Capital City Amaravati

GOOGLENEWSTELUGU.COM


చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపటమే ఆ “ఐఏఎస్ లక్ష్యమా” ?
ఈ విధంగా మన స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పూనమ్ మాలకొండయ్య   గారిని అనడం మేము కండిస్తున్నాము. 



అమరావతి: ఆమె ఒక సీనీయర్ ఐఏఎస్ అధికారిణి. ప్రభుత్వానికి ఆయువుపట్టు లాంటీ కీలకమైన ఆరోగ్యశాఖలో కీలక పోస్టులో వున్నారు. అటువంటి  అధికారిణి నేడు యావత్తు రాష్ట్రానికే తలనొప్పిగా మారారు. ఏ నిమిషాన ఏ తుగ్లక్ నిర్ణయం తీసుకుంటారో తెలియక ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు , ఆరోగ్య శాఖాధికారులు బెంబేలెత్తిపోతున్నారు.
ఇంతకు ముందు ఆరోగ్యశాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ‘కామినేని శ్రీనివాస్‌’ రాజీనామా చేయడంతో ఆ శాఖను ముఖ్యమంత్రి పర్యవేక్షణలో సిఎంఒ అధికారులు చూస్తున్నారు. ఇట్టువంటి తరుణంలో ఆరోగ్య శాఖాధిపతిగా క్రీయాశీలకంగా వ్యవహరించి, ఆ శాఖను ముందుకు నడిపించి..ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాల్సిన ఆమె అహంకారపూరితంగా ఏకపక్ష్యంగా వ్యవహరిస్తూ,ఎవరినీ ఖాతరు చేయడం లేదని , చిత్ర విచిత్రమైన నిర్ణయాలతో ఆరోగ్యశాఖను వివాదాలమయంగా మార్చేసారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మంత్రులు, ఆరోగ్య శాఖలోని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలు సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి , చంద్రబాబు కు చెడ్డపేరు తీసుకువస్తున్నారని మండిపడుతున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖ… నిత్యం ప్రజలతో మమేకం అవ్వాల్సిన శాఖాధిపతిగా ఈ అధికారిణి తీసుకునే నిర్ణయాలు గతంలో అనేకం వివాదస్పదంగా మారాయి. నేటికీ కూడా ‘మేడం’ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు అనునిత్యం వివాదస్పదంగా మారుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి తలవంపులు తెస్తున్నాయి.
  • అటవీ ప్రాంతంలో నివశిస్తున్న గిరిజనులకు వైద్యసహాయం అందక అనేక మంది గతంలో చనిపోయారు..ఇప్పటికీ చనిపోతున్నారు. కేంద్రం నుండి నిధుల వస్తున్నాయి..రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యశాఖకు భారీగా నిధులు కేటాయిస్తోంది. నిధులు దండిగా ఉన్నా..వైద్య సహాయం అందాల్సిన వారికి అందడం లేదని, ఈ విషయంలో శాఖాధిపతి నిర్లక్ష్యం వహించారని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.
  •  గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ” బసవతారకం మదర్ కిట్స్” పధకం అభాసుపాలై సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే తలదించుకోవాల్సిన దుస్థితి వచ్చింది మేడం గారు తీసుకున్న అడ్దగోలు నిర్ణయం కారణంగానే.
  • ప్రభుత్వ ఉద్యోగస్తులు కాని, తెల్ల రేషన్ కార్డులు లేనట్టువంటీ మధ్యతరగతి ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపట్టిన ” ఆరోగ్య రక్ష్య” పథకం విఫలమై, అతీగతీ లేకుండపోవడంలో కూడా ’ మేడం  గారి సమర్ధతే ’ కారణమని ఆ శాఖ ఉద్యోగులే చెప్పుతున్నారు.
  • పట్టణ, నగర ప్రజలకు నాణ్యమైన, ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందించే ఉద్దేశ్యంతో గత ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ” ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు” కు ప్రజల్లో ఆదరణ, ప్రచారం లేక విఫలం చెందింది కూడా ‘ మేడం గారి ‘ అమోఘమైన నిర్ణయాల కారణంగానే.
  • కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ కమీషనర్, ఎన్ టీ ఆర్ వైద్య సేవ ట్రస్టు సిఇఓ, రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్,  వైద్య విధాన పరిషత్తు కమీషనరు, ప్రభుత్వ బోధనాసుపత్రుల మెడికల్ సూపరింటెండెంటులు, ప్రిన్సిపల్స్, ప్రాంతీయ సంచాలకులు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారులు, జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారులు, అఖరికి సామాజిక ఆరోగ్య కేంద్రాల సూపరింటెండెంటుల పోస్టులను సైతం ఇంచార్జిలతో నింపి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పై నుంచి కింది స్ఠాయి వరకు ఆరోగ్య శాఖను ఇంచార్జీలమయం చేసిన ఘనత ‘ మేడం గారి ‘ హయాంలోనే సాధ్యమైంది.
  • కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ కమీషనర్ గా పనిచేయడం తమ కెరీర్ లోనే ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ బాధ్యతలు చేపట్టేందుకు అనేకమంది సీనీయర్ ఐఏఎస్ లు పోటీపడుతుంటారు. అలాంటిది ఇద్దరు, ముగ్గురు సీనీయర్ ఐఏఎస్ లు ఈ పోస్టు మాకోద్దు అని పారిపోయింది… కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించేందుకు ఏ ఒక్క ఐఏఎస్ ముందుకు రాక… సంవత్సరాలుగా ఇంచార్జి పాలనలో వుంటూ దిక్కుమొక్కు లేని శాఖగా కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ రికార్డు నెలకొల్పింది కూడా ‘ మేడమ్ గారి ‘ హయాంలోనే.
  • ” నేషనల్ హెల్త్ మెషిన్ ” … మన రాష్ట్రానికి సంబందించి నేషనల్ హెల్త్ మెషిన్ అమలులో కోట్లాది రుపాయలు ఎట్టు పోతున్నాయో… ఎంత దుర్వినియోగం అవుతున్నాయో చెబితే జాతీయ స్ఠాయులో మన రాష్ట్రం పరువు గంగలో కలిసిపోయే ప్రమాదం వుంది కావున గప్ చూప్!
  • ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు, ఏరియా ఆసుపత్రులకు మందుల సరఫరాపై పుంఖానుపుంఖాలుగా మీడియాలో కధనాలు వస్తోంది ‘ మేడమ్ గారి ‘ హయాంలోనే.
  • సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న”  ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం ” పై ఉద్యోగ సంఘాల నాయకులు ఆశోక్ బాబు, బొప్పరాజు వెంకటేశ్వర్లు సచివాలయంలోని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కార్యలయం చూట్టూ ప్రదిక్షణలు చేస్తునే వున్నారు. మరి వారి ప్రదిక్షణలు ఎప్పటికి పూర్తి అవుతాయో!
  • ” ఎన్ టీ ఆర్ వైద్య సేవ ట్రస్టు “… దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ కార్యాలయంలోనే ఒక అధికారిణి, మరో అధికారి కలిసి మేడం గారి పేరుతో ఏకంగా కార్యలయంలోనే దుకాణం తెరిచారు. వీళ్ళ బెదిరింపు వసూళ్ళపై అనునిత్యం ట్రస్టు కార్యలయంలో ప్రజాప్రతినిధులు వచ్చి నిలదీయటం అత్యంత సర్వ సాధారణంగా మారింది.
ఈ “ఎన్ టీ ఆర్ వైద్య సేవ ట్రస్టు” గురించి మరో గొప్ప విషయం చెప్పుకోవాలి… సెక్రటరీ స్థాయి             సీనీయర్ ఐఏఎస్ ట్రస్టు సిఇఒ గా విధులు నిర్వర్తించాల్సి వుండగా… ఒక సాధారణ అడిషనల్               డైరెక్టర్  స్థాయి ప్రోఫెసరును ఇంచార్జి సిఇఒగా కొనసాగిస్తున్న ఘనత సాధ్యపడింది కూడా ‘ మేడం              గారి ‘ హయాంలోనే.
  • సుదీర్ఘ కాలం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న1,600 వైద్యుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే తన అమోఘమైన ఏకపక్ష్య తుగ్లక్ నిర్ణయాలతో ఆ వైద్యుల నియమాకాన్ని కూడా వివాదస్పదం చేసి నియమాక ప్రక్రియనే నిలిపివేసి ముఖ్యమంత్రి కార్యలయం పరువును మరో మారు బజారుకీడ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆ కార్యాలయ వర్గాలు ఆరోపిస్తున్నారు.
మేడం గారు వివాదం ఎలా తయారు చేస్తున్నారంటే :
రెగ్యులర్ పద్ధతిలో వైద్యుల నియమాకం చేసేటప్పుడు కాంట్రక్టు పద్ధతిలో పనిచేసే వైద్యులకు వెయిటేజీ ఇవ్వవలసి వుంటుంది. అయితే కొంత మంది కాంట్రక్టు పద్ధతిలో పనిచేసే వైద్యులకు వెయిటేజీ ఇచ్చి, మరికొందరు కాంట్రక్టు వైద్యులకు వెయిటేజీ ఇవ్వకుండా మెమో జారీ చేసి మొత్తం నియమాక ప్రక్రియను వివాదస్పదం చేసారు.
కాంట్రాక్ట్‌ వైద్యులంతా ఎక్కువగా డైరెక్టర్ ఆఫ్ హెల్తు పరిధిలో ఉంటారు. వీరి నియామకం మొత్తం జిల్లాల్లోనే జరుగుతుంది. కాంట్రాక్ట్‌ వైద్యులను నియమించుకునే సమయంలో జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో డిస్ట్రిక్‌ సెలక్షన్‌ కమిటీ(డీఎస్సీ) ఉంటుంది. జిల్లాల్లో కాంట్రాక్ట్‌ వైద్యుల నియామకం మొత్తం డీఎస్సీ ద్వారానే జరుగుతుంది. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో వైద్యులకు నియామకాలు వేరేలా ఉంటాయి. ట్రస్ట్‌ రాష్ట్రం మొత్తానికి చెందింది కావడంతో వైద్యుల నియామానికి ప్రత్యేక కమిటీ ఉంది. ట్రస్ట్‌ సీఈవో నేతృత్వంలో స్టేట్‌ సెలక్షన్‌ కమిటీ వైద్యులతో పాటు మిగిలిన ఉద్యోగులను నియమిస్తుంది.
అయితే ’అతి తెలివి’గా మేడం గారు వైద్యుల నియామాకాల్లో ట్రస్ట్‌ డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వలేమని మెమో ద్వారా తెలపడం జరిగింది. కేవలం డీహెచ్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ వైద్యులకు మాత్రమే వెయిటేజీ ఇస్తామని పేర్కొన్నారు. వైద్యుల నియామకాలకోసం ఆరోగ్యశాఖ ఇచ్చిన జీవోలు, నోటిఫికేషన్‌, మెమోలు ట్రస్ట్‌ వైద్యులకు వ్యతిరేకంగా ఉన్నాయి.
వాస్తవానికి వైద్యుల నియామకాల్లో ట్రస్ట్‌ వైద్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని ట్రస్ట్‌ సీఈవో ఆరోగ్యశాఖ అధికారులకు లేఖ రాశారు. అయినా కూడా డీఎస్సీ ద్వారా ఎంపికైన వారికి మాత్రమే వైద్యుల నియామకంలో ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పడం జరిగింది.
గతంలో ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో ఒక అవీనీతి అధికారిణి మేడం పేరు చెప్పి టార్గేట్ ఇచ్చారని, ఆ వసూళ్ళకు ట్రస్టులోని కాంట్రాక్టు వైద్యులు సహకరించనందుకే కక్ష్య కట్టి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైద్యుల నియామకాల్లో ట్రస్ట్‌ డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ట్రస్టు వైద్యులకు న్యాయం చేయండి – ఉద్యోగుల నేత అరవ పాల్
వైద్యుల నియామకాల్లో ట్రస్ట్‌ డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అన్యాయమని హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (హాంస) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవ పాల్ వ్యాఖ్యానించారు.
జిల్లాల్లో కాంట్రాక్ట్‌ వైద్యుల నియామకం మొత్తం డీఎస్సీ ద్వారానే జరుగుతుంది. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో వైద్యులకు నియామకాలు వేరేలా ఉంటాయి. ట్రస్ట్‌ రాష్ట్రం మొత్తానికి చెందింది కావడంతో వైద్యుల నియామానికి ప్రత్యేక కమిటీ ఉంది. డీఎస్సీ కంటే, స్టేట్‌ సెలక్షన్‌ కమిటీకి అధికారాలు ఎక్కువ ఉంటాయని ఇలాంటి కమిటీ ద్వారా నియామకమైన వైద్యులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమని పాల్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆరోగ్యశాఖ అధికారులు దీనిపై పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
గతంలో వైద్యుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆరోగ్యశాఖ 2013 సెప్టెంబరులో విడుదల చేసింది. ఆ ఏడాది కూడా ట్రస్ట్‌ వైద్యులు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆజయ్‌ సహానే దృష్టికి ట్రస్ట్‌ వైద్యుల సమస్య వచ్చింది. ఆయన వెంటనే స్పందించి ట్రస్ట్‌ వైద్యులు కూడా ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌ పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి కూడా వెయిటేజీ వర్తింప చేయాలని ప్రత్యేకంగా ఒక జీవో 2554 విడుదల చేసారని పాల్ తెలిపారు.
ట్రస్ట్‌ సీఈవో ఆరోగ్యశాఖకు రాసిన లేఖ సీఎం చంద్రబాబు వద్ద పెండింగులో వున్నట్లు మా వద్ద సమాచారం వుంది. దీనిపై ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించక ముందే ఆరోగ్యశాఖ అధికారులు ఒక మెమో విడుదల చేశారు.
సాధారణంగా ఇలాంటి కీలక నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్‌ సీఎం దగ్గరకు వెళ్లిన తర్వాత, ఆయన ఆమోదం లేకుండా అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ కూడా సీఎం చంద్రబాబు వద్దనే ఉంది. కాబట్టి ఆ శాఖకు సంబంధించిన విషయాలు ఆయన దృష్టిలో పెట్టి ఆయన ఆమోదం తెలిపితే తప్ప అమలులోకి వచ్చే వీలుండదు. ఇక నైన మేడం ‘ సూపర్ సీయం ‘ అనే భావనలో నుంచి బయటకు వచ్చి , ఏకపక్ష్య నిర్ణయాలు మానుకోవాలి. ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా వ్యవహరించడం తగదు. ఇప్పటికైన ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోండని అరవ పాల్
సూచించారు.
వైద్య,ఆరోగ్యశాఖాధిపతిగా ఎప్పటి నుంచో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెను ముఖ్యమంత్రి ఎక్కువ గౌరవించారని, అయితే దాన్ని ఆమె అలుసుగా తీసుకుని..ఇష్టారీతిలో వ్యవహరించారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అంటున్నాయి. కొంత మంది ‘మేడం’ పేరు చెప్పుకుని..కోట్లు వెనకేసుకున్నారని ప్రచారం జరుగుతున్న మాటైతే వాస్తవం. అదలా ఉంటే… విధాన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం, నియమాకాలు,బదిలీల్లో అవకతవకలు వంటి వాటికి ముఖ్యమంత్రి చంద్రబాబే జవాబు చెప్పుకోవాల్సిన దుస్థితి దాపురించింది. తప్పులు చేసిన వారు బాగానే ఉన్నారు..ఆశాఖను తన వద్ద అట్టి పెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి పై విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా…త్వరలో ‘మేడం’ ను బదిలీ చేస్తారా..? లేక శాఖాధిపతులను మార్చే సమయంలో ఆమెను తప్పిస్తారా..? వేచి చూడాల్సిందే…?

About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.