ఒక ఉద్యోగి ఆవేదన 😰
ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఉద్యోగుల సంఘాల మరియు ఆంద్రప్రదేశ్ ఉద్యోగ అన్ని సంఘాల నాయకులకు విజ్ఞప్తి :.........
గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు (MPHAs) గా డిపార్ట్మెంట్ లో గ్రౌండ్ లెవెల్ లో పనిచేయుచున్న మేము తమరి దృష్టికి తెలియజేయడమేమనగా,
అయ్యా మరియు అమ్మ గార్లకు విన్నవించుకోవడమేమనగా,
మాకు డిపార్ట్మెంట్ నందు తీవ్ర స్థాయిలో పని వత్తిడి ఉంది. ఈ పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న మహమ్మారి కరోనా వ్యాధి విస్తరిస్తున్న తరుణంలో మేము ప్రజారోగ్య శ్రేయస్సు కొరకు ప్రభుత్వం తీసుకొను నివారణా ,నియంత్రణ చర్యలలో పాలు పంచుకోవడం మాకు కూడా గర్వంగా, బాధ్యతగా భావిస్తూ సమయ పాలన తో పనిలేకుండా ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నాము. మానవ సేవయే మాధవసేవ అని భావించి మాకు కరోనా తో ప్రాణ భయమున్నా వెనుకడుగు వేయకుండా పసిబిడ్డలను, వృద్ధులను, భర్త, భార్యా సంసారం అని కూడా పట్టించుకోకుండా, మాకు కేటాయించిన విధులను మా తోటి ఉద్యోగస్తులు కొందరు ప్రాణాలు ఫణంగా పెట్టినా, విధినిర్వహణలో తనువులు చాలించినా మొక్కవోని ధైర్యంతో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న సంగతి మీకు తెలిసిందే.
ఇటువంటి పరిస్థితులలో క్షేత్రస్థాయిలో మేము ప్రతి వ్యక్తి కరోనా అనుమానాస్పద కేసులను, వృద్దులను, గర్భవతులకు, కోమోర్బైడ్ లక్షణాలు ( తీవ్ర అనారోగ్య ,దీర్ఘకాలిక వ్యాధులు ) కలిగిన వ్యక్తులకు కరోనా పరీక్షలు చేయించుటలో, వారికి ఇంటింటికి వెళ్లి మాకు కరోనా సోకుటుందేమో అని అనుకోకుండా temperature, pulse చూడటం, home isolationలో వున్న వారి ఆరోగ్య పరిస్తితులను పరీక్షించటం, కరోనా పరీక్షలకు ప్రోత్సహించడం, positive కేసులను తరలించడం వంటి పనులను పగలే కాకుండా రాత్రిసమయం లలో కూడా శక్తివంచన లేకుండా నిర్వహిస్తున్నాము. ఈ విషయంలో మేము మా బాధ్యత గా , మనస్ఫూర్తిగా, క్షణం తీరిక లేకుండా వర్క్ చేస్తున్నాము.
ఇటువంటి పరిస్థితులలో మాకు పై అధికారులనుండి ఇతర విధులయినటువంటి గర్భవతులు, బాలింతలకు, పిల్లలకు , వృద్ధులకు కూడా సేవలు అందజేస్తున్నాము. కానీ మెడికల్ అండ్ హెల్త్ లో ఒక్కో wing నుండి ఒక్కొక్క officer మాకు ఆ report online చేయాలి అని చెప్పినా, ఈ రిపోర్టు పెట్టాలి అని అని చెప్పినా, Regular వ్యాధినిరోధక టీకాలు గ్రామాల్లో వేసి మళ్లీ సాయంత్రం line లిస్ట్ ready చేసి కూడా ఏరోజుకారోజు పెడుతూనే ఉన్నాము. vaccination special డ్రైవ్ చేసి complete చేయాలి అని చెబుతున్నా మేము కాదనకుండా చేస్తూనే ఉన్నాము. ప్రతి రోజూ covid కొరకు fever clinics, sample collection testing కొరకు motivation చేసి పిలుచుకురావాలి. Online లో cases list upload మేమే చేయాలి. PPI Kits వేసుకొని sample collection లో సహకరించాలి. ఇలా ఎన్నో పనులు చేసుకుంటూ పోతున్నప్పటికీ మాపై LEPROSY Case detection campaign అంటూ వాటికి action plan ఇవ్వాలి. Next September లో లెప్రసి సర్వే కూడా చేయాలి. మళ్లీ NCD సర్వే , ANEMIA MUKT BHARATH ప్రోగ్రాం చేయాలి, ఇలా ప్రభుత్వం ఇచ్చినవి అన్నీకూడా చేస్తున్నాము, మొన్న ఆగస్టు 17 వతేదీ నుండి 20 వ తేదీ వరకు జరిగిన NDD జాతీయ నులిపురుగుల నివారణా కార్యక్రమంలో మాత్రల పంపిణీ కూడా కరోనా పరిస్తితులకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి ఆ కార్యక్రమం ను పూర్తిచేశాము. కానీ మళ్లీ ఈరోజు ఆ వివరాలు LINE LIST పెట్టండి అని మాపై వత్తిడి తెస్తున్నారు. మేము సేవలు అందజేయాలా field లో ఈ పేర్లు లిస్ట్ తయారుచేయాలా. ప్రతి పిల్లవాడికి టాబ్లెట్స్ అందినాయా లేదా అనేది మన concept. కానీ ఇటువంటి పరిస్థితులలో ఈ లిస్ట్ అవసరమా. లేని పోని పని భారం కాకపోతే ఈ వర్క్. జాతీయ pulse polio నిర్మూలనా కార్యక్రమములో కూడా మేము మావంతు సహకరించి ప్రోగ్రాం grand success చేశాము కదా. అందులో కూడా మా concept ప్రతి బిడ్డకు miss అవ్వకుండా చుక్కలు వేసేది మన concept. దానిలో కూడా లిస్ట్ prepare చేయమని అడగలేదు. List ప్రిపేర్ చేసి ఎవ్వరూ miss కాకుండా action plan వేసుకున్నాము. అంతే గానీ మీరు ఏయ్ పిల్లలకు పోలియో చుక్కలు వేశారో లిస్ట్ పెట్టండి అంటే మేము ఏమి చేయాలో చెప్పండి. అలా అయితే ఏ ప్రోగ్రాం జరపకుండా, సక్సెస్స్ కాకుండా వూరికే లిస్ట్ తయారు చేసుకుంటూ పోవాలి. ఇలాంటి వర్క్ అవసరమైతే వేరే Data entry operator తో చేయించుకోవాలి. అన్నిటికీ ఆరోగ్యకార్యకర్తలేనా దొరికింది. మేమూ మనుషులమే కదా. ఇంటికి వెళ్లేసరికి మేము అలసిపోయిఉంటాము. కానీ మళ్లీ ఈ వర్క్ అంతా మా పైనే రుద్ది, ఆఫీస్ నుండి ఒక మెయిల్ పెట్టి ఈ రిపోర్టు most urgent అని పంపుతారు ఒక్కో wing నుండి. అన్ని wings work చేయవలదినది మాత్రం మేమే. మాకు తగిన సమయము ఇచ్చి చేయమంటే మేము కూడా అన్ని works చేస్తాము. ఒక ప్రోగ్రాం తర్వాత ఒకటి ఉంటే మేము కూడా చేస్తాము. మేము కూడా ప్రభుత్వము చేసే ప్రోగ్రాం లు చేయుటకే కదా ఉండేది. కానీ అన్ని programs ఒకేసారి వున్నప్పుడు మాకు కూడా వత్తిడి ఎక్కువైతే మా ఆరోగ్యపరిస్తితులను కూడాగమనించాలి. ఈ online work తో మేము రోజుకు అర్ధరాత్రి వరకూ పనిచేయాల్సి వస్తుంది. మేము కూడా ఇంటిదగ్గర సంసారాన్ని కూడా చూసుకోవాలి కదా. అధికారులూ ఆలోచించాలి . ఈ విషయాలలో నాయకులారా మీరూ ఆలోచించి మాపై ఉన్న పనిభారాన్ని తగ్గించడానికి అధికారులతో సంప్రదించి దయచేసి మాకు అనవసరమైన , అదనంగా ఉన్న పనులనుండి తప్పించి మాకు ఊపిరి సలిపేటట్లు, మా విధులను సక్రమంగా చేసుకునేటట్లు , ఈ వర్క్ టెన్సన్స్ తో కొందరు అనారోగ్యం పాలు అవుతున్నారు. ఈ విషయాల్ని మీరు గ్రహించి మాపై పని వత్తిడి తగ్గించి మేము సక్రమంగా మా యొక్క విధులు నిర్వర్తించేటట్లుగా చూడాలని మెడికల్ & Health,యూనియన్స్, మరియు ఇతర అన్ని సంఘాల నాయకులకు విన్నవించుకుంటూ కమీషనర్ వారితో మాట్లాడి పై విషయాలు విన్నవించి మా సమస్యలకు పరిష్కారం చూపుతారని మా ఆవేదనను నాయకులదృష్టికి తీసుకొస్తూ.... 📌మీ సాధారణ ఆరోగ్య సహచర ఉద్యోగి📌........
0 Comments:
Post a Comment