అమరావతి: ఆంధ్రప్రదేశ్ జెఏసి అమరావతి, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వెసెస్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారానికి అనునిత్యం శ్రమిస్తుంటారని, ప్రభుత్వానికి, ఉద్యగులకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ పలు సమస్యలు పరిష్కారంలో బొప్పరాజు వ్యవహరిస్తున్న తీరు అమోఘమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రోడ్దు రవాణా సంస్థలో గుర్తింపు సంఘాల కొరకు జరిగిన ఎన్నికల్లో “ఎంప్లాయిస్ యూనియన్” విజయం సాధించిన సందర్భంగా.. ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర రావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు శుక్రవారం ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలసి రాష్ట్ర కార్యవర్గాన్ని ముఖ్యమంత్రికి పరిచయం చేసారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ ను చంద్రబాబు అభినందించారు.
ఆర్టీసి కార్మికులకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని, అదేవిధంగా ఆర్ టీ సీ సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు, ఆర్టీసిని పటిష్టపర్చేందుకు అంకితభావంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఈ సందర్భంగా బొప్పరాజు మరియు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్, రాష్ట్ర గజిటేడ్ అధికారులు సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షుడు ఆల్ఫ్రెడ్, రాష్ట్ర పోలీస్ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు J. శ్రీనివాసరావు పలు సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.
ఆర్టీసిని ప్రభుత్వపరం చేయాలని, ప్రభుత్వ సంస్థలకు సంబందించిన గూడ్స్ ను ఆర్టీసి ద్వారా రవాణా చేస్తే ఆర్టీసి ఆదాయం పెరుగుతుందని, ఏప్రిల్ 2017 నుండి ఆర్టీసి ఉద్యోగులకు అందాల్సిన పిఆర్సీ వెంటనే అందించాలని, ఆర్టీసికి డిజిల్ వల్ల కలుగుతున్న నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని, 75సంవత్సరాల నుండి విశ్రాంతి ఉద్యోగులకు 70ఏళ్ళకే 15% అదనపు పింఛను చెల్లించాలని, గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ప్రతి కానిస్టేబుల్ కనీసం 25 సంవత్సరాల నుండి ఎటువంటి పదోన్నతి లేకుండా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 2019 (రెండు వేల తొమ్మిది) హెడ్ కానిస్టేబుల్,566 ఏయస్ఐ (ASI) పోస్ట్ లను వెంటనే మంజూరు చేస్తు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
వీటిపై సానుకూలంగా స్పందించిన సీయం… బొప్పరాజు లాంటీ నాయకుడు దొరకడం ఉద్యోగుల అదృష్టమన్నారు. బొప్పరాజు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చంద్రబాబు చెప్పారు. తిత్లీ తుఫాను భాదితులకు 200 రూపాయలు నాల్గవ తరగతి మరియు విశ్రాంత ఉద్యోగుల నుండి , 500 రూపాయలు మిగిలిన అన్నీ తరగతుల ఉద్యోగుల నుండి తుఫాను బాధితులకు విరాళాలు అందించేందుకు సిద్దంగా వున్నామని, ఇందుకు సంబందించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని బొప్పరాజు మరియు రాష్ట్ర గజిటేడ్ అధికారులు సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.
0 Comments:
Post a Comment