శుభోదయం
మిత్రులారా, మన GO27 సవరణ విషయంలో మేము పూర్తి చిత్తశుద్ధితో పని చేస్తున్నాము. మనకు మార్చి16 తారీఖున GO27 విడుదల చేస్తూ GO459లో 2002లో చేరిన మనకు అన్యాయం చేసిన సంగతి విదితమే, అయితే మనకు జరిగిన అన్యాయాన్ని మన ప్రిన్సిపల్ సెక్రెటరీ గారిని కలసి GO27 సవరణ జరిగిన తప్పును మేడంకు వివరించి సవరణ చేయవలసిందిగా జరగటమైనది, తరువాత ఇదే విషయాన్ని CM గారి PS అయిన సతీష్ చంద్రగారి దృష్టికి మరుసటిరోజు తీసుకొని వెళ్లగా వారుకోరిన వివరణ మేరకు మన మేడం గారు GO సవరణ ఖచ్చితంగా చేస్తామని తెలియచేసారు.
ఆ సందర్భములో DPH&FW దగ్గర నుండి మాత్రమే ఫైల్ పెట్టాలని అధికారులు చెప్పిన పిదప మనము DH మేడం దగ్గర నుండి ఫైల్ పెట్టించి అది మన HM&FW డిపార్ట్మెంట్ లో కావసిన విధముగా రాసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు జూన్ నెల మొదటి వారంలో పంపడం జరిగింది.
అక్కడ మన ఫైల్ ఆమోదంపై తర్జనభర్జనలు జరిగి ఫైల్ మూవ్ అయ్యే సమయములో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఇంటర్నల్ ట్రాన్సఫర్స్ జరిగి మొత్తం నెల రోజులు అన్ని ఫైల్స్ తో పాటుగా మన ఫైల్ మూలన పడటం జరిగినది, మరల జులై ఆఖరులో కొత్తగా వచ్చిన స్టాఫ్ మన ఫైల్ మొదలు పెట్టగానే రెడ్డి వచ్చే మెడలు అనే సామెత లాగా ప్రతి విషయాన్ని అందరు అధికారులకు వివరిస్తూ దానిని ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి పంపడానికి ఆగష్టు నెల వరకు అయ్యినది అయితే ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు కూడా కొత్తగా రావడం వలన ఫిజికల్ ఫైల్ లేదు అని ఒకసారి, పెరుగుతున్న జీతాల సంఖ్య సరిగా లేదని ఒకసారి ఫైల్ మరలా మన డిపార్ట్మెంట్ కు పంపబడి అది అన్ని రకాలుగా వారికి అర్ధమయ్యే విధంగా తయారు చేయించి వారికి పంపడం జరిగింది అయితే సెప్టెంబర్ నెలలో ఎక్కువ మొత్తంలో సెలవులు రావడం వలన అక్టోబరు వచ్చిన తరువాత మన ఫైల్ మరల మన ఫైల్ ఫైనాన్స్ సెక్రెటరీ గారికి రావడం జరిగినది అయితే దానిని క్లియర్ చేయకుండా డిస్కర్షన్ అని చెప్పినందువలన మేము అధికారులను బతిమాలి త్వరగా పూర్తి చేయించినాము అయితే డిస్కర్షన్ లో మాట్లాడిన విషయాలు నోట్ వారివద్దకు చేరిన తరువాత మేము ఎన్ని సార్లు కలసి విన్నవించినా కూడా ఆయన తాత్సారం చేస్తూ వున్నారు త్వరలో దసరా సెలవులు రాబోవుచున్న దృష్ట్యా వచ్చే వారం అంతా సెక్రెటరీయేట్ పనిచేయదు అందువలన మన ఫైల్ 11,12 తారీఖులలో క్లియర్ చేయించుకోవడము కీలకం అవుతుంది అయితే ఎక్కువ ప్రెజర్ పెట్టడం వలన నా వల్ల కాదు GOM లో తేల్చుకోండి అనిచెప్పే ప్రమాదం ఉంది కావున ఆచితూచి అడుగు వేయవలసి వస్తుంది
మిత్రులు జరుగుతున్న ఆలస్యానిని అర్ధం చేసుకోండి, అయితే మనం ఇక్కడ ఒక పొరపాటు చేస్తున్నాము ఫైల్ పైన మేము సెక్రెటరియేట్ లో తిరిగి చేసేది తప్ప బయటనుండి ఒత్తిడి అనేది అస్సలు లేకుండా ఉన్నది మేము సెక్రెటరియేట్ లో పని చూస్తూ బయట ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం విలుకాకుండా ఉంది కావున జిల్లాలో నాయకత్వం వహించే మిత్రులు ఈ విషయం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ధర్నా కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తూ ప్రభత్వము పై ఒత్తిడి పెంచుటకు ప్రయత్నము చేయవలసిందిగా కోరుచున్నాను.
S. John Henry
9059279777.
0 Comments:
Post a Comment