CHINNA BABU VIZAG:
టీడీపీ గవర్నమెంట్ ఉంటే మన కాంట్రాక్టు ఆరోగ్య కార్యకర్తల సమస్యలు సాక్షి పేపర్ లో వస్తాయి, ఇప్పుడు YSRCP గవర్నమెంట్ వుంది కాబట్టి ఆంధ్రజ్యోతి పేపర్ లో వస్తాయి. పరిస్థితి చూస్తాఉంటే అన్ని శాఖలు IAS ల క్రిందికి వెళ్లాయి. ఇంక మనమంతా చనిపోయినా కూడా ఎవడు పట్టించుకోడు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓటు బ్యాంకు కోసం పడే తాపత్రయం లో మన గురించి పట్టించుకొనే వాడు ఎవడు లేడు, మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పిన పెద్దలే మన రెగ్యులర్ విషయం లో ఏమి పట్టించుకోవడం లేదు, మహా అయితే మనం ఏం చేస్తాం ఈసారి ఎలక్షన్స్ లో ఈ పార్టీకి కాకుండా ఇంకో పార్టీకి ఓటు వేస్తాం, వాళ్ళు అధికారం లోకి వస్తే మన పరిస్థితి షరా మాములే, మళ్ళీ మనకు కోపం వస్తుందండోయ్ తరువాత ఎలక్షన్స్ లో ఓటు వేసే టైం కు మన ఆరోగ్య కార్యకర్తలు 100 కు 75 మంది రిటైర్ అయ్యివుంటాము, ఇంతమంది వున్నప్పుడు చేపించుకోలేని రెగ్యులర్ మిగిలిన ఆ కొద్దిమంది చేత కూడా కాదు, కాలచక్రం గిర్రున తిరుగుతుంది, ఈసారి మన ఆధార్ కార్డులు 100కు 90చినిగిపోయి ఉంటాయి (మరణించి ) ఉంటాం. బ్రతికున్న మన కుటుంబ సభ్యులు ఈ ఉద్యోగం చేసి మనము సంపాదించి ఏది ఉండదు కాబట్టి, దానికి తోడు మనం చేసిన అప్పులకు వడ్డీలు వాళ్ళుకడుతుంటారు కాబట్టి ప్రతి నిమిషం మనల్ని తిట్టుకుంటూ బ్రతుకుతారు. మన రాజకీయ నాయకులు మాత్రం హామీల వర్షం కురిపిస్తుంటారు. మళ్ళీ షరా మాములే. మనకు మలేరియా లో రాస్ చక్రం తెలుసు కదా అలాగే ఇది కాంట్రాక్టు చక్రం (చంద్రబాబు చక్రం అని కూడా అనవచ్చు ఎందుకంటే ఈ దరిద్రాన్ని తెచ్చి మనకు అంటగట్టింది ఆయనే కాబట్టి ). సో విషయం క్లియర్, రెగ్యులర్ కాదుగాని కనీసం ట్రాన్సఫర్ చేయించండి నాయకులు. బ్రదర్ ప్రసాద్ రెగ్యులర్ అయ్యో అంతవరకు గడ్డం, తలవెంట్రుకలు తియ్యను అని శపథం చేసావుగా, అవన్నీ మరచిపోయి క్రాప్ చేయించుకో, పెద్ద పెద్ద వాళ్లే CM లు అయ్యినవాళ్ళే మాట తప్పుతుంటే, వాళ్ళ ముందర మనమెంత, మనబ్రతుకెంత కాబట్టి, మనం ఇవన్నీ మరచిపోయి దేవుడు ఈ జన్మలో మనకు ఇలా రాసిపెట్టాడు అని అనుకోని బ్రతికేస్తే మనకు మనకు ప్రశాంతత దొరుకుతుంది. ఎంతోమంది మిత్రులు రెగ్యులర్ కోసం ఎదురు చూసి చనిపోయారో మనకు తెలుసు, ఏ గవర్నమెంటు వాళ్ళను ఆదుకోలేక పోయింది, చనిపోయిన తరువాత ఆ కుటుంబానికి మనం అంతో ఇంతో చనిపోయినప్పుడు సహాయం చేసి ఉండవచ్చు, అంతేగా, తరువాత కాలం లో ఆ కుటుంబాలు ఎలావున్నాయో ఎవరికయినా తెలుసా, ఒక కుటుంబ యజమాని చనిపోతే ఆ కుంటుంబం అబివృద్దిలో 15ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది అనే విషయం ఆలోచించని ఈ గవర్నమెంట్లు ఉంటే మనకు ఏం లాభం చెప్పండి.
BONTHAA VENKATARAMANA RAO:-
అన్నా మీరు చెప్పింది చాలా కరెక్ట్. కాకపోతే ఒక్క విషయం మాత్రం నిజం మనం గత 18సం. లుగా మన యొక్క మంచి తనాన్ని అలుసుగా చేసుకొని ప్రతీ నాయకుడూ మోసం చేసారు. మేము అధికారం లోకి వచ్చినవెంటనే రెగ్యులర్ చేసేస్తామని అంటూ కనీసం మనఓట్లు కొంతైనా సపోర్ట్ చేస్తాయని హామీలు ఇచ్చి మన మనోభావాలను దెబ్బతినే విదం గా ఓట్లు వేయించుకున్నారు. మనం, మనద్వారా మన కుటుంబ సభ్యులు మన భందువులు లతో పాటు ప్రజలు ఓట్ల తో ఫుల్ మెజార్టి వచ్చిన తర్వాత మన కాంటాక్ట్ ఉద్యోగులు చారులో కరివేపాకు లా తీసి పక్కన పడేసారు. ఇది గత 18 సం. లుగా జరుగుతునే ఉన్నా మనం మాత్రం ఇంకా మోసపోతూనే ఉన్నాము. కారణం మనం వారిపై పెట్టుకునే నమ్మకం. ఈ సారి జగన్ అన్న వంతువచ్చింది. అసెంబ్లిలో మేము అదికారం లోకి వచ్చినవెంటనే కమిటీలతో కాలయాపన చచేయకుండ వీలైనంత ఎక్కువమందికి లాగేస్తామని, వాళ్ళు అందరిలాగే పని చేస్తున్నా జీతాలలో చాలా వేరియేషను ఉంది ఇది చాలా దారుణం అని అన్నారు. ఎన్నికల మనిపెెష్ఠోలో ఇచ్చిన హోమీల విషయంలో మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినవి, చెప్పనవి ఎన్నో హామీలను నెరవేర్చారు. కాని మన విషయంలో మాత్రం అడవి కాసిన వెన్నెల గానే మిగిలిపోతుంది. GOM అన్నారు దానికి సలహలకోసం మరొక కమిటి ఇవన్ని కాలయాపన కోసం కాకపోతే ఇంకేంటి? చేసే థృక్పదం లేనపుడు ఇంత కాలం లేటు చేయడమెందుకు. కాకపోతే మనం. మరొక సారి మోసపోయామనుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు బ్రదర్.
S brothers chala correct ga chepparu mana avedana evariki pani ledu mana otu matram kavali
ReplyDelete