ఎవడో పనికిమాలిన వెధవ గత 15 - 20 సంవత్సరాలుగా చాలీచాలని జీతంతో ఎప్పటికైనా రెగ్యులర్ ఉద్యోగులం కాకపోతామా అని ప్రభుత్వానికి సేవచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కొంచెం పెద్ద మనసుతో తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన 30 మార్కుల వెయిటేజ్ చెల్లదని కోర్టులో కేసులు వేస్తే మనం చేసిన సేవలకు గాను మనకు వెయిటేజ్ ఇవ్వవచ్చు కాని ప్రభుత్వం బిక్షం వేసినంత ఇవ్వవచ్చు మనకు ఏమి కావాలో మనము అడగకూడదు, ఆఖరికి కాంట్రాక్టు ఉద్యోగులు బిక్ష ఎత్తుకోవడానికి కూడా అనర్హులే అనే విధంగా వుంది. ఈ తీర్పు చాల అన్యాయం. మీరు కూడా పుతిగా అర్ధం చేసుకోవాలని జడ్జ్ మెంట్ కాపీని పోస్ట్ క్రింద ఇవ్వడం జరిగింది. పైన చూపించిన కేసులలో తెలంగాణా రాష్ట్రం హైకోర్టు వారు వెలువరచిన తీర్పును మీముందుకు మీకు అర్ధం కావడానికి ఉంచాము. ఇది ఒక ఓపెన్ పేజి మీరు ఇక్కడ కామెంట్ చేయవచు లేదా నాయొక్క Whatsapp. 90592 79777 కు మెసేజ్ చేయవచ్చు.
THE OPINION OF THE FULL BENCH:
136. ప్రభుత్వ ఉపాధిలో రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, సమస్యలకు ఈ క్రింది విధంగా సమాధానం ఇవ్వబడింది:
I. STATE GOVERNAMENT SERVICE:
- ఈ కోర్టు తెలంగాణ రాష్ట్రం యొక్క మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 యొక్క రూల్ 31 యొక్క రాజ్యాంగ ప్రామాణికతను సమర్థించింది. అంతేకాక ఈ నిబంధన ప్రకారం ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించడం చట్టబద్ధంగా చెల్లుతుంది.
- సేవా నిబంధనల సడలింపును గవర్నర్ తన కున్న అధికారం చేత ఉపయోగించుకోవచ్చు సేవా నియమం విధించిన తాత్కాలిక సేవ లను పరిగణలోకి తీసుకుని దాని పై ఉన్న పరిమితిని తొలగించడానికి గవర్నర్ అధికారం కలిగి వుంటారు మరియు తాత్కాలిక ఉద్యోగిని సాధారణ నియామక ప్రక్రియలో తాత్కాలిక సేవను వెయిటేజీగా లెక్కించడానికి అవకాశం వుంది.
- ఏదేమైనా, రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌లో తాత్కాలిక ఉద్యోగికి తాను చేసిన సేవ కోసం మార్కుల కేటాయింపును సేవా నియమాలు సహించకపోతే, ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగికి తాను చేసిన సేవ కోసం మార్కుల వెయిటేజీని కేటాయించవచ్చు. ఆ విధంగా మార్కులను కలుపుటకు గాను కావలసిన మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే తాత్కాలిక ఉద్యోగి తానూ చేసిన తాత్కాలిక సేవకు వెయిటేజీని పొడిగించాలని పట్టుబట్టడానికి ఏ విధమైన హక్కు లేదు.
- రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగి చేసిన తాత్కాలిక సేవ కోసం మార్కుల కేటాయింపు బైండింగ్ సెటిల్‌మెంట్ అవసరం కాబట్టి, తాత్కాలిక ఉద్యోగి దాని అమలును పొందటానికి అర్హులు;
- యజమాని తన కింద మరియు / లేదా ఒక నిర్దిష్ట పోస్టులో చేసిన ఉద్యోగి చేసిన తాత్కాలిక సేవకు వెయిటేజ్ ఎంత ఇవ్వాలి అనేదానిని పరిమితం చేయడం అనుమతించబడుతుంది;
రెగ్యులర్ నియామకానికి జరిపే ఎంపిక ప్రక్రియలో భాగంగా, తాత్కాలిక ఉద్యోగికి తానూ చేసిన సేవల ప్రాతిపదికన మార్కులను విభజించి ఇచ్చే అధికారం యజమానికి ఉంది. అయినప్పటికీ, తాత్కాలిక ఉద్యోగికి రెగ్యులర్ నియామకానికి జరిపే ఎంపిక ప్రక్రియలో కెటాయించిన మార్కులు మొత్తం 100 మార్కులలో 20 మార్కులకు మించకూడదు లేదా మొత్తం మార్కులలో 2O% కన్నా ఎక్కువ ఉండకూడదు.
137. పూర్తి ధర్మాసనం పరిశీలన కోసం రూపొందించిన నాలుగు (4) సమస్యల పరిధిలోకి రాని అనేక ఇతర అంశాలపై ఉదోగుల తరుపున నాయవాదులు వారి వాదనను సమర్పించారు. పైన ఉదాహరించిన కేసులలో న్యాయం నిర్ణయించడానికి మేము ఉదాహరించిన సమస్యలకు మాత్రమే సమాధానం ఇచ్చాము. డివిజన్ బెంచ్/సింగిల్ బెంచ్ ముందు అన్ని ఇతర అంశాలు అక్కడే వాదనలు వినిపించాలి. చట్టబద్ధమైన నియమం యొక్క చెల్లుబాటుకు ఎటువంటి సవాలు చేయలేము మరియు/లేదా చట్టబద్ధమైన నియమం యొక్క ప్రామాణికత ఇక్కడ నిర్ణయించబడుతుంది, డివిజన్ బెంచ్ పరిశిలించిన కేసులను మరియు వ్యక్తిగత కేసులలో ఆందోళన చెందుతున్న సమస్యలను నిర్ణయించడానికి సింగిల్ జడ్జికి పంపవచ్చు.
138. W.P.No. 33494 of 2018 లో లేవనెత్తిన సమస్య పూర్తిగా భిన్నంగా వుంది, ప్రస్తుత బ్యాచ్ నుండి W.P.No. 33494 of 2018 ఫైల్‌ను వేరుచేయడానికి రిజిస్టార్ గారిని నిర్దేశించబడినది మరియు వాదనలు వినిపించడానికి సాధారణ రిట్ పిటిషన్లను జాబితా చేయండి.
ఒక కాంట్రాక్టు ఉద్యోగి దాదాపు 20 సంవత్సరములు పని చేసి, కనీసం కుటుంబం నకు కావలసిన కనీస వనరులు అందివ్వ లేని స్థితి కలిగి ఉన్నారు. అప్రజారంజకంగా పాలిస్తున్న ప్రభుత్వాల విష కోరల్లో చిక్కుకొన్న కాంట్రాక్టు ఉద్యోగి తన జీవితాలనే పణ్ణం గా పెట్ట వలసివచ్చింది . తన ఆశే తన నాశనానికి కారణం అయ్యింది. అన్ని అర్హతలు ఉన్న తాము రెగ్యులర్ కాలేమా అని వేరే ఉపాధి చూచుకోక ఊడిగం చేసి నాశనం అయినారు ఈ ఉద్యోగులు. పూర్వం ఎన్ని రోజులకు రెగ్యులర్ చేసే వాళ్ళు ? న్యాయం లేని సమాజం లో సగటు ఉద్యోగి న్యాయం అడుగుట వ్యర్థం . నీవు ఎప్పటికైనా న్యాయ, సుపరిపాలకులు వస్తారని ఎదురు చూడాలిసిందే ఓ చిరుఉద్యోగి .
ReplyDeleteThanks for sharing it is Very Informative page, I hope it will be useful for all of us. , India's indigenous COVID-19 Vaccine company Bharat Biotech IPO to get more valuable Informative about Covid 19,
ReplyDelete