News

PRESS NOTE ON YSR VARDHANTHI

 

 

పత్రికా ప్రకటన

                                                                                            తేది: 02.09.2020

స్వర్గీయ వై. యస్. రాజశేకర్ రెడ్డి గారి వర్ధంతిని పురష్కరించుకొని ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు అందరు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ సర్గియ వై.యస్. రాజశేకర్ రెడ్డి గారి హయాములో మాత్రమే ఒప్పంద ఉద్యోగులు కాంట్రాక్టు నుండి రెగ్యులర్ అయ్యారు అదేక్రమములో వారి వారసులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని  ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కొరకు వేసిన కమిటీలు కాలయాపన చేస్తూ తమాకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి అని జరురుగుతున్న జాప్యాన్ని నివారించి తమను రెగ్యలర్ చేయాలని రాజశేకర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వినతి పత్రాలు అందించినారు.   

 గ్రామాలలో పట్టణాలలో వైద్య సేవలు అందించుటకు గాను  కర్తార్ సింగ్ కమిటీ (1973) మరియు శ్రీవత్సవ కమిటీ (1975) వారి సిఫార్సుల మేరకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నందు ప్రజారోగ్యం, పరిసరాల పరిశుభ్రత, వ్యాధుల వ్యాప్తి, వివిధ రకాల కీటక జనిత వ్యాధుల నివారణ, స్కూలు పిల్లల ఆరోగ్యం, పుట్టుక మరియు మరణముల రిజిస్ట్రేషన్ వంటి ముఖ్యమైన కార్యక్రమాల నందు పని చేయుటకు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA-Male/Female) లాబ్ టేక్నిషియన్, ఫార్మాసిస్ట్, స్టాఫ్ నర్స్ మరియు ఇతర కేడర్లను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రాధమిక ఉపకేంద్రాలలో పట్టణ ఆరోగ్య కేంద్రాలలో పని చేయుటకు ఏర్పరచి గ్రామీణ మరియు పట్టాన ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉండే లాగా వైద్య ఆరోగ్య శాఖలో రూపుదిద్దినారు.

1999 సంవత్సరంలో ప్రభుత్వం నందు కాంట్రాక్టు సేవలను ప్రారంభించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటు, విద్య, లేబర్  మరియు పంచాయితి రాజ్ మరియు ఇతర శాఖలలో సుమారు ఇప్పటికి 54 వేల మంది  కాంట్రాక్టు ఉద్యోగులను నియమించినారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులలో అధిక శాతం శాతం ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధమియన నియమ నిభందనలు పాటిస్తారో అదే నియమ నిభందనలు పాటించి  జిల్లా కలెక్టర్ వారు అధ్యక్షలుగా  గల  డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC)  ఆధ్వర్యంలో రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ (RoR)  పాటిస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమింపబడి 100% సదరు పోస్ట్ కు అనుమతించిన జీతభాత్యలతో ప్రభుత్వ సాంక్షన్డ పోస్టులో పనిచేయుటకు ఉత్తర్వులు ఇచ్చియున్నారు. 

వివిధ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగస్తుల మచ్చుకు కొన్ని వివరములు

Ø  మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నందు  దాదాపు 21 వేల మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ మరియు ఫిమేల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ మరియు ఇతర కేడర్ల వారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రజారోగ్య కార్యక్రమము లందు పని చేయుచున్నారు.

Ø  ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నందు 3746 వేల మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు త్రిసభ్య మరియు RJD గార్ల సంయుక్త కమిటీ ద్వారా నియమితులైనారు, వీరికి ప్రభుత్వ క్రమబధ్దీకరణ  లేక్చేరర్లకు ఇచ్చే జీతము లో బేసిక్ పే మాత్రము ఇస్తున్నారు,

Ø  ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విద్యా ఉపాధ్యాయలు 1320 మంది ప్రభుత్వ నిబంధన(Reservation and Roster cum Merit Basis)ల ప్రకారం నియమితులైనారు.

Ø  2006 సంవత్సరములో జోనల్ స్థాయి లో చీఫ్ ఇంజనీర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఎక్సపర్ట్ కమిటీ ద్వారా పంచాయితీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో నియమితులైన వారిలో 194 మంది సైట్ ఇంజనీర్లుగా ప్రస్తుతము పనిచేయుచున్నారు

Ø  లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నందు సుమారు వెయ్యి మంది, మరియు మిగతా ప్రదేశములో పనిచేస్తున్న వారందరు DSC ల ద్వారా ఉద్యోగములు సంపాదించినారు.

రాష్ట్రం లో ప్రస్తుతం ఈ క్రింది తెలిపిన ప్రభుత్వ షరతులతో నియమింపబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను  క్రమబధ్దీకరణ  చేయునప్పుడు సర్వీసు,  వయస్సు, పే-ప్రొటెక్షన్ పరిగణలోకి తీసుకోని క్రమబధ్దీకరణ  ప్రక్రియను వెంటనే  చేపట్టవలసినదిగా కోరుచున్నాము.

         ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదించిన రెగ్యులర్ పోస్టులలోని  ఖాళీలలో నియమింపబడి న వారు.

         ప్రస్తుతము చేస్తున్న ఉద్యోగాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇచ్చిన  నోటిఫికేషన్ ద్వారా నియమింపబడిన వారు

         జిల్లా కలెక్టర్ గారు అధ్యక్ష్టలుగా గల జిల్లా సెక్షన్ కమిటీ ద్వారా చేపట్టిన నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారు 

         రూల్ అఫ్ రిజర్వేషన్ పాటిస్తు నియమింపబడిన వారు (ROR)

         రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ద్వారా ఎంపిక కాబడిన వారు (90 మార్కులు) 

         టెక్నికల్ సర్టిఫికేట్ సీనియారిటీకి వెయిటేజ్ పొందిన వారు (10 మార్కులు)

         మెరిట్ ప్రాతిపదికన పనిచేసే ప్రదేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించబడిన వారు 

         జీతాలను  ట్రెజరీల ద్వారా తీసుకుంటున్న వారు.

         10 సంవత్సరాల కంటే ఎక్కవకాలంగా పనిచేస్తున్న వారిని

         ఎప్పటికప్పుడు డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లను విజయవంతంగా పూర్తి చేసిన వారిని పరిగణలోకి తీసుకోమని కోరుచున్నాము. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కమబద్ధికరిoచమని గత ప్రభుత్వములను అనేక దఫాలుగా అభ్యర్దిoచినను కాంట్రాక్టు వారిని రెగ్యులర్ చేయుటకు కావలసిన చట్టమును గాని పద్దతులను గాని రూపకల్పన చేయలేదు, ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చిన విధముగా వైద్య ఖర్చుల నిమిత్తము హెల్త్ కార్డులను మంజూరు చేయవలెనని కాంట్రాక్టు ఉద్యోగుల తరపున చేసిన అభ్యర్ధన కాబినెట్ ఆమోదము పొంది కూడా ఇంతవరకు ఉత్తర్వు లు వెలువడలేదు.

అయితే, గౌరవ. శ్రీ. Y. S. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య మంత్రిగా అధికారంలోకివచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను ఎంత మందిని వీలైతే అంత మందిని క్రమబధ్దీకరణ  చేస్తాము అని ప్రకటించడమే కాకుండా  కాంట్రాక్టు వారిని క్రమబధ్దీకరణ  చేయుట కొరకు క్యాబినెట్ సబ్- కమిటీ ని వెనువెంటనే పై సూచిక ద్వారా  నియమించి నప్పుడు ఒప్పంద ఉద్యోగులు చాలా  ఆనందించారు. కాంట్రాక్టు ఉద్యోగాములో దాదాపు 18 సంవత్సరముల నుండి పనిచేస్తున్నవారికి ఇప్పుడు 50 సంవత్సరాల వయస్సు దాటింది అనేక మంది రిటైర్ అవ్వడానికి చేరువలో ఉన్నారు. 2006 తరువాత పారామెడికల్ సిబ్బంది రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టలేదు. విద్యా శాఖ, పశుసంవర్ధక శాఖ, .పి.ఎస్‌.ఆర్‌.టి.సి, సెరికల్చర్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం గతములో రెగ్యులరైజేషన్ చేసింది.

పై సూచిక 2 మరియు 3 ల ప్రకారముగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధికరించడానికి ఐఎయస్ అధికారులతో వర్కింగ్ కమిటిని నియమించినారు, వర్కింగ్ కమిటి గడువు జూన్ 30 వ తారీఖుతో ముగిసినది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కాటు వేసిన తరుణంలో ఒప్పంద ఉద్యోగులు సాధారణ పని గంటలకన్నా రెండురెట్ల అధిక పనిని ఉద్యోగానికి కేటాయించవలసి వస్తున్నది, ఇటువంటి పరిస్థితులలో మా బాధను అధికారులకు గాని నాయకులకు గాని విన్నవించుకోనుతకు మాకు వ్యయప్రయాసలు కూడిన అంశం అవుతుంది. ఇప్పటికి కరోనా భారిన పడి మరియు అధిక పని భారం వలన సఘతున వారిని ఇద్దరు ఒప్పంద ఉద్యోగులు మరణిస్తున్నారు. ఇంటి పెద్ద / సంపాదించే వ్యక్తిని పోగొట్టుకున్న ఒప్పంద ఉద్యోగి కుటుంబం పరిస్థితిదయనీయంగా మారుతుంది.   

  పైన తెలిపిన పరిస్థితుల దృష్ట్యా, శ్రీ గౌరవ ముఖ్యమంత్రి మంత్రి వర్యులు మరియు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమభద్ధికరణ కమిటీ సభ్యులు వారు, కాంట్రాక్టు ఉద్యోగుల యడల దయవుంచి, కాంట్రాక్టు  ఉద్యోగుల దీన స్థితిని గమనించి, కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబ స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకోని ఇతర రాష్ట్రములలో ఏకమొత్తముగా  కాంట్రాక్టు ఉద్యోగులను క్రమభద్ధికరించిన విధముగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కూడా కొన్ని సంవత్సరములుగా ఎలాంటి ఇతరత్రా సదుపాయాలు లేకుండా కేవలం జీతంతో జీవితం సాగిస్తూ పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధికరణ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.     


                                        

About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.