News

HARASSMENT ON WOMEN HEALTH ASSISTANTS

 గ్రామ సచివాలయంలో లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తల పై వేధింపులు.

వసతులు లేకపోయినా పనులు చేయాలి లేకపోతే ఇంటికే 

ప్రతి దానికి కలెక్టర్ ఆర్డర్ అని భయందోలనకు గురిచేసే విధంగా బెదిరింపులు  

1. ఎంత భయంకరమైన కరోనా నేపథ్యంలో విధులను నిర్వహిస్తున్న ఏఎన్ఎంలను కరోనా వచ్చిన వారికి టెస్ట్ చేయటానికి "శాంపిల్ కలెక్ట్" చేయాలని లేకపోతే ఉద్యోగాలు మానేయాలని డాక్టర్ల హుకుం. 

2. గ్రామీణ మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు లాబ్-టెక్నిషియన్లు ఉన్నాకూడా ANMల చేత టెస్టింగ్ సాంపిల్స్ తిపిస్తున్నారు, కరోనా టెస్టులు చేయటానికి రోగికి ఇచ్చే ID లను ANMల చేత వేయిస్తున్న సూపర్వైజర్లు ఇప్పటికే ICMR (Indian Council of Medical Research) షీట్లను డౌన్లోడ్ చేసి మరల ఎక్సెల్ సీట్లను తయారు చేస్తున్న ANMలు వాటిన్నటిని చేయవలసిన సూపర్వైజర్లు గైర్హాజరు అవుతున్నారు.  

3. ఇప్పటికే అరకొర జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది, సచివాలయం సిబ్బంది చేత సాంపిల్స్ లాబ్ కు పంపడానికి జిప్ లాక్ కవర్స్, ధర్మకోల్ బాక్సులు, గ్లౌజులు, శానిటైజర్, మాస్కులు కొనిపిస్తున్న అధికారులు. వాటికి కేటాయించిన బిల్లులను అధికారులు అరగించేస్తున్న అడిగే నాథుడులేడు. 

4. ఇంత కష్టపడి కోవిడ్ పరీక్షలకోసం శాంపిల్ సేకరించినా తరువాత వాటిని జీజీహెచ్లో (Govt. General Hospital)  పెట్టే బాధ్యత కూడా క్రింది స్థాయి ఏఎన్ఎంలకు అప్పజెప్పి చేతులు దులుపు కుంటున్న డాక్టర్లు,  రాత్రి 10 గంటల సమయంలో శాంపిల్స్ ఉన్న బాక్సులను టెస్టింగ్ సెంటర్ లో అప్పజెప్పి తిరిగి ఇళ్ళకు చేరడానికి సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్న మహిళా ఉద్యోగులు. 

5. ప్రస్తుతం ఎంతో ప్రమాదకరంగా ఉన్న కరోన వ్యాధిని అరికట్టడానికి గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న ఫీవర్ క్లినిక్ లకు కనీసం మందులు కూడా ఇవ్వకుండా మీరు వెళ్లి కూర్చొని వారికి కౌన్సిలింగ్ ఇవ్వండి సరిపోతుంది అని చెబుతున్న అధికారులు. మాత్రలు లేకపోతే వారు మమ్ములను నిలదీస్తారు అని చెప్పిన నా వినిపించుకోకుండా అలా అయితే మిమ్ములను ఇంటికి పంపిస్తాం అని బెదిరిస్తున్న అధికారులు. 

6. ఇంటివద్దే చికిత్స పొందుతూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని సందర్శించి టెంపరేచర్ పరీక్ష చేయవలసిందిగా చెబుతున్న అధికారులు సిబ్బందికి మాత్రం వదలను మాస్క్లను అందించకుండా కరోనా వస్తే మీ బాధ పడతారు మాకు సంబంధం లేదు ఇది కలెక్టర్ ఆర్డర్ అని చెబుతున్నారు ఆర్డర్ చూపించమంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు. 

7. మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా మన సాంప్రదాయం ప్రకారం చీర కట్టుకొని ఉంటున్న ఏఎన్ఎం లకు PPE  కిట్లు వేసుకొని టెస్టులు నిర్వహించవలసిందిగా చెబుతున్న డాక్టర్లు కొన్నిచోట్ల మాత్రం డాక్టర్లే స్వయంగా శాంపిల్స్ తీస్తున్న కొంత మంది మాత్రం మహిళా ఉద్యోగినుల పట్ల వేధింపు ధోరణిలో ఉంటున్నారు. 

8. కరోనా టెస్టుకు కావాల్సిన సాంపిల్స్ సేకరించవలసిన డాక్టర్లు కేవలం ఆసుపత్రులకు పరిమితమై సంబంధిత ల్యాబ్ టెక్నీషియన్ లను కూడా ఎక్కడ టెస్టింగ్ జరుగుతుందో అక్కడికి పంపకుండా ఫీల్డ్ సిబ్బంది చేత సాంపిల్స్ సేకరించే విధంగా దారుణంగా వ్యవహరిస్తున్నారు. 

9. ఆరోగ్య కేంద్రాలలో ఉండే డాక్టర్లు, లాబ్ టెక్నిషియన్లు, సుపర్వైజర్ల తో పని చేయించ కుండ కేవలం గ్రామ సచివాలయం లో పనిచేసే ఏఎన్ఎంలు/MPHAల చేత టెస్టులు చేయించటానికి పూనుకుంటున్నా అధికారులు మేము ఎలా చేస్తాము అన్నవారికి  మెమోలు ఇప్పిస్తాం అని బెదిరింపులు, పై అధికారులకు చెబుతాం అని, DMHO లకు చెబుతాం బెదిరింపులు చేస్తున్నారు గతిలేక వారు ప్రమాదకరమైన పనులు చేయవలసి వస్తుంది. 

10. ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు, ప్రతి సచివాలయం పరిధిలో ఒక ANM/MPHA ఉండేలాగా మ్యాపింగ్ చేసిన కూడా కొన్నిచోట్ల సచివాలయం ఏఎన్ఎం లను డిప్యూటేషన్ పైన ప్రక్క వార్డులకు పంపించి అక్కడ రెగ్యులర్ ఏఎన్ఎం ఉన్నాకూడా సచివాలయం ANMల చేత టెస్టులు చేయిస్తూ హింసిస్తున్నారు. 

11. దీనిని ఆసరాగా తీసుకొని ఇళ్ల వద్దే ఉండిపోతున్న రెగ్యులర్ సిబ్బంది,  నిరంతరాయంగా డ్యూటీలో ఉండి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్న సచివాలయం ANM/MPHAలు. 

12. సచివాలయం ఉద్యోగాల లో ఆరోగ్య కార్యకర్త లుగా చేరిన వారిని సచివాలయంలో ఆరోగ్యశ్రీ కి సంబంధించిన పనులన్నీ ఆరోగ్యమిత్రా లాగా  చేయాలి అని మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో క్షేత్రస్థాయిలో చేయవలసిన పని అంతా చేయాలని రెండు రకాలుగా వినియోగించడానికి ఒత్తిడి చేస్తున్నారు దీనిపై ఎటువంటి విధి విధానాలను ఖరారు చేయకుండా ఉన్నత స్థాయి అధికారులు  ఉండటం వలన ఇటువంటి పరిస్థితి నెలకొన్నది. 

13. గ్రామాలలో/ వార్డులో క్షేత్రస్ధాయి సిబ్బంది గా ఉన్న ఆరోగ్య కార్యకర్తలను ఉదయం పూట కరోనా వ్యాధిగ్రస్తులకు పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించడానికి పీ పీ ఇ కిట్ లు వేసుకొని శాంపిల్స్ సేకరించిన తర్వాత మధ్యాహ్నం నుండి మరల ఫీల్డ్ డ్యూటీకి వెళ్లి సాయంత్రానికల్లా రిపోర్టు చేయాలని చెప్పటం వలన రెండు రకాల పనులు చేయలేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. 

14. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భారతదేశంలో కూడా పాండమిక్ గా గుర్తించి ప్రజలకు సేవలు అందిస్తున్నారు అందుకు ఆరోగ్య సిబ్బంది ఆరు నెలల నుండి నిర్విరామంగా పని చేస్తూనే ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో క్షేత్రస్థాయి సిబ్బంది కి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోవాలని చెప్పటం వలన కేవలం హాజరు నమోదు చేయడానికి సచివాలయానికి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళవలసి రావడం వలన చేసే పనిలో మరింత ఆలస్యం జరుగుతుంది...

15. పెళ్లికి అయినా చావుకు అయినా ఒకటే మేళం అన్నట్లుగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే పురుష ఆరోగ్య కార్యకర్తలు డేటా ఎంట్రీ అపరేటర్లుగా, వాక్సిన్ కారియర్లగా, కరోనా శాంపిల్స్ కలెక్టర్లు గా, ఐసోలిషన్ / క్వారంటైన్ సెంటర్లలో సహాయకులుగా పని చేయించడం వలన శారీరిక మానసిక ఒత్తిడి పెరిగి మృత్యువాత పడుతున్నారు గత 30రోజులలో జరిగిన 4 మరణాలు అందుకు నిదర్శనం. 

అధికారులు పై అంశాలను పరిశీలించి టెస్టులను చేసే బాధ్యత ల్యాబ్ టెక్నీషియన్లు డాక్టర్లు కు మాత్రమే పరిమితం చేయాలని విజ్ఞప్తి చేస్తూ వార్డు గ్రామ సచివాలయాల్లో మ్యాపింగ్ చేసిన విధంగా ఉద్యోగస్తులు ఎక్కడ ఉద్యోగస్తులు అక్కడే  ఏ సమస్య వచ్చినా మ్యాపింగ్ ప్రకారం గా అక్కడ ఉన్న ఏఎన్ఎం గారు మాత్రమే చూసుకునే విధంగా చూడాలని  కేవలం టెస్టులు చేయడానికి ప్రక్క సెంటర్ల డిప్యుటేషన్ వేయకుండా చూడాలని మనవి చేస్తూ. గత ఆరునెలల నుండి విరామం లేకుండా ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందికి కుటుంబం గురించి పట్టించు కోవడానికి మరియు అనారోగ్య పరిస్థితులలో సెలవులు మంజూరు చేయాలని లేదా వీక్లి హాఫ్ లను మంజూరు చేయాలని మనవి చేస్తున్నారు. అదే విధంగా కరోనా పెండమిక్ అయ్యేంత వరకు మెడికల్ అండ్ హెల్త్ లో పనిచేసే క్షేత్రస్ధాయి సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. 




About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.