము ఎప్పుడు
సిద్ధంగా ఉంటాము.
అసలు నేను శ్రీ శ్రీ గారిని స్మరణకు తెచుకోవడానికి ప్రధాన కారణం నేను ఇప్పుడు వివరిస్తాను, నేను మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను నేను సొంతగా ఒక యునియన్ కూడా నడుపుతున్నాను అందువలన ఎక్కువగా నా కేదార్ వాళ్ళు నాకు పరిచయం వుంటారు వారి నిత్యం ఇచ్చే సలహా ఏమిటి అంటే హెన్రీ ఎందుకు నువ్వు అందరి సంక్షేమం కొరకు శ్రమిస్తావు కేవలం మేల్ వర్కర్ల కొరకు నువ్వు పనిచేస్తే మన కేడర్ కు న్యాయం జరుగుతుంది అని చెబుతూ వుంటారు, అయితే గౌ. వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఇక రెగ్యులర్ ఖాయం అని మనవారు అంతా అనుకున్ను నేను అనుకున్నాను అందువలన e సంవత్సర కాలం స్తబ్దుగా వున్నాను అయితే కంటిన్యుషణ్ వంటి చిన్న పనులు సందర్భాను సారంగా ఇచ్చే రిప్రజెంటేషన్ల కొరకు సేక్రట్రియేట్ సందర్సిస్తూనే ఉండే వాడిని, గత 6 మాసాలుగా ఎక్కడో లోపం జరుగుతుంది సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నాకూడా మనవారిలో అంతగా చలన లేదు అయితే జూన్ 30 గడచినా తరువాత కదలిక మొదలు అయింది ఇక ఆఖరుకి వై.యస్. ఆర్ వర్ధంతి రోజునుండి మనం ప్రభుత్వానికి మన భాద తెలిసేలా ప్రయత్నాలు మొదలు పెడదాము అనిప్రకటించిన దగ్గర నుండి ఈ రోజు వరకు అంటే దాదాపు 5 రోజుల నుండి మేల్ కేడర్ వారు Whatsapp లో స్పందించి చేద్దాం అని కొంతమంది మాత్రం అన్నారు. మిగతా కేద్ర్ల నుండి మాత్రం అనూహ్య స్పందన ఎలా చేయాలి మా మద్దతు వుంటుంది మీరు ముందుకు వెళ్ళండి అని భరోసా ఎంతగ్గా అంటే రెగ్యులర్ అయ్యేవరకు ఉద్యమం ఆపకుండా చేయాలి సాధించాలి అనేంతలా వారి కసి కనిపిస్తుంది. నేను నిన్న రాత్రి కొంచెం పేరున్న వాడు వీడికి చెప్పాలి అనుకున్న వారి లిస్టు రాస్తే దాదాపు 85 పేర్లు వచ్చాయి కాని వారెవరు ఇంతవరకు స్పందించలేదు. అందువలన మనలను కుక్కలుగా పందులుగా పోల్చుకోవలసి వచ్చింది. ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నిస్వార్ధంగా నిజాయితిగా చేయాలి అప్పుడే విజయం వరిస్తుంది. ఆలోచించండి విజయమా ఎప్పటిలాగానే నిట్టుర్పా
0 Comments:
Post a Comment