Capital City Amaravati

BOPPARAJU DEMANDING ON BE-HALF OF CONTRACT EMPLOYEES FOR WHITE RATION CARDS


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో వివిధ శాఖలలో పనిచేస్తున్న  ఒప్పంద, పొరుగు సేవల, అంగన్వాడీ, హోమ్ గార్డు ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు కొనసాగించాలి అని APJAC అమరావతి చైర్మన్ శ్రీ. బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలసి విన్నవించారు.
       

గౌII. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు సహృదయంతో ఇటీవల ఒప్పంద, పొరుగు సేవల, అంగన్వాడీ, హోమ్ గార్డు ఉద్యోగులకు  జీత భత్యాలు పెంచినందునకు వారికి సదరు ఉద్యోగులు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటారని తెలియచేసిన బొప్పరాజు వారి జితభత్యములు పెరిగినందున వారి సంవత్సర ఆదాయము పెరుగుతున్నందుని అందువలన  వారికి  దరిద్య రేఖకు దిగువున ఉన్న  వారికి ఉద్దేశించిన తెల్ల రేషన్ కార్డులు చెల్లవుఅని కొందరు అధికారులు చెప్తున్నందున, కొద్దీ రోజుల క్రితం APJAC అమరావతి పక్షాన చైర్మన్ శ్రీ. బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు సివిల్ సప్లైస్  ఉన్నతాధికారులను కలిసి దయచేసి ఒప్పంద, పొరుగు సేవల, అంగన్వాడీ, హోమ్ గార్డు ఉద్యోగుల వంటి చిన్న తరగతి ఉద్యోగుల రేషన్ కార్డులను తొలగించవద్దని కోరడమైనది.


  ఈ  విషయములో ఇంకా ఎలాంటి నిర్ణయం అధికారులు తీసుకోనందున ఒప్పంద, పొరుగు సేవల, అంగన్వాడీ, హోమ్ గార్డు ఉద్యోగులకు తెల్లరేషన్ కార్డులు ఉండాలని ఈ రోజు గౌII. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ అనీల్ చంద్ర పునీత, IAS గారిని APJAC అమరావతి పక్షాన కలిసి "గతంలో గ్రామ రెవెన్యూ సహాయకులు జీత భత్యాలు పెరిగినప్పుడు మీ సిఫారసులు ద్వారా గౌII. ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సహాయకుల రేషన్ కార్డులను కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చియున్నందున. అదే విధంగా ఇటీవల ఒప్పంద, పొరుగు సేవల, అంగన్వాడీ, హోమ్ గార్డు ఉద్యోగుల జీత భత్యాలు కుడా గౌ. ముఖ్యమంత్రి గారు పెంచినందున వీరు కేవలము పాక్షిక ఉద్యోగులు అయినందున VRA లకు ఇచినట్లే వీరికి కూడా మినహాయింపు ఇవ్వవలసినదిగా నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని ప్రత్యేకంగా కొరదమైనది.

    ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు చాలా సానుకూలంగా స్పందించి గౌ. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీలుకువెళ్లి తగు న్యాయం చేస్తామని తెలిపారు.

ఈకార్యక్రమంలో ఎపి గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి శ్రీ బి.కిశోర్ బాబు గారు, ఎపి జేఏసీ అమరావతి  కృష్ణా జిల్లా చైర్మన్ డి ఈశ్వర్, సిటీ JAC చైర్మన్ శ్రీ కూనాటి కళాధర్ గారు, CPS ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ P. రామాంజనేయులు యాదవ్ వారి ప్రధాన కార్యదర్శి శ్రీ బాజీ పఠాన్ గారు, కాంట్రాక్టు ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్  హేన్రి బాబు తదితరులు పాల్గొన్నారు.

About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.