మన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించగలిగే నాయకుడినే ఎన్నుకుందాం : బొప్పరాజు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న వివిధ నియోజకవర్గాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రులైన అందరు ఉద్యోగులు ఓటుగా నమోదు చేసుకుని సదరు ఓటును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి హక్కు, బాధ్యత అని ఏపీ జేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంఖటేశ్వర్లు పిలుపునిచ్చారు.
పలు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ బాధ్యతలతో పాటు రాష్ట్రానికి, ప్రజలకి అవసరమైన సందర్భాలలో ప్రజాపోరాటాలకు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యక్తిగత సహాయాలు తదితర అనేక సందర్భాలలో ముందువరుసలో ఉంటున్నారని. అదేవిధముగా రాజ్యాంగ బద్ధమైన హక్కుల వినియోగంలో కూడా మనం ముందుండాలని అందులో భాగంగానే ప్రధానమైన ఓటు హక్కును తప్పక వినియోగించుకుని సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరారు.
అదే విధముగా మన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించగలిగే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి మన దైన ముద్ర కూడా చూపించవలసిన అవసరం ఉన్నదని సూచించారు
కావున త్వరలో జరగనున్న శాసనమండలి లో పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల్లో పాల్గొనే నిమిత్తము ఓటరు నమోదునకు నవంబర్ 5 వరకు మాత్రమే గడువు యున్నందున, పట్టభద్రులైన ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు మరియు వారి కుటుంబస సభ్యులు అందరూ విధిగా ఓటర్లు గా నమోదు చేసుకోవాలని, ఓటరులుగా వీరందరూ నమోదు అయ్యేటట్లు అన్ని ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘాలు సమయం తక్కువ ఉన్నందున వారి వారి స్థాయిలో అవగాహన కార్యక్రమాలతో, చక్కని కార్యాచరణ ఏర్పాటు చేయడం ద్వారా తమవంతు పాత్రపోషించాలి అని కోరారు.
About JOHN HENRY
0 Comments:
Post a Comment