ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ అలియన్స్ (ఐక్య కార్యాచరణ కమిటీ)
ANDHRA PRADESH MEDICAL & HEALTH ALLIANCE (JOINT ACTION COMMITTEE)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటు నందు పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులారా, మనం విడివిడిగా ఇప్పటివరకు అనేకమంది ముఖ్య మంత్రులను, మంత్రులను, ఎం.ఏల్.ఎ లను, అధికారులను అనేకపర్యాయాలు కలిసాము, విన్నవించాము, విజ్ఞాపనలు, అభ్యర్ధనలు చేసాము అదేవిధంగా పోరాటాలు చేసాము అయినా ఫలితం శూన్యం ఇటువంటి పరిస్థుతులలో మన సమస్యలు తీరాలంటే వున్నది ఒక్కటే పరిష్కార మార్గము అదే ఐక్యంగాపోరాటం చేయడం, మన డిపార్టమెంట్ నందు పనిచేస్తున్న అన్ని ఉద్యోగ సంఘాలు, కేడర్లు, ఉద్యోగులు మన శక్తిని క్రోడీకరించి ఏకోన్మఖులమై మన శక్తిని చాటాలి అంటే అన్ని ఉద్యోగ సంఘాలు కలవాలి.
గత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చాయి వాటన్నిటిని అధికారంలోకి రాగానే మర్చిపోయాయి అదే పంధాలో ప్రస్తుత ప్రభుత్వము కూడా నడుస్తుంది పదవిలోకి రాగానే రెగ్యులర్ చేస్తామన్నారు, ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన మాటలుమరిచారు, మా పుస్తకాలలో (మేనిఫోస్ట్) లాజిక్కులు మీకి అర్ధం కాదు అని బొంకుతున్నారు, కోర్టు కేసులను సరిగా అర్ధం చేసుకోకుండా గౌరవ కోర్టు వారు చెప్పిన సిఫార్సులు వదిలిపెట్టి కేవలం తీర్పు పేరాను మాత్రమే పరిగణలోకితీసుకుంటున్నారు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే కోర్టుల తీర్పును అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది, 19 సంవత్సరాలగా పేరామేడికల్ పోస్టులకు రెగ్యులర్ నోటిఫికేషన్ వేయలేని ప్రభుత్వం 10PRC అమలువిషయంలో ప్రభుత్వ మంజూరు కాబడిన పోస్టులలో చేస్తున్న వారికి కూడా అంతంతమాత్రమే పెంపుదల ఇచ్చినారు, చిన్న కేడర్ల నుండి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికి నిరాశే మిగులుస్తున్నారు, డిపార్టమెంట్ నందు సిబ్బందినిఅనూహ్యంగా తగ్గిస్తూ పనిసరిగా జరగటం లేదని ప్రవేటుకు అప్పగించి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు, క్రొత్తగా ఉద్యోగంలో చేరేవారికి అరకొర జీతాలు మాత్రమే అందేలాగా చేస్తు అన్యాయం చేస్తున్నారు, పెద్దలు ఇచ్చిన మాటలను,వాగ్దానాలను అమలు చేయనందున, మౌళికపరమైన, న్యాయపరమయిన సమస్యలు పరిష్కారం కానందున, గత నాలుగు సంవత్సారాల నుండి వేచి చూసి విసిగి వేసారి గత్యంతరం లేక ఉద్యమబాట పట్టాలని ఆలోచన చేసాము అందుకువిడివిడిగా కాకుండా కలసి పోరాటం చేయాలని ఇదే సరైన మార్గం అని సంఘాల పెద్దలారా, కేడర్ల నాయకులారా, ఉద్యోగస్తులారా ఆలోచించండి.
మన సమస్యలు:
1. GO.217 HM&FW Dept తేది: 26.02.2001 ప్రకారం MPHA(M), MPHA(F), లాబ్ టేక్నిషియన్, ఫార్మాసిస్ట్, స్టాఫ్ నర్స్, అప్తాలమిక్ అసిస్టెంట్, ECANMs’మరియు డాక్టర్ల పోస్టులలో నియమితులైనారో వారినివెంటనే రెగ్యులర్ చేయాలి, అవసరమైన పక్షంలో వీరికి In-service Training ఇచ్చి రెగ్యులర్ అవకాశం కల్పించాలి.
2. 11వ PRC అమలులో కాంట్రాక్టు సిబ్బందికి IR వర్తింపచేయాలి, రెగ్యులర్ ఉద్యోగులకు మొనేటరి భెనిఫిట్ ఇచ్చిన రోజునుండి కాంట్రాక్టు వారికి కుడా PRC ఫలం అందేలా చూడాలి.
3. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరికి టెక్నికల్ మరియు సైంటిఫిక్ వేతనాలు మంజూరు చేయాలి, అందుకు ఒక ఎక్సఫర్ట్ కమిటిని నియమించాలి.
4. వైద్య ఆరోగ్య శాఖలో ప్రస్తుతము వున్నా అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.
5. వైద్య ఆరోగ్య శాఖలోపనిచేస్తున్న MPHA లందరికి MPHW Training, RFPTC లేదా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫుడ్ అడల్ట్రేషన్, మైనర్ ఎలిమెంట్స్ ట్రీట్ మెంట్ మరియు ఇతర అంశాలలో ఇన్ సర్విస్ ట్రైనింగ్ ఇచ్చివారిని గ్రామీణ ప్రాంతాలలో ఫుడ్ అడల్ట్రేషన్ నివారణభాద్యులుగా చేసి వారికి భాద్యతలు అప్పగించాలి.
6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న MPHA(M)లు అందరూ ప్రతిగ్రామములో జననాలు మరియు మరణాలతో సహా జనాభా రికార్డులు కలిగివుంటారు కాబట్టి వారికి జననమరణాల ధృవీకరణ పత్రాల జారిచేయు భాద్యతఅప్పగించాలి
7. MPHA (F) లకు అడిషనల్ HRA మంజూరు చేయాలి, 2nd ANMలకు Sub Center ను రూ.2000కు పెంచాలి.
8. MPHA (F) లేని చోట ఎక్కడైనా 2nd ANM సబ్ సెంటర్ పూర్తి బాద్యతలు వహిస్తువుంటే అదనపు పనికిగాను రూ.5000/-పారితోషకం మంజూరు చేయాలి.
9. NHM నిబందనల ప్రకారం పనిచేసే 2nd ANMలు Out Reach కి వెళ్ళడానికి TA మంజూరు చేయాలి లేదా Out Reach లేకుండా చేయాలి.
10. మెడికల్ అండ్ హెల్త్ డిపార్టమెంట్ కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ESI, EPFమరియు ROYALITY BONUS కల్పించాలి.
11. మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటు నందు కాంట్రాక్టు వారికి సినియారిటితో సంబంధం లేకుండా పనిచేసే కేడర్లో అతితక్కువ జీతం చెల్లిస్తున్నారు కావున వయస్సు పైబడిన ఉద్యోగులు అనారోగ్యానికి వైద్య ఖర్చులనుభరించలేక మృత్యువాత పడుచున్నారు కావున వారికి HEALTH CARD సదుపాయం కల్పించాలి.
12. మెడికల్ అండ్ హెల్త్ డిపార్టమెంట్ కాంట్రాక్టు ఉద్యోగులు డ్యుటిలో వుంది చనిపోతే INSURANCE, Ex Gratia మరియు ఆ ఇంటిలో అర్హులైన వారికి కారున్యనియామకం కల్పించాలి, అవసరం అయితే INSURANCE పైకమును ఉద్యోగిచేల్లిన్చుకునే లాగా ఉత్తర్వులు మంజూరు చేయాలి.
13. రాష్ట్రములో ప్రతి PHCలో ఒక డేటా ఎంట్రి ఆపరేటర్ పోస్టుని ఇవ్వాలి.
14. యూనిఫారం ధరించే (LT,Pharamacyst అండ్ MPHA(M)(F)) ఉద్యోగులకు యూనిఫారం అలవెన్స్ అందించాలి.
15. రెగ్యులర్ సర్వీసు ఉద్యోగులకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అవకాశాలు ఎలా ఉన్నాయో అవన్నీ కాంట్రాక్టు ఉద్యోగులకు కల్పించాలి.
16. కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైన 2nd ANMs’, 104FDHS, 108Employees, ఆరోగ్య శ్రీ ఉద్యోగులు, అర్భన్ హెల్త్ సెంటర్స్, ఆయుష్, DPMU, RNTCP, RCH, Blood Bank, ముఖ్యమంత్రిఆరోగ్యకేంద్రంలలో DSC ద్వారా కాకుండా జాయిన్ అయిన వారికి కావలసిన ట్రైనింగ్ ఇచ్చి వారిని రెగ్యులర్ కు అర్హత కలిగిన వారిగా చేయాలి, వీరి వేతనాలను స్కీమును బట్టి కాకుండా పోస్టును బట్టి రెగ్యులర్ ఉద్యోగులతోసమానంగా వేతనాలు ఇవ్వాలి.
17. రాష్ట్రములో అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి డిపార్టమెంట్ లోనే సొసైటీ నిర్మాణము చేసి జీతభత్యాలు సొసైటీ ద్వారా ఇచ్చుట లేదా ప్రభుత్వ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ద్వారా ఇవ్వాలి, వీరికి ఉద్యోగ బద్రత కల్పించాలి.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ అలియన్స్ (ఐక్య కార్యాచరణ కమిటీ), విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్
ANDHRA PRADESH MEDICAL & HEALTH ALIANCE (JOINT ACTION COMMITTEE)
0 Comments:
Post a Comment