News

NO FIGHT NO JUISTICE

అనుకున్నంతా అయ్యింది ఆఖరికి జీతాలు ఇవ్వండి చాలు మహాప్రభో అనే లాగా అయింది.
జూన్ నెల మొదటి వారంలోనే అందరి వివరాలు సేకరించిన ఫైనాన్స్ శాఖ.
HODల వద్ద నుండి జాబితా వస్తేనే జీతాల కొరకు ఇచ్చే కంటిన్యుషణ్ ఇస్తామని మతలభు.
 

 
    మొన్న ఎవరో మిత్రుడు మనం రెగ్యులర్ కోసం మానేసి జీతాల కోసం పోఆరాతాలు చేయ వలసి వచ్చేటట్లు వుంది అని వాట్సాప్ లో పెడితే కొంచెం సేపు నవ్వుకోని, ఈ మిత్రునుకి సరిగా అవగాహన లేదు ఆ విధంగా ఎందుకు జరుగుతుంది మనం రెగ్యులర్ అయిపోతాం అని కాసేపు ఊహల్లో తిరిగి సంకల కొట్టుకొని ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై పోయాం.  
        అయితే మన కంటిన్యూషన్ గురించి ఈరోజు తెలిసిన ఒక పచ్చినిజం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్న అన్నిHODలు వారి శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల అందరి జాబితాతో ఒక జస్టిఫికేషన్ ఇస్తేనే కంటిన్యుషణ్  ఇస్తాము అని మొన్న 17.08.2020 తారీకున ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన మెమో (UO NOTE_FIN01_HR0PDPP(OCE)_13_2019_HR-1_17.08.2020) ని కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్న అన్ని HOD లకు పంపి అన్ని హెచ్ఓడీ ల నుంచి వారి వద్ద ఎంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు అనే సమాధానం వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగస్తులకు కంటిన్యూషన్ ఇవ్వటం జరుగుతుంది అని తెలియవచ్చింది. ఇది చాలా దారుణమైన విషయం మిత్రులారా రెగ్యులర్ కోసం కాదు ఇప్పుడు ఒక రెండు నెలలు జీతం కొరకు ఇప్పుడు పోరాటం చేయాల్సిందే ఎందుకంటే HOD ల వద్ద నుండి సమాచారం అంటే  ఇది ఒక రెండు నెలలు అయినా సమయం పట్టే అంశం. 
        ఇదే పోరాటం ఇలాగే చేసుకుంటూ పోతూ ఉంటే ఆఖరికి రెగ్యులరైజేషన్ అనే పదాన్ని కూడా మనం మర్చి పోతాము అందువలన మనం మన ప్రయత్నాలను ముమ్మరం చేసి ప్రభుత్వానికి కాంట్రాక్టు ఉద్యోగుల ఆవేదన అంటే ఏంటో తెలియజేయాలి ఉద్యోగాల వద్ద ఇళ్ళల్లో పడుకొని కొట్టుకున్నంత వరకు కాంట్రాక్టు విధానంలో ఎదో ఒక మతలబు పెట్టి ఈ విధంగా జీతాలు ఆలస్యంగా ఇవ్వటమే కాకుండా ఆఖరికి కాంట్రాక్టు ఉద్యోగస్తులను అవుట్సోర్సింగ్  లో కలిపిన ఆశ్చర్యం లేదు.
        నేను స్వయముగా మన ప్రియ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి పైన మనలను రెగ్యులర్ చేస్తారు అని అపార నమ్మకంతో వున్నాను, కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి నిమ్మడిగా మన గోల ప్రక్క దారి పడుతుంది, అందుకు కారణం కేవలం అధికారులు అని మొన్నటి వారకు భావించాను కాని వాలంటిర్లు ఇంటి ఇంటి కి పంచిన మేనిఫెస్టో లో మన అంశం క్లియర్ గా మనం వెర్రి పువ్వులము అని తెలియ చేస్తూ ఎర్ర అక్షరాలతో రాసారు అంటే మేనిఫెస్టో ప్రతిని ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు చూపించే వుంటారు అంటే మనలను ప్రక్కన పెట్టిన అంశం గౌరవ ముఖ్యమంత్రివర్యులకు కూడా తెలుసును అన్నమాట గుర్తించండి. అందువలన మనం మన భాదను వ్యక్తం చేయకుండా నమ్మకాలతో పనులు జరుగవు. 
    కంటిన్యుషణ్ గురించిన వివరాలను నేను సేకరించి త్వరగానే కంటిన్యుషణ్ రావాడానికి ప్రయత్నం చేస్తాము, ముగ్గు గిసి దాంట్లో వదిలారు ఎప్పటికి బయటకు వస్తామో. పోరాటం చేయనిదే విజయం రాదు గుర్తించండి..... 

  
    
 

About JOHN HENRY

1 Comments:

  1. అధికారులకు తెలియ చెప్పండి

    ReplyDelete

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.