ఇక్కడ రెండు లింక్ లను రిప్రజెంటేషణ్ రూపములో ఇవ్వ బడ్డాయి అందు ఒకటి లెటర్ హెడ్ కలిగి వున్నది రెండువది తెల్ల కాగితము మీద ఇవ్వ బడినది మిత్రులు మీ సౌకర్యార్ధము రిప్రజెంటేషణ్ లను జిల్లా అధికారులకు అంధ చేయగలరని మనవి చేస్తున్నాము.
APPMCEA DEATH BENEFITS REPRESENTATION
DEATH BENEFITS REPRESENTATION ON WHITE PAPER
గౌరవనీయులైన అంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ. ఆళ్ళ కాళి కృష్ణ శ్రీనివాస్ (నాని) గారికి
గౌరవనియులైన అయ్యా.,
విషయము : ప్రజాసంభంద - ఒప్పంద ఉద్యోగులు – జీతభత్యములు హెచ్చుతగ్గులు – ఉద్యోగి మరణానంతర లబ్ది
జీవితభీమా - వైద్యఖర్చులు (ఆరోగ్య శ్రీ) - హెల్త్ కార్డులు పొందులాగున ఉత్తర్వులు ఇప్పించ గలందులకు – వేడుకొనుట గురించి.
*******
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో దాదాపు 54 వేల మంది ఒప్పంద కార్మికులు పనిచేయు చుండగా అందులో 1999 సంవత్సరము నుండి ఒప్పంద విధానము ప్రారంభించి ఇప్పటికి 21వేల మంది వరకు ఒప్పంద సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖ నందు విధులు నిర్వహిస్తున్నారు, ప్రభుత్వము వీరిని వివిధ శాఖలలో రెగ్యులర్ ఉద్యోగస్తుల మాదిరిగానే అన్ని విధి విధానాలు అవలంభిస్తూ ప్రభుత్వము మంజూరు (సాంక్షండ్ పోస్టు) చేసిన స్థానములలో విధులు నిర్వహించుటకు గాను నియమించినారు, వీరంతా నియమితులైన స్థానములోనే చేరినప్పటి నుండి పనిచేయుచున్నారు.
కాంట్రాక్టు సిబ్బంది కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వము నిర్దేశించిన అన్ని పనులను సమర్ధ వంతముగా నిర్వహించుచున్నారు. కానీ వీరి జీవితములలో ఏదైనా అనుకోని సంఘటన జరిగి సదరు కాంట్రాక్టు ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబము రోడ్డున పడిపోతుంది వారికి ప్రభుత్వమునుండి అందే అరకొర ఆర్ధిక సహయాము ఉద్యోగి మరణించిన తరువాత ఆ కుటుంభమునకు ఎటువంటి భరోసా ఇవ్వలేక పోతుంది. కనుక ఆ కుటుంబములోని వారు ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనుటయే కాకుండా మానసికంగా నలిగి పోతున్నారు, ఇప్పటి వరకు ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే దాదాపు 275 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇప్పటి పరిస్థితులలో రిక్షా కార్మికుడు మరణించినా ప్రభుత్వమునుండి 5-10 లక్షల వరకు ఆర్ధిక సహాయము అందుతుంది, రెగ్యులర్ ఉద్యోగి తన GPF ఖాతాలో ఉన్నదానితో తన కుటుంబమునకు భరోసా ఇవ్వగలుగు తున్నాడు, ఔట్సొర్సింగ్ ఉద్యోగికి ప్రభుత్వ సహకారముతో ESI PF వంటి సేవలు అందు బాటులో వున్నాయి ఒక్క కాంట్రాక్టు ఉద్యోగి మాత్రము అన్యాయము అగుచున్నాడు.
కావున పై విషయములు దృష్టిలో వుంచుకొని మాపై జాలితో కాంట్రాక్టు సిబ్బందికి కుడా ఈ క్రింది ఉపకారములు చేకూరు లాగున తమరు ఆదేశములు ఇవ్వవలెనని విన్నవించుచున్నాము:
1. కాంట్రాక్టు విధానములో పనిచేస్తూ చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవడానికి, చనిపోయిన వారి కుటుంబానికి ఇప్పుడు ఇస్తున్న 2 లక్షల స్థానములో 10 లక్షల పారితోషికం చెల్లించాలి .
2. కాంట్రాక్టు విధానములో పనిచేస్తున్న వారికి అనుకోని సంఘటన జరిగితే వారిని ఆదుకోనుటకు జీవిత భీమా వర్తింప చేయాలి.
3. కాంట్రాక్టు ఉద్యోగి మరణిస్తే వారి కుటుంభమును ఆదుకోవడానికి వారి కుటుంబము నుండి ఒకరికి కుటుంభామునకు ఆసరాగా ఉండటానికి ఉద్యోగం కల్పించాలి
4. ఒప్పంద ఉద్యోగుల నియామకములు జరిగి నప్పటి నుండి ఒకే ప్రదేశములో పని చేస్తున్నారు వారికి స్థానచలనం జరిగే అవకాశం లేకపోవడం వలన తల్లిదండ్రులకు దూరంగా ఉన్న ఒప్పంద ఉద్యోగులు వారి భాద్యతను నిర్వర్తించలేక ఇబ్బంది పడుతున్నారు, వీరికి అందే జీతభత్యములు తక్కువగా వుండటం వలన వేరే ప్రదేశములో పని చేయడము వలన ఆర్దికముగా చితికి పోవుచున్నారు కావున వారికి కనీసము ఆరోగ్య సమస్యల ఆధారముగా అయినా HOD / DSC చైర్మన్ స్థానచలనం కల్పించడానికి అవకాశం కల్పించాలి.
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కాంట్రాక్టు విధానము ప్రారంభించిన నాటి నుండి పనిచేస్తున్నారు వీరిలో చాలా మంది 45 సంవత్సరముల వయస్సు దాటినా వారు వున్నారు, రెగ్యులర్ ఉద్యోగస్థులకు పే రివిజన్ చేయునప్పుడు వర్తింప చేసివిధంగా బాస్కెట్ మనీ సూత్రం ఆధారంగా వయస్సు ఆధారంగా జబ్బులు వస్తే వాటికి కూడా జీతములకు ఇంక్రిమెంట్ కలిపి ఇస్తున్నారు అయితే కాంట్రాక్టు ఉద్యోగస్తులకు ఎటువంటి ఇంక్రిమెంట్లు వుండవు కానీ వయస్సు ఆధారముగా వచ్చే జబ్బులు మాత్రము రాకుండా ఆగవు కావున కాంట్రాక్టు వారికి కూడా Employee Health Scheme లేదా ఆరోగ్యరక్ష లేదా ఆరోగ్య శ్రీ వంటి పధకములు వర్తింపజేయడం ద్వారా ఆదుకోవాలి.
Thanking you Sir
ఇట్లు
తమ విధేయులు
0 Comments:
Post a Comment